సతీష్ ఆచార్య ( కన్నడ: ಸತೀಶ್ ಆಚಾರ್ಯ ) కర్ణాటకలోని కుందపురానికి చెందిన భారతీయ కార్టూనిస్ట్ . [1] 2015 లో, మిస్టర్ ఆచార్య "యునైటెడ్ స్కెచెస్" లో భారతదేశం నుండి ప్రొఫెషనల్ కార్టూనిస్ట్‌గా పాల్గొన్నాడు. [2]

సతీష్ ఆచార్య
సతీష్ ఆచార్య
జననం (1971-03-24) 1971 మార్చి 24 (వయసు 53)
కుందపుర
జాతీయతIndia భారతీయుడు
విద్యాసంస్థమంగుళూరు విశ్వవిద్యాలయం
వృత్తికార్టూనిస్టు
జీవిత భాగస్వామిడా. అనిత
పిల్లలుసోహన్, దేష్ణ
తల్లిదండ్రులుపద్మనాభ
ప్రేమ
వెబ్‌సైటుhttp://www.cartoonistsatish.com/

ప్రారంభ జీవితం, విద్య

మార్చు

ఆచార్య కళలో ఎటువంటి శిక్షణ తీసుకోలేదు. స్వయం సాధనతో కార్టూనిస్టుగా ఎదిగాడు. [3] విద్యార్ధిగా తారంగా, సుధా, తుషార్ వంటి కన్నడ ప్రచురణలకు కార్టూన్లు అందించడం ద్వారా డబ్బు సంపాదించాడు. [4] కుందపురలోని భండార్కర్స్ కాలేజీ నుండి బీకామ్ చేసిన తరువాత మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఫైనాన్స్ లో ఎంబీఏ చదివాడు.  

కెరీర్

మార్చు

ఎంబీఏ పూర్తి చేసిన తరువాత, ఆచార్య ముంబైకి వెళ్లి, ఒక ప్రకటనల ఏజెన్సీలో అకౌంట్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు, కానీ కార్టూనింగ్ కోసం ఆ ఉద్యోగం నుండి తప్పుకున్నాడు. [5] ముంబైకి చెందిన ఇంగ్లీష్ టాబ్లాయిడ్ మిడ్‌డేతో పొలిటికల్ కార్టూనిస్ట్‌గా కళా జీవితాన్ని ప్రారంభించాడు. [6] అతను 2003 లో మిడ్‌డేతో స్టాఫ్ కార్టూనిస్ట్‌గా పనిచేయడం ప్రారంభించాడు. తొమ్మిది సంవత్సరాలు రోజువారీ కార్టూన్ కాలమ్‌కు సహకరించాడు.

చార్లీ హెబ్డో ఊచకోత పై ఆచార్య వేసిన కార్టూన్లు అత్యంత శక్తివంతమైన కార్టూన్లు గా పరిగణించబడ్డాయి [7] విదేశీ మీడియా ద్వారా ఆ సంఘటనలోని విషాదం కార్టూన్ల ద్వారా వివిధ వార్తాపత్రికల్లో ప్రచురించబడ్డాయి. వాటిలో వాల్ స్ట్రీట్ జర్నల్, టైమ్స్, ది గార్డియన్ పత్రికలు ఉన్నాయి. [1]

పుస్తకాలు

మార్చు

ఆచార్య ఆంగ్లంలో మెయిన్, హమ్, ఆప్ అనే మూడు కార్టూన్ పుస్తకాలు రాశారు, [8] అతని క్రికెట్-కార్టూన్ పుస్తకం నాన్-స్ట్రైకర్ జనవరి 31 న బెంగళూరులో అధికారికంగా విడుదలైంది. [9]

ప్రస్తావనలు

మార్చు
  1. 1.0 1.1 Mangaluru: Satish Acharya's Charlie Hebdo cartoon grabs world's attention. Daijiworld.com. Retrieved on 9 December 2015.
  2. Satish Lal Acharya Archived 2019-04-12 at the Wayback Machine. unitedsketches.org. Retrieved on 9 December 2015.
  3. IN PICTURES: Political cartoonists respond to Charlie Hebdo attack. Globalnews.ca. Retrieved on 9 December 2015.
  4. Special : Cartoonist Sathish Acharya of Kundapur origin features in Forbes Magazine | Karavali- Udayavani English. M.newshunt.com (4 January 2015). Retrieved on 9 December 2015.
  5. The Manipal Journal – If I can draw, anybody can draw: Satish Acharya. Themanipaljournal.com. Retrieved on 9 December 2015.
  6. Cartoonist Sathish Acharya of Kundapur origin features in Forbes Magazine | Udayavani – ಉದಯವಾಣಿ. Udayavani. Retrieved on 9 December 2015.
  7. 12 powerful political cartoons responding to the Charlie Hebdo attack. Vox. Retrieved on 9 December 2015.
  8. Election Inspires Cartoon Book Archived 2015-01-23 at the Wayback Machine. The New Indian Express (29 March 2014). Retrieved on 9 December 2015.
  9. Satish Lal Acharya on Twitter: "You're Invited! Release of cricket-cartoon book NON-STRIKER & cartoon exhibition in Bengaluru on 31st Jan at 11 am. http://t.co/ZLWQoMQwL8". Twitter.com (22 January 2015). Retrieved on 9 December 2015.

బాహ్య లింకులు

మార్చు