సంజీవని అనేది పెర్న్ జాతికి చెందిన మొక్క. దీని శాస్త్రీయ నామం సెలాజినెల్లా బ్రయోటెరిస్ ( Selaginella bryopteris ). ఉష్ణమండల ప్రాంతాలలోని కొండలలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని తూర్పు, పడమర కనుమలలో, ఉత్తర భారతదేశంలో ఆరావళి పర్వతాల్లో సంజీవని పెరుగుతుంది. తెలంగాణా ప్రాంతంలోని కె.బి.ఆర్ పార్కు వంటి రాతిప్రదేశాల్లో కూడా ఈ మొక్క కనిపిస్తుంది. ఈ మొక్క నీళ్ళు లేని సమయాల్లో చచ్చినట్టుగా ముడుచుకొని ఉంటుంది. నీరు లభ్యమైనప్పుడు ముడుచుకొని ఉన్న ఆకులు విచ్చుకుంటాయి. నల్లమల అడవుల్లో చెంచు తెగ వారు నిస్సత్తువకు సంజీవని [1] మొక్కలను గుజ్జుగా దంచి రోజుకు ఒక చెంచా గుజ్జు చొప్పున నీటితో కలిపి మూడు రోజుల పాటూ సేవిస్తారు. మరికొన్ని తెగలు సెగ వ్యాధి నయంచేయడానికి సంజీవని మొక్కలను చిమచిపురు (Grewia hirsuta ) వేళ్ళతోను, సుగంధిపాల (Hemidesmus indicus) వేళ్ళతోను, మిరియాలతోను, పంచదారతోను నూరి పచ్చడి చేసి మాత్రలుగా చేస్తారు [2]. ఈ మొక్కకు మనిషిని బ్రతికించే గుణం కొన్ని పద్ధతుల ద్వారా తప్పక అవకాశం వుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. మొక్కలోని 10% స్వరసం వల్ల 41% ఎస్.ఎఫ్ 7 గ్రంథులు సూక్ష్మక్రిమిని నాశనం చేసి బ్రతకడానికి అవసరమైన పోషకాలను వృద్ధి చేస్తాయి. నిజానికి మరణించబోతున్న లేదా అప్పుడే మరణించిన వ్యక్తుల్లో బ్యాక్యులో వైరల్ ప్రవేశిస్తుంది. ఈ వైరల్ ను నాశనం చేయడానికి అవసరమైన ఎస్.ఎఫ్ 9 గ్రంథులను జనింపచేసే శక్తి ఒక్క సంజీవని మొక్కకు మాత్రమే ఉంది.[3]. తెలంగాణా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సంజీవని మొక్కను పిట్ట కాలు గా వ్యవహరిస్తారు [4]. రామాయణం - యుద్ధ కాండలో పేర్కొన బడ్డ సంజీవని మొక్క ఇదే. శ్రీరాముడికి, రావణుడికి యుద్ధం జరిగే సమయంలో ఇంద్రజిత్తు యొక్క ఆయుధ దెబ్బతో లక్ష్మణుడు స్పృహ కోల్పోతాడు. హనుమంతుడు హిమాలయాల్లో ఉన్న సుమేరు పర్వతానికి వెళ్ళి అక్కడ సంజీవని మొక్కను గుర్తుపట్టక మొత్తం సుమేరు పర్వతాన్ని ఎత్తుకొస్తాడు. లక్ష్మణుడికి ఆ మొక్క రసాన్ని పోయగా స్పృహనుంచి లేస్తాడు.

సంజీవని
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
S. bryopteris
Binomial name
Selaginella bryopteris
(L.) Baker
సంజీవని మొక్క
At Jambavan's urging, Hanuman goes to the Himalayas to find the four healing plants
Hanuman retrieves Sanjeevani by taking the entire mountain

మూలాలుసవరించు

  1. Ethnomedicinal Importance of Pteridophytes used by Chenchus of Nallamalais, Andhra Pradesh, India - by K. Thulsi Rao, K.N. Reddy, C. Pattanaik & Ch. Sudhakar
  2. Importance of Ferns in Human Medicine - Kamini Srivastava, M.Sc, D.Phil
  3. అమృతం - ఆయుర్వేద వైద్య ఆరోగ్య మాస పత్రిక, అక్టోబరు 2012
  4. Ethno-botanico-medicine for common human ailments in Nalgonda and Warangal districts of Telangana, Andhra Pradesh, India - Nallella Sreeramulu, Sateesh Suthari, A Ragan and Vatsavaya S Raju
"https://te.wikipedia.org/w/index.php?title=సంజీవని&oldid=2885652" నుండి వెలికితీశారు