సంతోష్ యాదవ్ (హర్యానా రాజకీయ నాయకురాలు)

సంతోష్ యాదవ్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2014 శాసనసభ ఎన్నికలలో అటేలి నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 సెప్టెంబర్ 4 నుండి 2019 అక్టోబర్ 23 వరకు హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసింది.[1]

సంతోష్ యాదవ్

హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌
పదవీ కాలం
2015 సెప్టెంబర్ 4 – 2019 అక్టోబర్ 23

పదవీ కాలం
2014 - 2019
ముందు అనితా యాదవ్
తరువాత సీతారాం యాదవ్
నియోజకవర్గం అటేలి

వ్యక్తిగత వివరాలు

జననం (1955-09-29) 1955 సెప్టెంబరు 29 (వయసు 69)
కుక్సీ, మహేంద్రగఢ్ జిల్లా, పంజాబ్ (ప్రస్తుతం హర్యానా)
జాతీయత  భారతీయురాలు
రాజకీయ పార్టీ స్వతంత్ర
ఇతర రాజకీయ పార్టీలు ఇండియన్ నేషనల్ లోక్ దళ్
భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు భగవాన్ సింగ్, చందర్ కలాన్
జీవిత భాగస్వామి ఓం ప్రకాష్ యాదవ్
సంతానం 1 కుమారుడు
వృత్తి రాజకీయ నాయకురాలు

రాజకీయ జీవితం

మార్చు

సంతోష్ యాదవ్ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2005 శాసనసభ ఎన్నికలలో అటేలి నుండి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థిగా పోటీ చేసి మూడోస్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2009 శాసనసభ ఎన్నికలలో ] బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అనితా యాదవ్ చేతిలో 973 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి, 2014 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్ఎల్‌డీ అభ్యర్థి సత్బీర్ పై 48,601 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై,[2] 2015 సెప్టెంబర్ 4 నుండి 2019 అక్టోబర్ 23 వరకు హర్యానా శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పని చేసింది.[3][4]

సంతోష్ యాదవ్ 2021 మే 4న హర్యానా రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా నియమితురాలైంది.[5] ఆమెకు ఎన్నికలలో బీజేపీ టికెట్ దక్కక[పోవడంతో ఆమె భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసింది.[6]

మూలాలు

మార్చు
  1. The Hindu (4 September 2015). "BJP's Santosh Yadav elected Deputy Speaker" (in Indian English). Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  2. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  3. NDTV (4 September 2015). "BJP's Santosh Yadav Appointed Deputy Speaker of Haryana Assembly". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  4. Hindustantimes (24 September 2019). "Haryana Assembly Polls: Santosh Yadav, Ateli MLA". Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  5. India TV Hindi (4 May 2021). "हरियाणा भाजपा ने संगठन में किया विस्तार, पूर्व डिप्टी स्पीकर संतोष यादव बनीं उपाध्यक्ष" (in హిందీ). Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.
  6. Financialexpress (11 September 2024). "Another setback for BJP as Santosh Yadav quits ahead of Haryana polls" (in ఇంగ్లీష్). Archived from the original on 12 November 2024. Retrieved 12 November 2024.