సంజయ్ దేశ్‌ముఖ్

సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ (జననం 21 ఏప్రిల్ 1968) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు డిగ్రాస్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా పని చేసి, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో గడ్చిరోలి - చిమూర్ నియోజకవర్గం నుండి  తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

సంజయ్ దేశ్‌ముఖ్
సంజయ్ దేశ్‌ముఖ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2024 జూన్ 4
ముందు భావనా ​​పుండ్లికరావు గావాలి (పాటిల్)
నియోజకవర్గం యావత్మాల్-వాషిం

పదవీ కాలం
(1999-2004), (2004 – 2009)
ముందు శ్రీకాంత్ వామన్‌రావ్ ముంగిన్వార్
తరువాత సంజయ్ దులీచంద్ రాథోడ్
నియోజకవర్గం డిగ్రాస్

రాష్ట్ర మంత్రి
క్రీడలు & యువజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
(2001 – 2004)

వ్యక్తిగత వివరాలు

జననం (1968-04-21) 1968 ఏప్రిల్ 21 (వయసు 56)
చించోలి , దిగ్రాస్ మండలం, యవత్మాల్ జిల్లా, మహారాష్ట్ర
రాజకీయ పార్టీ శివసేన (యుబిటి) (2022-ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ (2017-2019)
భారత జాతీయ కాంగ్రెస్ (2009-2017)
స్వతంత్ర (1999-2009) & (2019-2022)
శివసేన (1996-1999)
జీవిత భాగస్వామి వైశాలితై సంజయ్‌రావు దేశ్‌ముఖ్
సంతానం 2
నివాసం దిగ్రాస్, యవత్మాల్ జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

వ్యక్తిగత జీవితం

మార్చు

సంజయ్ ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ 21 ఏప్రిల్ 1968న మహారాష్ట్ర రాష్ట్రం, చించోలిలో ఉత్తమ్‌రావ్ దేశ్‌ముఖ్ (పోలీస్ పాటిల్) & సవితాబాయి దేశ్‌ముఖ్‌ దంపతులకు జన్మించాడు. ఆయన డిగ్రాస్‌లోని దిన్‌బాయి విద్యాలయంలో పాఠశాల విద్యను, అమరావతి యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. సంజయ్ వైశాలితై దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

మూలాలు

మార్చు
  1. The Indian Express (4 June 2024). "2024 Maharashtra Lok Sabha Election Results: Full list of winners on 48 Lok Sabha seats" (in ఇంగ్లీష్). Archived from the original on 5 July 2024. Retrieved 5 July 2024.