సంజీవ్ కపూర్

సంజీవ్ కపూర్ భారతదేశపు ఒక ప్రముఖ వంటమనిషి( చెఫ్), పారిశ్రామికవేత్త . కపూర్ ఖానా ఖజానా అనే టీవి షోలో ప్రదర్శన ఇస్తువుంటారు.ఆసియా ఖండంలో నే ఇటువంటి షోలలో ఇదే అన్నిటికన్నా ఎక్కువ కాలం నడిచినది;ఈ షో దాదాపు 120 దేశాలలో ప్రసారమవుతుంది[1].2010 సంవత్సరంలో ఈ షో ని 50 కొట్లకు పైగా వీక్షకులు వీక్షించారు.సంజీవ్ జనవరి 2011లో ఫూడ్ ఫూడ్ అనే ఛానల్ని ప్రారంభించారు[2].

సంజీవ్ కపూర్
SANJEEV KAPOOR
Amitabh Bachchan, Sanjeev Kapoor (cropped).jpg
ఫుడ్ ఫుడ్ ఛానెల్ ప్రారంభోత్సవంలో సంజీవ్ కపూర్
జననం (1964-04-10) 1964 ఏప్రిల్ 10 (వయస్సు 58)
అంబాలా, భారతదేశం.
విద్యహోటల్ మేనేజిమెంటులో డిప్లొమా
జీవిత భాగస్వామిఆల్యోనా కపూర్
పాకశాస్త్ర విషయాలు
వంట శైలిభారతీయ వంటకాలు
ప్రస్తుత రెస్టారెంట్లు
  • Signature, Khazana, The Yellow Chilli, Pin yin Café, Gold Leaf Banquets, Sura Vie
వెబ్‌సైటుSanjeev Kapoor Web

వ్యక్తిగతజీవితంసవరించు

సంజీవ్ కపూర్ ఏప్రిల్ 10 తేదిన 1964 సంవత్సరంలో హర్యానా లో అంబాలా అనే నగరంలో జన్మించారు.తన బాల్యదశలోని ఎక్కువ కాలం ఢిల్లీలో గడిచింది. ఇంస్టిట్యుట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్,క్యాటరింగ్ అండ్ న్యుట్రిషన్,పూసా లో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 1984 లో పూర్తి చేసి ఆతిధ్య పరిశ్రమలో కాలుమోపారు.

జీవనప్రగతిసవరించు

సంజీవ్ తన వృత్తి జీవిత్తాన్ని భారతదేశపు కిచెన్ మేనేజ్మెంట్ పథకం ఆద్వర్యంలో ప్రారంభించారు.చాలా హోటల్ లో పనిచేసిన పిమ్మిట సెంచౌర్ అనే హోటల్ కి ఛీఫ్ ఎక్సిక్యుటివ్ అయ్యారు[3].

ఈ హోటల్ ముంబైలో ఉంది.'ఉత్తమ ఎగ్జిక్యూటివ్ చెఫ్ అవార్డు', 'ది మెర్క్యురి గోల్ద్ అవార్దు' అనే పురస్కారాలను పొందారు. సింగపూరు విమానయాన సంస్థలు తమ 'అంతర్జాతీయ పాకశాస్త్ర ప్యానల్' లోని సభ్యులలో ఒకనిగా నియమించుకుంది. భారతదేశపు వంటల తయారీలో చాలా ప్రసిద్ధిగాంచారు. అతను భారతదేశపు వంటలపై చాలా పుస్తకాలు రచించారు.

2010 లో సంజీవ్ 'సంజీవ్'స్ ఖానా ఖజానా' అనే షో ని ప్రారంభించారు. ఈ షో ద్వారా తన వంటల గూర్చి వీక్షకులకు నేర్పేవారు. భారతదేశమంతటా అతని పేరు మీద అనేక రెస్టారెంట్లు ప్రారంభించారు. అతను తన వంటకాల తయారీ మీద అనేక పుస్తకాలను, సీడీలను ప్రచురించాడు. ఆయా రంగాలలో ప్రసిధ్ధిగాంచిన పది భారతదేశ నిపుణుల జాబితాలో సంజీవ్ కపూర్ పేరు 'the Fundación Consejo España India ( స్పెయిన్ భారతదేశం కౌన్సిల్ ఫౌండేషన్), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (స్పెయిన్) ద్వారా ఎన్నికయింది. సోని ఇండియా అనే టీవి ఛానల్ లో సెప్టంబరు 2013 లో ప్రసారమయిన 'సంజీవ్ కపూర్ కిచెన్ ఖిలాడీ'అనే షోని ప్రారంభించారు, జడ్జి పాత్రను వహించారు, స్టార్ ప్లస్ ఛానల్ లో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ ఇండియా (సీజన్ 3) - కిచెన్ కే సూపర్ స్టార్ షోకి ముఖ్య అతిథి.

మూలాలుసవరించు

  1. Monica Bhide (24 February 2010). "India's chef to millions". The Washington Post. {{cite news}}: |access-date= requires |url= (help)
  2. "Sanjeev Kapoor's Food Channel in HD". The Times of India. 20 Dec 2010. Archived from the original on 2013-06-14. Retrieved 2014-11-19.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2011-07-13. Retrieved 2014-11-19.

ఇతర లింకులుసవరించు