సతీ లీలావతి తెలుగులో విడుదలైన ఒక డబ్బింగ్ సినిమా. సతీ లీలావతి 1995 లో విడుదలైన అనువాద చిత్రం. తమిళంలో ఇదే పేరుతో బాలూ మహేంద్ర సహ-రచన, దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో రమేష్ అరవింద్, కల్పన, హీరా ప్రధాన పాత్రల్లోను కమల్ హాసన్, కోవై సరళ సహాయక పాత్రల్లోనూ నటించారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ నిర్మించాడు. అనంతూ కథ ఇవ్వగా, ఇళయరాజా సంగీతం అందించాడు. సతీ లీలావతి వాణిజ్యపరంగా విజయవంతమైంది. డేవిడ్ ధావన్ హిందీలో బివి నెం .1 (1999) గాను, రమేష్ అరవింద్ కన్నడంలో రామా షామా భామా (2005) గానూ రీమేక్ చేశారు.

సతీలీలావతి
(1995 తెలుగు సినిమా)
దర్శకత్వం బాలూ మహేంద్ర
నిర్మాణం కమల్ హాసన్
తారాగణం కమల్ హాసన్, కోవై సరళ
సంగీతం ఇళయరాజా
భాష తెలుగు

అరుణ్ (రమేష్ అరవింద్) లీలావతి (కల్పన) ని పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్నాడు. అతను తన భార్య అందచందాల పట్ల, ఆమె స్థూలకాయం పట్లా చూసి అసంతృప్తిగా ఉంటాడు. ఓ భవన నిర్మాణ సంస్థలో పనిచేసే ప్రియా (హీరా రాజగోపాల్) ను కలిసినప్పుడు, తనకు పెళ్ళైందన్న సంగతి దాచి, ఆమెతో సంబంధం పెట్టుకుంటాడు.

ప్రియాను తీసుకుని బెంగళూరు వెళ్ళినప్పుడు, అతను తన పాత స్నేహితుడు, కోయంబత్తూరుకు చెందిన ఆర్థోపెడిక్ సర్జనూ అయిన డాక్టర్ శక్తివేల్ గౌండర్ (కమల్ హాసన్), అతని భార్య పళని (కోవై సరళ), కుమారుడు ఆనంద్ లను అనుకోకుండా కలుస్తాడు. వాళ్ళంతా ఒకే విమానంలో ప్రయాణిస్తారు, ఒకే హోటల్‌లో ఉంటారు. అరుణ్ నడుం పట్టేయడంతో, హోటల్ డాక్టర్ అందుబాటులో లేనందున డాక్టర్ శక్తివేల్‌ను రాత్రి అరుణ్ గదికి పిలుస్తారు. అక్కడ శక్తివేల్ ప్రియను చూస్తాడు, వారిమధ్య సాగుతున్న వ్యవహారం గురించి తెలుసుకుంటాడు.

చెన్నైకి తిరిగి వచ్చిన తరువాత ప్రియా, అరుణ్‌కు పెళ్ళైందని తెలుసుకుంటుంది. కాని ఆ పెళ్ళి తాను బలవంతంగా చేసుకోవలసి వచ్చిందని అరుణ్ చెప్పి, భార్య నుండి విడాకులు తీసుకుంటానని వాగ్దానం చేసినప్పుడు అతనితో కొనసాగాలని ప్రియ నిర్ణయించుకుంటుంది. అరుణ్ భార్య లీలావతి అరుణ్ వ్యవహారాన్ని తెలుసుకున్నప్పుడు, ఆమె అతడితో భారీగా ఘర్షణ పడుతుంది. దాంతో అరుణ్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు, లీలావతి వరుసగా నాటకా లాడించి, ప్రియ అరుణ్‌ను ద్వేషించేలా చేస్తుంది. ఈ నాటకాల్లో ఆమె తన మామయ్య, పిల్లలు, శక్తివేల్, ప్రియా మాజీ ప్రేమికుడు (రాజా) మొదలైనవారి సహాయం తీసుకుంటుంది. చివరకు ప్రియ తన పాత ప్రేమికుడికి క్షమాపణ చెప్పడం, అరుణ్ లీలావతితో ఏకం అవడంతో సినిమా ముగుస్తుంది.

నటీనటులు

మార్చు

పాటలు

మార్చు
పాటల జాబితా
సం.పాటగాయనీ గాయకులుపాట నిడివి
1."అరచేతి లోన చెయ్యి"ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర4:57
2."మనసున మనసై"మనో, కె.ఎస్.చిత్ర5:00
3."ఎన్ని కథలో"కె.ఎస్.చిత్ర,రేణుక, శ్రీలత3:01
4."Bit Song-1"మనో, కె.ఎస్.చిత్ర0:22
5."Bit Song-2"మనో0:33

మూలాలు

మార్చు