విశ్వాసం 2019లో తమిళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అజిత్, నయనతార, జగపతి బాబు, వివేక్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 మర్చి 2019న విడుదలైంది.[1]

విశ్వాసం
దర్శకత్వంశివ
రచనరాజేష్ ఏ.మూర్తి
కథఆదినారాయణ, శివ
నిర్మాతసెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
తారాగణం
ఛాయాగ్రహణంవెట్రి పళనిస్వామి
కూర్పురూబెన్
సంగీతండి.ఇమాన్
నిర్మాణ
సంస్థ
ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్
విడుదల తేదీ
1 మర్చి 2019
సినిమా నిడివి
156 నిముషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రావులపాలెం గ్రామంలో వీర్రాజు (అజిత్) రైస్ మిల్లు ఓనర్. ఆ ఊరికి మెడికల్ క్యాంప్ పెట్టడానికి వచ్చిన నిరంజన (నయనతార)ను చూసి ఇష్ట పడి పెళ్లి చేసుకుంటాడు అయితే కొన్ని కారణాల వల్ల వారు విడిపోతారు. తమ గ్రామంలో పదేళ్లకోసారి జరగే జాతర జరుగుతుంది. ఈసారి జాతరకి బంధువుల్లేక వొంటరిగా వున్న వీర్రాజుని ఇప్పటికైనా వెళ్ళి భార్యనీ, కూతుర్నీ తీసుకురమ్మని వారి పెద్దలు చెప్తారు. వీర్రాజు ముంబాయి వెళ్లి భార్య డాక్టర్ నిరంజన (నయనతార) ని కలుసుకుంటాడు. ఇంతకీ వీర్రాజు భార్య అతడిని విడిచి ఎందుకు వెళ్లిపోయింది? ముంబయి వెళ్లిన అతడికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? తిరిగి ఆమెను తన ఊరికి తీసుకురావడానికి అతనేం చేశాడు అనేదే మిగతా సినిమా కథ.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

 • బ్యానర్: ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్
 • దర్శకత్వం: శివ
 • నిర్మాత: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్
 • మాటలు: రాజేష్ ఏ. మూర్తి
 • కథ: ఆదినారాయణ, శివ
 • సహ-రచయిత: ఆంటోని భాగ్యరాజ్‌
 • సంగీతం: డి.ఇమాన్
 • ఛాయాగ్రహణం: వెట్రి పళనిస్వామి
 • కూర్పు: రూబెన్

మూలాలు మార్చు

 1. TV9 Telugu (21 February 2019). "ఆ రోజున విడుదల కానున్న స్టార్ హీరో చిత్రం..! -". TV9 Telugu. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
 2. The Indian Express (10 January 2019). "Viswasam movie review: Ajith saves his family again". The Indian Express (in ఇంగ్లీష్). Archived from the original on 16 నవంబరు 2019. Retrieved 17 June 2021.
 3. Sakshi (1 January 2019). "ఆ ట్రైలర్‌లో విలన్‌కే ఎక్కువ మార్కులు పడ్డాయి!". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=విశ్వాసం&oldid=4013409" నుండి వెలికితీశారు