సంజయ్ దత్

(సంజయ్ దత్త్ నుండి దారిమార్పు చెందింది)

సంజయ్ దత్ ప్రముఖ హిందీ సినిమా నటుడు. ఇతని తల్లిదండ్రులు సునీల్ దత్, నర్గిస్ దత్లు ఇద్దరు కూడా సుప్రసిద్ద నటులే. సోదరి ప్రియా దత్ పార్లమెంటు సభ్యురాలు.

సంజయ్ దత్
Dutt in May 2012
జననం
Sanjay Balraj Dutt

(1959-07-29) 1959 జూలై 29 (వయసు 64)
ఇతర పేర్లుSanju Baba, Sanju, Baba, Deadly Dutt, Munna Bhai
వృత్తిFilm actor, film producer, Comedian, Politician, Television presenter,
క్రియాశీల సంవత్సరాలు1972, 1981–2013 (Semi Retired)
జీవిత భాగస్వామిRicha Sharma(1987–1996) (deceased)
Rhea Pillai(1998–2005) (divorced)[1]
Manyata Dutt (2008–present)
పిల్లలుTrishala,Shahraan,Iqra
తల్లిదండ్రులుSunil Dutt
Nargis Dutt

వ్యక్తిగత జీవితం

మార్చు
 
2011లో భార్య మాన్యతా దత్ తో సంజయ్

ప్రముఖ బాలీవుడ్ నటులు సునీల్ దత్, నర్గీస్ ల సంతానం సంజయ్. ఆయన తల్లి 1981లో, తన మొదటి సినిమా విడుదల సమయంలో చనిపోయారు. సంజయ్ డ్రగ్స్ కు అలవాటు పడటం వల్లనే ఆయన తల్లి చనిపోయారని అంటారు.[2] తన తండ్రి నటించిన రేష్మా ఔర్ షేరా చిత్రంలో గవాలీ గాయకుని పాత్రలో బాల నటునిగా నటించారు.[3]

1987లో నటి రిచా శర్మను వివాహ చేసుకున్నారు సంజయ్.[4] 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్ తో మరణించారు. వీరికి ఒక కూతురు త్రిషాలా ఉన్నారు. రిచా మరణం తరువాత సంజయ్ కు ఆయన కూతురు కస్టడీ దొరకలేదు. దాంతో ఆమె తన అమ్మమ్మ, తాతయ్యలతో అమెరికాలో ఉంటున్నారు.[5] 1998లో మోడల్ రియా పిళ్ళైను రెండో వివాహం చేసుకున్నారు సంజయ్.[6] 2005లో వారు విడాకులు తీసుకున్నారు. రెండేళ్ళ డేటింగ్ తరువాత 2008లో మాన్యతా దత్ ను గోవాలో మూడో పెళ్ళి చేసుకున్నారు ఆయన.[7][8] 21 అక్టోబరు 2010న వారికి కవల పిల్లలు పుట్టారు. అబ్బాయి షహ్రాన్, అమ్మాయి ఇక్రా[9]

వివాదాలు

మార్చు

1993 బొంబాయి బాంబు పేలుళ్ళ ఘటనలో న్యాయస్థానం ఇతనికి 5 సంవత్సరాల కారాగార శిక్ష విధించింది.

గాయకునిగా

మార్చు

బాల నటుడిగా ఉన్నప్పుడు 1972 లో తన తండ్రి ప్రారంభించిన చిత్రం "రేష్మ ఔర్ షెరా"లో ఒక కవ్వాలి గాయకునిగా చిన్నపాత్రలో కనిపిస్తాడు.

సినిమాలు

మార్చు

నటునిగా

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర దర్శకుడు నోట్స్
1971 రేష్మ ఔర్ షెరా కవ్వాలీ గాయకుడు (బాల నటుడు) సునిల్ దత్ [10]
1981 రాకీ రాకేష్/రాకీ మొదటి సినిమా[4][11]
1982 విధాతా కునాల్ సింగ్
1982 జానీ ఐ లవ్ యూ రాజు ఎస్. సింగ్/జానీ
1983 మై ఆవారా హూ సంజీవ్ "సంజు" కుమార్ అషిమ్ సమంత [12]
1983 బేకార్ శ్యామ్
1984 మేరా ఫైస్లా రాజ్ సక్సేనా
1984 జమీన్ ఆస్మాన్ భరత్ రంగాచార్య [13]
1985 జాన్ కీ బాజీ అజయ్ కశ్యప్ [14]
1985 దో దిల్ కీ దస్తాన్ విజయ్ కుమార్ సక్సేనా ఎ.వి.త్రిలోక్ చందర్ [15]
1986 మేరా హక్ ప్రిన్స్ అమర్ సింగ్
1986 జీవా జీవా/జీవన్ కుమార్
1986 నామ్ విక్కీ కపూర్
1987 నామ్ ఓ నిషాన్ ఇన్ స్పెక్టర్ సూరజ్ ఎస్. సింగ్
1987 ఇనామ్ దస్ హజార్ కమల్ మల్హోత్రా
1987 ఇమాందార్ రాజేష్ "రాజు"
1988 జీతా హై షాన్ సే గోవిందా
1988 మొహొబ్బత్ కే దుష్మన్ హషిమ్
1988 ఖత్రూం కే ఖిలాడీ రాజేష్
1988 కబ్జా రవి వర్మ
1988 మర్దూన్ వాలీ బాత్ టింకూ
1989 తాకత్వర్ ఇన్ స్పెక్టర్ అమర్ శర్మ
1989 కానూన్ అప్నా అప్నా రవి
1989 హమ్ భీ ఇన్సాన్ హై భోలా
1989 హత్యర్ అవినాష్
1989 దో ఖైదీ మనూ
1989 ఇలాకా ఇన్ స్పెక్టర్ సూరజ్ వర్మ
1990 జహరేలాయ్ రాకేష్ "రాకా" రాయ్
1990 తీజా తీజా/సంజయ్
1990 ఖతర్నాక్ సూరజ్ "సన్నీ"
1990 జీనే దో కరమ్ వీర్
1990 క్రోధ్ విజయ్ "మున్నా" "విజ్జు" వి.శుక్లా
1990 థానేదార్ బ్రిజేష్ చందర్ (బ్రిజు)
1991 సడక్ రవి
1991 ఖుర్బానీ రంగ్ లాయేగీ రాజ్ కిషన్
1991 ఖూన్ కా కర్జ్' అర్జున్
1991 ఫతే కరణ్
1991 యోధా సూరజ్
1991 దో మత్వాలే అజయ్ "జేమ్స్ బాండ్ 009"
1991 సాజన్ అమన్ వర్మ/సాగర్ ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
1992 జీనా మర్నా తేరే సంగ్ రాజా
1992 అధర్మ్ విక్కీ వర్మ
1992 సహేబ్జాదే రాజా
1992 సర్ఫిరా సురేష్ సిన్హా
1992 యల్గార్ విశాల్ సింఘల్
1993 సహిబాన్ కున్వర్ విజయ్ పాల్ సింగ్
1993 ఖల్ నాయక్ బలరాం ప్రసాద్ "బల్లు" ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
1993 క్షత్రియా విక్రమ్ సింగ్
1993 గుమ్రహ్ జగన్ నాథ్ (జగ్గు)
1994 జమానే సే క్యా డర్నా విక్రం "విక్కీ" వి.సింగ్
1994 ఇన్సాఫ్ అప్నే లాహో సే రాజు
1994 ఆటిష్ బాబా
1994 అమాంత్ విజయ్
1995 జై విక్రాంతా విక్రాంతా ఎ.సింగ్
1995 ఆందోళన్ ఆదర్ష్ ప్రదాన్
1996 నమక్ గోపాల్
1996 విజేత అడ్వొకేట్ అశోక్
1997 సనమ్ నరేంద్ర ఆనంద్
1997 మహాంతా సంజయ్ "సంజు" మల్హోత్రా
1997 దస్ కెప్టెన్ రాజా సేథీ సినిమా పూర్తవ్వలేదు
1997 దౌడ్ లో
1998 దుష్మన్ మేజర్ సూరజ్ సింగ్ రాథోడ్
1999 దాగ్ కెప్టెన్ కరణ్ సింగ్
1999 కర్టూస్ రాజా/జీత్ బల్ రాజ్
1999 సఫారీ కిషన్ "కెప్టెన్" జతిన్ ఖన్నా
1999 హసీనా మాన్ జాయేగీ సోనూ
1999 వాస్తవ్ రఘు ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం గెలుచుకున్నారు
1999 ఖూబ్ సూరత్ సంజు (సంజయ్ శాస్త్రి)
2000 ఖౌఫ్ ఆంతోనీ/విక్కీ/బాబు
2000 భాగీ రాజా
2000 చల్ మేరే భాయ్ విక్కీ ఒబెరాయ్ డేవిడ్ ధావన్ [16]
2000 జంగ్ బల్లీ
2000 మిషన్ కాశ్మీర్ ఎస్.ఎస్.పి ఇన్యాంత్ ఖాన్ విధు వినోద్ చోప్రా ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్[17]
2000 కురుక్షేత్ర ఎ.సి.పి పృధ్వీరాజ్ సింగ్ మహేష్ మంజ్రేకర్ [18]
2001 జోడి నెం.1 జై
2002 పితాహ్ రుద్ర
2002 హమ్ కిసీ సే కమ్ నహీ మున్నా భాయ్
2002 మైనే దిల్ తుఝ్కో దియా భాయీజాన్
2002 హత్యార్ రోహిత్ రఘునాథ్ శివల్కర్
2002 అనర్ధ్ ఇక్బాల్ డేంజర్
2002 కాంటే జయ్ "అజ్జు" రెహాన్ సంజయ్ గుప్త ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్ [19]
2003 ఏక్ ఔర్ ఏక్ గ్యారా సితారా
2003 లాక్ కార్గిల్ జోషి
2003 మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్ మురళి ప్రసాద్ శర్మ (మున్నాభాయ్) ఫిలింఫేర్ ఉత్తమ హాస్యనటుడు పురస్కారం గెలుచుకున్నారు
2004 ప్లాన్ ముస్సాభాయ్
2004 రుద్రాక్ష్ వరుణ్
2004 రక్త్ రాహుల్
2004 దీవార్ ఖాన్
2004 ముసఫిర్ బిల్లా
2005 పరిణీత గిరీష్ శర్మ ఉత్తమ సహాయ నటుడు పురస్కారానికి నామినేషన్
2005 దస్ సిద్ధాంత్ ధీర్
2005 షాదీ నెం.1 లఖ్విందర్ "లక్కీ" సింగ్
2005 శబ్ద్ షౌకత్ వశిష్ట్
2006 జిందా బాలాజిత్ "బాలా" రాయ్
2006 తధాస్తూ రవి రాజ్ పుత్
2006 సర్హద్ పార్ రంజిత్ సింగ్
2006 ఆంతోనీ కౌన్ హై మాస్టర్ మదన్
2006 లగే రహో మున్నా భాయ్ మురళి ప్రసాద్ శర్మ (మున్నా భాయ్) ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్
2007 షూట్ ఔట్ ఏట్ లోఖండ్ వాలా ఎసిపి షంషేర్ ఖాన్
2007 ఢమాల్ ఇన్ స్పెక్టర్ కబీర్ నాయక్
2008 మెహబూబా శ్రవణ్ "ఎస్.డి" ధరివాల్
2008 కిడ్నాప్ విక్రాంత్ రైనా
2009 లక్ కరిమ్ మౌస్సా
2009 అలాడిన్ ది రింగ్ మాస్టర్ (అతిధి పాత్ర)
2009 బ్లూ సాగర్ సేట్జీ సింగ్
2009 ఆల్ ది బెస్ట్:ఫన్ బిగిన్స్ ధరమ్ కపూర్
2010 లమ్హా విక్రం సభర్వాల్
2010 నాక్ ఔట్ వీర్ విజయ్ సింగ్ మణి శంకర్ [20]
2010 నో ప్రాబ్లమ్ యష్ అంబానీ
2011 డబుల్ ఢమాల్ కబీర్ నాయక్ ఇంద్ర కుమార్ [21]
2011 చతుర్ సింగ్ టూ స్టార్ చతుర్ సింగ్ అజయ్ చండోక్ [22]
2011 రాస్కెల్స్ చేతన్ చౌహాన్ డేవిడ్ ధావన్ [23]
2012 అగ్నిపథ్ కంచ చీనా కరణ్ మల్హోత్రా [24]
2012 డిపార్ట్ మెంట్ మహదేవ్ భోన్స్లే రాం గోపాల్ వర్మ [25]
2012 సన్ ఆఫ్ సర్దార్ బిల్లు అశ్విన్ ధిర్ [26]
2013 జిల్లా ఘజియాబాద్ ఎస్పీ ప్రీతం సింగ్ ఆనంద్ కుమార్ [27]
2013 పోలిస్ గిరీ డిసిపి రుద్ర ఆదిత్య దేవ రాజ్ (బాబా) కె.ఎస్.శివకుమార్ [28]
2013 జంజీర్ షేర్ ఖాన్ అపూర్వ లఖియా [29]
2014 ఉంగ్లీ ఎసిపి కాలే రంసిల్ డి 'సిల్వా
2014 పికె భాయ్ రోన్ సింగ్ రాజ్ కుమార్ హిరానీ
2017 విధు వినోద్ చోప్రా తరువాతి సినిమా విధు వినోద్ చోప్రా నిర్మాణంలో ఉంది[30]
2017 రోహిత్ జగ్రాజ్ చౌహాన్ తరువాతి సినిమా రోహిత్ జగ్రాజ్ చౌహాన్ నిర్మాణంలో ఉంది[31]
2017 టోటల్ ఢమాల్ ఇంద్ర కుమార్ నిర్మాణంలో ఉంది[32]
2017 ఖల్ నాయక్ రిటర్న్స్ బల్లు బలరామ్ ఇంకా ప్రకటించలేదు నిర్మాణంలో ఉంది[33][34]
2017 సిద్దార్ధ్ ఆనంద్ తరువాతి సినిమా సిద్దార్ధ్ ఆనంద్ నిర్మాణంలో ఉంది[35]

నిర్మాతగా..

మార్చు
 • షార్ట్ కట్: ది కాన్ ఈస్ ఆన్... (2010)
 • రాస్కెల్స్ (2011)
 • బిగ్ బాస్ 5

అతిధి పాత్రలు చేసిన సినిమాలు

మార్చు
సంవత్సరం చిత్రం పాత్ర
1993 మేరీ ఆన్ స్వంత పాత్ర
1994 ప్యార్ కా రోగ్ స్వంత పాత్ర
1998 చంద్రలేఖ (తెలుగు సినిమా) అతిధిపాత్ర
1998 అచానక్ స్వంత పాత్ర
2000 రాజు చాచా గఫూర్
2000 నిదాన్ స్వంత పాత్ర
2002 యే హై జాల్వా షేరా
2004 ముసఫిర్ బిల్లా
2005 టాంగో చార్లీ విక్రమ్ రాథోడ్
2005 విరుద్ధ్..ఫ్యామిలీ కమ్స్ ఫర్స్ట్ అలీ అస్గర్
2005 ఏక్ అజ్నబీ అతిథి పాత్ర
2005 వాహ్! లైఫ్ హోతో ఐసీ! యమరాజ్ ఎం.ఎ
2006 ట్యాక్సీ నెం. 9211 వ్యాఖ్యాత
2006 ఆంతోనీ కౌన్ హై మాస్టర్ మదన్
2007 ఏకలవ్య:ది రాయల్ గార్డ్ డిఎస్పీ పన్నాలాల్ చోహర్
2007 ఓం శాంతి ఓం స్వంత పాత్ర
2007 దస్ కహనియన్ బాబా హైదరాబాదీ
2008 వుడ్ స్టాక్ విల్లా గౌరవ్
2008 సూపర్ స్టార్ స్వంత పాత్ర
2008 ఎమీ సత్తర్ భాయ్
2009 షార్ట్ కట్ ఐటం సాంగ్
2009 కల్ కిస్నే దేఖా ప్లేబ్యాక్ సింగర్ (అతిధి పాత్ర)
2010 తూన్పుర్ కా సూపర్ హీరో వ్యాఖ్యాత
2010 తీస్ మార్ ఖాన్ వ్యాఖ్యాత
2011 రెడీ డైవర్స్ లాయర్
2011 రా.వన్ ఖల్ నాయక్
2011 దేసీ బాయ్స్ దేసీ బాయ్స్ & ఎన్బీఎస్పీ:ఓనర్
2013 హం హై రహీ కార్ కే పోలీస్ ఇన్ స్పెక్టర్ కరాటే

అవార్డులు నామినేషన్లు

మార్చు

ఫిలింఫేర్ అవార్డులు

మార్చు
 • 1992: సాజన్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 1994: ఖల్ నాయక్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2000: వాస్తవ్:ది రియాలిటీ-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
 • 2001: మిషన్ కాశ్మీర్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2003: కాంటే-ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-ఫిలింఫేర్ ఉత్తమ హాస్య నటుడు పురస్కారం-గెలిచారు
 • 2006: పరిణీత-ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2007: లగే రహో మున్నాభాయ్-ఫిలింఫేర్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్

స్టార్ స్క్రీన్ అవార్డులు

మార్చు
 • 2000: వాస్తవ్:ది రియాలిటీ-స్టార్ స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
 • 2001: కురుక్షేత్ర-స్టార్ స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2001: మిషన్ కాశ్మీర్-స్టార్ స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-గెలిచారు
 • 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-స్క్రీన్ ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2005: ముసఫిర్-స్క్రీన్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం-నామినేషన్

అంతర్జాతీయ భారత ఫిలిం అకాడమీ అవార్డులు

మార్చు
 • 2000: వాస్తవ్:ది రియాలిటీ-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు
 • 2001: మిషన్ కాశ్మీర్-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్
 • 2007: లగే రహో మున్నాభాయ్-ఐఫా ఉత్తమ నటుడు పురస్కారం-నామినేషన్[1] Archived 2008-06-21 at the Wayback Machine
 • 2010: ఆల్ ది బెస్ట్:ఫన్ బిగిన్స్-ఐఫా ఉత్తమ హాస్య నటుడు పురస్కారం-గెలిచారు [2]

గ్లోబల్ భారత ఫిలిం అవార్డులు

మార్చు
 • 2006: లగే రహో మున్నాభాయ్-గ్లోబల్ భారత ఫిలిం ఉత్తమ నటుడు పురస్కారం-విమర్శకుల ఎంపిక[36]

స్టార్ డస్ట్ అవార్డులు

మార్చు
 • 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-స్టార్ డస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం-మేల్-గెలిచారు
 • 2007: లగే రహో మున్నాభాయ్-స్టార్ డస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం-మేల్-గెలిచారు[37]
 • 2013: అగ్నిపథ్-స్టార్ డస్ట్ బెస్ట్ యాక్టర్ ఇన్ నెగెటివ్ రోల్ పురస్కారం-మేల్-గెలిచారు[38]

జీ సినీ అవార్డులు

మార్చు
 • 2001: మిషన్ కాశ్మీర్-జీ ప్రీమియర్ చాయిస్-మేల్-గెలిచారు
 • 2007: లగే రహో మున్నాభాయ్-జీ సినీ అవార్డులు-ఉత్తమ నటుడు (మేల్) విమర్శకుల ఎంపిక్-గెలిచారు[39]

బాలీవుడ్ మూవీ అవార్డులు

మార్చు
 • 2003: కంటే-బాలీవుడ్ మూవీ అవార్డులు-విమర్శకుల ఎంపిక మేల్-గెలిచారు
 • 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-బాలీవుడ్ మూవీ అవార్డులు-మోస్ట్ సెన్సేషనల్ నటుడు-గెలిచారు

బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్ అవార్డులు

మార్చు
 • 2004: మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్-బెంగాల్ ఫిలిం జర్నలిస్టుల అసోసియేషన్-ఉత్తమ నటుడు పురస్కారం-గెలిచారు [40]

మిగిలిన పురస్కారాలు

మార్చు
 • 2004: సెలబ్రిటీ స్టైల్ మేల్ ఎట్ ది బాలీవుడ్ ఫ్యాషన్ అవార్డులు-గెలిచారు

మూలాలు

మార్చు
 1. "Marital woes". Archived from the original on 2012-02-25. Retrieved 2013-10-17.
 2. "Sanjay Dutt used to Drugs". bollywoodmantra.com. Archived from the original on 2013-09-27. Retrieved 2013-08-22.
 3. PTI (2 September 2013). "Sanjay Dutt to do a qawwali after 41 years in Zanjeer". The Indian Express. Retrieved 2016-05-17.
 4. 4.0 4.1 "I have become a family man: Sanjay Dutt". The Express Tribune. Retrieved 2010-10-21.
 5. "Sanjay Dutt's tearful reunion with daughter in the Bahamas". Rediff. Retrieved 2010-10-21.
 6. "Life and loves of Sanjay Dutt he is a really fantastic". NDTV. Archived from the original on 2011-07-14. Retrieved 2010-10-21.
 7. "Unknown starlet Dilnawaz's journey to Mrs Manyata Dutt". Ibnlive.in. Archived from the original on 2011-08-08. Retrieved 2010-10-21.
 8. "Sanjay Dutt marries Manyata". Reuters. 11 February 2008. Archived from the original on 2009-04-18. Retrieved 2010-10-21.
 9. "Manyata Dutt delivers twins". Times of India. 21 October 2010. Archived from the original on 2013-12-12. Retrieved 2010-10-21.
 10. "(1971)". Retrieved 8 July 2014.
 11. http://www.imdb.com/title/tt0215132
 12. "(1983)". Retrieved 8 July 2014.
 13. "(1984)". Retrieved 8 July 2014.
 14. "(1985)". Retrieved 8 July 2014.
 15. "(1985)". Retrieved 8 July 2014.
 16. "00".
 17. "00".
 18. "00".
 19. "02".
 20. "10".
 21. "11".
 22. "11".
 23. "11".
 24. "12".
 25. "(2012)".
 26. "(2012)".
 27. "(2013)". Retrieved 8 July 2014.
 28. "(2013)". Retrieved 8 July 2014.
 29. "(2013)". Retrieved 8 July 2014.
 30. http://www.bollywoodhungama.com/news/17986312/Sanjay-Dutt-in-an-emotional-father-daughter-film-by-Vinod-Chopra
 31. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-07-12. Retrieved 2016-07-31.
 32. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-06. Retrieved 2016-07-31.
 33. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-12. Retrieved 2016-07-31.
 34. http://www.hindustantimes.com/bollywood/sanjay-dutt-to-reprise-ballu-balram-in-khalnayak-returns/story-u6D2SAF0Z4sPikWXyx1d1O.html
 35. http://www.bollywoodhungama.com/news/17448680/Sanjay-Dutt-starring-in-Siddharth-Anands-next-film
 36. "2006 Global Indian Film Awards". mygifa.com. Archived from the original on 2007-09-27. Retrieved 2006-12-10.
 37. "Max Stardust Awards Winners". Archived from the original on 2008-06-09. Retrieved 2016-07-31.
 38. "NDTV Movies". ndtv.com. Archived from the original on 2013-01-30. Retrieved 2015-08-21.
 39. "Winners of the Zee Cine Awards 2007". Archived from the original on 2009-05-24. Retrieved 2016-07-31.
 40. "67th Annual BFJA Awards". Archived from the original on 2015-05-22. Retrieved 2016-07-31.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=సంజయ్_దత్&oldid=4194467" నుండి వెలికితీశారు