శంబర

ఆంధ్రప్రదేశ్, పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండల గ్రామం
(సంబర నుండి దారిమార్పు చెందింది)


శంబర (సంబర) ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పార్వతీపురం మన్యం జిల్లా, మక్కువ మండలానికి చెందిన గ్రామం. ఇక్కడ గల శ్రీ పోలమాంబ దేవాలయం జిల్లాలో ప్రముఖ పర్యాటక ఆకర్షణ.

శంబర
పటం
శంబర is located in ఆంధ్రప్రదేశ్
శంబర
శంబర
అక్షాంశ రేఖాంశాలు: 18°39′13.716″N 83°12′44.964″E / 18.65381000°N 83.21249000°E / 18.65381000; 83.21249000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపార్వతీపురం మన్యం
మండలంమక్కువ
విస్తీర్ణం6.06 కి.మీ2 (2.34 చ. మై)
జనాభా
 (2011)[1]
4,134
 • జనసాంద్రత680/కి.మీ2 (1,800/చ. మై.)
అదనపు జనాభాగణాంకాలు
 • పురుషులు2,140
 • స్త్రీలు1,994
 • లింగ నిష్పత్తి932
 • నివాసాలు1,046
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్535547
2011 జనగణన కోడ్582209

భౌగోళికం

మార్చు

ఇది మండల కేంద్రమైన మక్కువ నుండి 6 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన బొబ్బిలి నుండి 24 కి.మీ. దూరంలోనూ ఉంది.

జనగణన గణాంకాలు

మార్చు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1046 ఇళ్లతో, 4134 జనాభాతో 606 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2140, ఆడవారి సంఖ్య 1994.[2]

విద్యా సౌకర్యాలు

మార్చు

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి , ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప బాలబడి మక్కువలో ఉంది.సమీప జూనియర్ కళాశాల మక్కువలోను, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల బొబ్బిలిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నెల్లిమర్లలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు పిరిడిలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల బొబ్బిలిలోను, అనియత విద్యా కేంద్రం మక్కువలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల విజయనగరం లోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

మార్చు

ఇక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాల వున్నాయి.

రవాణా సౌకర్యాలు

మార్చు

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది.

భూమి వినియోగం

మార్చు

శంబరలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 71 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 134 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 13 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 7 హెక్టార్లు
  • బంజరు భూమి: 4 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 376 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 73 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 314 హెక్టార్లు
    • కాలువలు: 197 హెక్టార్లు
    • బావులు/బోరు బావులు: 117 హెక్టార్లు

శ్రీ శంబర పోలమాంబ దేవాలయం

మార్చు
 
శ్రీ శంబర పోలమాంబ అమ్మవారు

కళింగ ఆంధ్రుల ఆరాధ్య దైవము ఉత్తరంద్రుల కల్పవల్లిగ విరజిల్లుతున్న శ్రీశంబర పోలమాంబ జీవితచరిత్ర ఆశ్యర్యకరంతోపాటు ఆసక్తిని కలిగిస్తుంది. మహిమ స్వరూపిణిగా, శక్తిస్వరూపిణిగా ఘనతకెక్కిన శంబర గ్రామదేవత ఘట్టాలపై విభిన్న కథనాలు ప్రాచుర్యములో ఉన్నట్లు చరిత్రికారులు చెబుతున్నారు. అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆదిశక్తి స్వరూపిణి పార్వతీదేవి అవతారమే పోలేశ్వరియని ప్రతిఏట లక్షలాది భక్తులు మొక్కులు చెల్లించి ముక్తిని పొందుతున్నారు.

తెలంగాణ ప్రాంతములో సమ్మక్క-సారక్క, అనకాపల్లిలో నూకాలంబ, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఉత్సవాల మాదిరిగా శంబర పోలమ్మ సంబరాలు ఘనముగా జరుగుతాయి. పార్వతీపురం గిరిజన ఉపప్రణాలికా ప్రాంతానికి చెందిన మక్కువ మండలం శంబర ప్రాంతము పూర్వము దండకారణ్య ప్రాంతముగా ఉండేది. శంబాసురుడనే రాక్షసుడు ఈప్రాంతాన్ని పరిపాలించేవాడు. ఇతదూ మహా పరాక్రమవంతుడు, మాయావి, ఈయన పరిపాలనలో ప్రజలు, మునులు, ఘోరమైన చిత్రహింసలు అనుభవించేవారు. రాక్షస రాజు బారినుంచి రక్షించమని అప్పటి ప్రజలు, తపస్సంపన్నులు శక్తిస్వరూపిణిని వేడుకోవడముతో ఆమె పోలేరేశ్వరిగా అవతారమెత్తి, శంబాసుర రాక్షసుడుని సంహరించి సుఖ శాంతులు కలుగజేసింది. అప్పటినుండి పోలేశ్వరి పోలమాంబగ ప్రాచుర్యము పొంది ఈ ప్రాంతపు ఆరాధ్య దైవముగా పూజలందుకొంటుంది. శంబాసుర రాక్షసరాజు పరిపాలనలో ఈ ప్రాంతము ఉండటంతో ఈ ప్రాంతానికి శంబర అని పేరువచ్చింది.

అమ్మవారి బాల్యం

మార్చు

సాలూరు పట్టణానికి 16 కిలోమీటర్లు, మక్కువ గ్రామానికి 6 కిలోమీటర్లు దూరంలో గోమిఖి నదీ పరీవాహక ప్రాంతాన ఇన్న శంబర గ్రామం. కొండదొరల కుటుంబంలో శక్తి స్వరూపిణిగా అవతరించింది. సుమారు నాలుగు వందల సంవత్సరాల క్రితం స్వర్గీయ పృకాపు అప్పన్నదొర దంపతులకు పోలేశ్వరి జన్మించింది. ఆవతారమూర్తి అగుటచే ఈమె మెరుపుతీగ వలే దేవతా స్త్రీవలే గ్రామస్తుల మధ్య బాల్యం నుంచే ప్రత్యేక జీవన విధానాన్ని కనబరిచింది. ఇంట్లో పనిపాట్లు ఎప్పుడు ముగించేదో ఎవరికీ అంతుబట్టేది కాదు. తల్లిదండ్రులకు, చిన్ననాటి నుంచి తనతో పెరిగిన మేనత్తకు తప్ప ఆమె ఎవ్వరికంట కనిపించేందుకు నిరాకరించేది. స్పష్టంగా ఆమెను ఎవరూ చూడలేక పోయేవారు. యుక్త వయసు వచ్చేవరకు ఇదే మాదిరిగా వైవిధ్యమైన జీవన విధానం కనబరిచిన ఆమెను పలు ప్రాంతాల ప్రజలు భక్తిభావాలతో కీర్తించడము ప్రారంభించారు.

అమ్మవారి పెళ్లిచూపులు

మార్చు

పోలేశ్వరికీ యుక్తవయస్సు రావడంతో ఆమెకు వివాహం చేయాలన్న తలంపు తల్లిదండ్రులకు కలిగింది. కుమార్తె జీవన విధానంలో అమె మానవ స్త్రీ కాదని వారు తెలుసుకున్నారు. అందువల్ల ఈమె వివాహం ఎలా జరుగుతిందోనని ఆదిసక్తి స్వరూపిణి పైనే భారం వేశారు. ఆ రోజుల్లో శంబర గ్రామ మునసబుగా గిరడ చిన్నం నాయుడు బాధ్యతలు వహించేవరు. ఒకనాడు నీలాటిరేవున ఆయన దంతాదావనం చేసుకుంటున్నరు. ఆ సమయంలో మోభాసా మామిడిపల్లికి చెందిన కొండదొర కులస్తులు ఆ గ్రామనాయుదుగారితో కలసి పెళ్ళి సంబంధం విషయమై మరొక పట్టణానికి ప్రయాణం సాగిస్తున్నారు. నీలాట రేవున శంబర మునసబు వారికి ఎదురవ్వడంతో కుశలప్రశ్నలు సంభాషణలో పోలేశ్వరీ గుణగణాలను తెలుసుకున్నారు. అంతటితో వారి ప్రయాణాన్ని విరమించుకొని పేకాపు అప్పన్నదొర ఇంటికి వెళ్లి లాంచనప్రాయంగా పోలేశ్వరిని తమ కోడలుగా చేసుకొనేందుకు సంబంధం ఖాయం చేసుకున్నారు.

అమ్మవారి వివాహం

మార్చు

పోలేశ్వరి వివాహ లగ్నము సమీపిస్తున్న కొలది ఆ గ్రామ మునసబు చిన్నం నాయుడుతోపాటు చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలంతా ఈ సారైనా ఆమెను చూడవచ్చని ఎంతో ఆనందించారు. అయితే వారికి నిరాశే ఎదురైంది. వివాహ లాంఛనాలకు అమె ఒప్పుకోలేదు. గృహ జీవనానికి తాను పెళ్ళిచేసుకోవడంలేదని ముత్తైదువగా తాను నిర్వహించాల్సిన మహాకార్యమోకటి వున్నదని తల్లిదండ్రులకు ఆమె వివరించింది. ఎప్పుడూ వేదాంత ధోరణిగా మాటలాడే కుమార్తె మాటల్లోని మర్మాన్మి తల్లిదండ్రులు గ్రహించలేక పోయారు. వివాహ ముహూర్తసమయంలో పెళ్ళి పీటలపై ఆమె కూర్చొనక పెళ్ళికుమారుడితో ముట్టబడిన మంగళసూత్రాలు, పూలదంశను ఒక పుణ్యస్త్రీతో తెప్పించుకొని ధరించింది.

అమ్మవారు భుమిలో కుంగి అవతారం చాలించుట

మార్చు

పోలేశ్వరి తాను మానవజన్మ ఎత్తి నిర్వర్తించాల్చిన పనులు పూర్తయినవని తలచింది. తన తల్లి ఒడిలో చేరుకోవాలని అవతారాన్ని చాలించేందుకు భర్తతో సవ్వారిలో కూర్చొనేందుకు నిరాకరించింది. అత్తవారింటికి పయనమైన సమయాన వాయువేగంతో మెరుపుతీగవలే పల్లకిలో ప్రవేశించింది. తనకు తోడుగా పేరంటాలుగా వచ్చేందుకు మేనత్త అయిన పెద్ద పోలమ్మను అంగీకరించినది, పల్లకి తలుపులు మూసుకొని వారు కూర్చోడంతొ పోలేశ్వరిని చూడాలన్న ఆశతో వున్న గ్రామస్తులకు నిరాశ ఎదురయ్యింది. పల్లకిని శంబర గ్రామం దాటి దక్షిణదిక్కుగా ఒక పర్లాంగు దూరం తీసుకువెళ్లగానే గులివిందల పోలినాయుడు చెరువు, కిట్టలు తోటవద్ద సవ్వారిని దింపించమని బోయిలకు మేనత్తచే ఆపించింది. ఆక్కడ మరుగు నిమిత్తమని తలచి సవ్వారిని దించి బోయిలు దూరముగా పోయిరి. పోలేశ్వరి మెరుపు వలే బయటకు వచ్చి భుమాతను ప్రార్థించి దారిమ్మని కోరెను. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకంపనలు రేగి ఆ ప్రాంతంలో భూమి బీటలు వారడంతో కంఠము వరకు పోలేశ్వరి భూమిలోదిగబడెను. మేనత్త పెద్దపోలమ్మ భయబ్రాంతురాలై భక్తి శ్రద్ధలతో పోలేశ్వరిని ప్రార్థించి తనను ఐక్యం చేసుకొమ్మని కోరెను. ఆమె మహిమా ప్రభావంతో పెద్దపోలమ్మ భూమిలో పూర్తిగా దిగబడెను. అనంతరము అక్కడకు చేరిన బోయీలు అ ప్రాంతానికి చేరుకొని కంఠము వరకు దిగివున్న పోలేశ్వరిని చూచి ఆశ్చర్యం ఆందోళనతొ భయకంపితులైనారు. భయపడవలదని బోయిలకు అభయమిచ్చి ముందుగ గుర్రముపై వెళుతున్న తన భర్తను గ్రామస్తులకు జరిగిన విషయాలను తెలిపి ఈ ప్రాంతానికి తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. బోయీలు చెప్పిన ప్రకారం ఆమె భర్త, గ్రామ ప్రజలు అ ప్రదేశానికి చేరుకొని అంతా చూసి ఆశ్చర్యముతో భక్తిశ్రద్ధలతో పోలేస్వరికి నమస్కరించారు. పోలేస్వరి తన భర్తను పిలిచి నీతో సంసారిక కష్టసుఖాలను పంచుకొనేందుకు ఈరోజే వేరొక కన్యతో వివాహం జర్గుతుందని తెలిపెను. అలాగే ఈ గ్రామానికి శంబర గ్రామ దేవత లేనదున శంబరపోలమాంబగా పిలవబడుతూ గ్రామ దేవతనై అన్ని ప్రాంతాలకు చెందిన భక్తులను సదా రక్షిస్తానని అభయమిచ్చెను. అలాగేగ్రామంలో తనను కొలిచే విధానాన్ని, క్రమాన్ని వివరించి భూమిలో కృంగి అవతారం చాలించెను. ఆమె చెప్పిన ప్రకారమే ఆ దినమే భర్తకు వివాహము జరిగెను. శక్తి స్వరూపిణిగా పోలమాంబ నమ్ముకున్న భక్తులకు కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొంగుబంగారమై ముక్తిని ప్రసాదిస్తుందని చరిత్ర తెలుపుతుంది.

చివరిసారిగా అమ్మవారు పలికిన పలుకులు

మార్చు
  • శమ్బర గ్రామానికి గ్రామ దేవతగా కీర్తిస్తున్న తనను ప్రతీ ఏటా క్రమం తప్పకుండా పండగను తెచ్చి పూజించాలి.
  • తనను కొలిచి తెచ్చే రోజున ఆనాడు ఉదయము గ్రామంలో ఉజ్జిడి తిరిగి చీడ పీడలను పారద్రోలాలి.
  • నా అంపక రోజున గ్రామంలో చీడలు ప్రవేశించకుండా గ్రామం చుట్టూ పాలధార పోసి కట్టూకట్టవలెను.
  • సంక్రాంతి పండగనాడు తాను శంబర గ్రామంలో ఉండాలి, ఆ రోజున తన పేరున మూలన మడపల్లు పెట్టి పేరంటాల్లకు పసుపు-కుంకుమ ఇవ్వాలి
  • పండగ సోమవారము రాత్రి కొండపల్లివలస దొరలచే తొలివేళ్లు జరపాలి. అనంతరము సింగిడీలు (మొక్కిబడులు) చెల్లించాలి.
  • భాగవత ప్రదర్శనలతో తనను అంపకం చేయాలి, అంపకం రోజున నేస్తపువారైన, ప్రియస్నేహితులున్నా, నాయకరం చేస్తున్న గిరిడి వారింటికి, అనంతరము కరణం గారింటికి తీసుకువెల్లి ఊరేగించాలి

అమ్మవారి ప్రతిరూపాలు పోతుకుడెరాళ్లు

మార్చు

సంబర పోలమాంబ మహిమలు వర్ణింప శక్యము కానివి. ఆమె మహిమల్లో భాగంగా శంబర గ్రామాన్ని ఆనుకొని కొండపై వున్న రెండు పెద్దబండరాళ్లు పోతుకుడెరాళ్లుగా పిలుస్తూ పూజలందుకుంటున్నాయన్న సాక్ష్యాలు నేటికీ చూడవచ్చు. జలాశయంలో భాగమైన అమ్మవారి చెరువును నొళ్లించడానికి గ్రామం లో ప్రతీ ఇంటివారిని ఏరును తోలుకొని రావాలని గ్రామపెద్దలు అపటి మునసబు గిరిడ చిన్నంనాయుడు ఆగ్యాపించారు. మొదటి రోజున ఊరందరూ తమ తమ ఎద్దులతో ఏరును తోలుకువెళ్లారు. అయితే పోలేశ్వరి తల్లిదండ్రులకు ఎద్దులేనందున ఏరును తోలుకు వెళ్లలేకపోయారు, తెల్లవారి పిలిపించి ఏ శిక్ష విధిస్తారోనని తల్లిదండ్రులు జన్నిపేకాపు అప్పన్నదొర దంపతులు దుఖ్ఖించసాగారు. ఆ రాత్రి సమయంలో వారి కలలో పోలేశ్వరి కనిపించి తన మేనత్త నల్లఎద్దుగా, తాను తెల్లఎద్దుగా అవతరించామని గ్రామస్తులతోపాటు మీరు కూడా ఏరు తోలుకెళ్లమని చెప్పి అంతర్ధానమయ్యెను. వారు తిరిగి వచ్చి చూడగా దొడ్డిలో చూడముచ్చటయిన రెండు ఎద్దులు కనిపించాయి. వాటికి వారు ఏరుపోసి చెరువు వద్దకు తోలుకొనిపోగా అప్పటికే గ్రామస్థులు చెరువుపనిలో ఉన్నారు. జన్నికాపు అప్పన్నదొర ఏరు తోలుకొస్తుండడంతో వారికి ఎద్దులు ఎక్కడవని ఒకరినొకరు గుసగుస లాడుకోవడం మొదలైనది.. ఆ ప్రదేసానికి చేరేసరికి ఆ రెండు ఎద్దులు పులిలా గాండ్రిస్తూ పూసిన పూజ పెద్ద సర్పములా అక్కడివారికి కనిపించాయి. దీంతో గ్రామస్తులూ వారి వారి ఎద్దులూ ప్రాణభయముతో పరుగులెత్తాయి. విషయాన్ని తెలుసుకున్న మునసబు జరిగిన తప్పును ఒప్పుకొని క్షమించమని అప్పన్నదొర దంపతులను బ్రతిమాలాడరు. పోలేశ్వరి మహిమను మనషును ఎరిగిన తల్లిదండ్రులు ఆమెను ప్రార్థించి ఉగ్రరూపాన్ని విడిచిపెట్టమని ప్రాదేయపడ్డారు. పోలమాంబ శాంతించి తన మేనత్త పెద్దపోలమ్మతో ఎద్దులరూపములోనే కొండపైకెక్కి అక్కడరెండు పెద్దబండరాళ్లుగా మారిపోయారు. అప్పటినుంచి ఆ రాళ్లు అమ్మవారి ప్రతిరూపాలుగా భావిస్తూ పూజలు జరుపుతున్నారు. నేటికీ వాటిని పోతుకుడెరాళ్లుగా పిలుస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
  2. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

ఆధార గ్రంథాలు

మార్చు
  • కుప్పిలి సూర్యనారాయణ. పోలమాంబ అవతారము.

వెలుపలి లంకెలు

మార్చు
  • వార్తా దినపత్రిక శ్రీకాకుళం ఎడిషన్ (20-జనవరి-2008) సౌజన్యముతో.
"https://te.wikipedia.org/w/index.php?title=శంబర&oldid=4305223" నుండి వెలికితీశారు