సంజయ్ సింగ్
సంజయ్ సింగ్ (జననం 1972 మార్చి 22) భారతీయ రాజకీయ నాయకుడు రాజ్యసభ సభ్యుడు.[1] ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు, ఉత్తరప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల ఇన్‌చార్జిగా ఉన్నారు.
సంజయ్ సింగ్ | |||
| |||
రాజ్యసభ సభ్యుడు
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2018 జనవరి 28 - 2023 జనవరి 27 | |||
రాష్ట్రపతి | రామ్ నాథ్ కోవింద్ | ||
---|---|---|---|
ముందు | కరణ్ సింగ్ | ||
నియోజకవర్గం | ఢిల్లీ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1972 మార్చి 22 సుల్తాన్ పూర్ ఉత్తరప్రదేశ్ భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | ఆమ్ ఆద్మీ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | సమాజ్ వాదీ పార్టీ | ||
జీవిత భాగస్వామి | అనిత సింగ్ | ||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
సామాజిక సేవ
మార్చుఅతను 1994లో లక్నోలో ఆజాద్ సమాజ్ సేవా సమితిని స్థాపించాడు. . పేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు. పేదల కోసం పలు ఉద్యమాలలో పాల్గొన్నాడు.
అతను డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీకి చెందిన సోషలిస్ట్ నాయకుడు రఘు ఠాకూర్‌కి సహచరుడు. సంజయ్ సింగ్ గుజరాత్, ఉత్తరాఖండ్, జమ్మూ, కాశ్మీర్, తమిళనాడు నేపాల్ లలో విపత్తు సమయంలో సహాయక చర్యలకు కూడా తన సేవలను అందించారు .
రాజకీయ జీవితం
మార్చు2018 జనవరిలో ఢిల్లీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఎన్నికయి ప్రమాణ స్వీకారం చేశారు.[2]
సింగ్ 2018 నుండి పార్లమెంటులో చురుకుగా ఉన్నారు దేశంలోని సమస్యలపై దైర్యంగా పోరాడుతున్నారు. అతను బొగ్గు ఉక్కుపై స్టాండింగ్ కమిటీ సభ్యుడు.
ఆయన పార్టీ సభ్యుడు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి ఢిల్లీ మద్యం కుంభకోణంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై 2023 అక్టోబరు 4న సంజయ్ సింగ్ ను అరెస్ట్ చేశారు.[3] సంజయ్ సింగ్‌కు సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్ 03న బెయిల్ మంజూరు చేసింది.'బొద్దు పాఠ్యం'[4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (20 March 2024). "రాజ్యసభ సభ్యుడిగా సంజయ్‌సింగ్ ప్రమాణం". Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ "Rajya Sabha: AAP makes an entry into Rajya Sabha with three MPS | India News - Times of India".
- ↑ The Hindu (19 March 2024). "AAP leader Sanjay Singh takes oath as Rajya Sabha member" (in Indian English). Archived from the original on 20 March 2024. Retrieved 20 March 2024.
- ↑ Andhrajyothy (3 April 2024). "6 నెలలు తరువాత తీహార్ నుంచి విడుదలైన సంజయ్ సింగ్". Archived from the original on 3 April 2024. Retrieved 3 April 2024.