హీరా ఒక ప్రముఖ సినీ నటి. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాలలో నటించింది.

హీరా
జననం
హీరా రాజగోపాల్

(1971-12-29) 1971 డిసెంబరు 29 (వయసు 52)
చెన్నై
ఇతర పేర్లుజనని
వృత్తినటి, దాత, బ్లాగర్, ఉద్యమకారిణి
క్రియాశీల సంవత్సరాలు1991–1999
జీవిత భాగస్వామిపుష్కర్ మాధవ్ (2002–2006)(విడాకులు తీసుకున్నది)
వెబ్‌సైటుhttp://www.heerarajagopal.com/

జీవితం

మార్చు

హీరా చెన్నైలో జన్మించింది. ఆమె తండ్రి రాజగోపాల్ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చర్మవ్యాధి నిపుణుడు. ఆమె తల్లి భారత సైన్యంలో నర్సుగా పనిచేస్తుండేది. హీరా చెన్నైలోని మహిళా క్రిస్టియన్ కళాశాల నుంచి సైకాలజీలో డిగ్రీ చేసింది.[1][2] పుష్కర్ మాధవ్ అనే వ్యాపారవేత్తను 2002 లో వివాహమాడింది. 2006 లో వీరు విడాకులు తీసుకున్నారు.

కెరీర్

మార్చు

చదువుల్లో, ఆటల్లో, ఇతర వ్యాపకాల్లో తీరిక లేకుండా ఉన్న ఆమె మోడలింగ్ కానీ సినిమాల్లో కానీ ప్రవేశిస్తుందని ఊహించలేదు. కానీ ఆమె ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడలింగ్ అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో కొన్ని సినిమా అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించింది. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో సినిమాల్లో ప్రవేశించింది. ఆమె మొదటగా ఇదయం అనే సినిమాలో వైద్య విద్యార్థిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని సినిమాలలో నటించింది. కానీ సినిమా పరిశ్రమ తన వ్యక్తిత్వానికి సరిపడ సినిమాల్లో నటించడం మానేసింది.[3]

 
సతీలీలావతి

నటించిన సినిమాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-09. Retrieved 2016-09-04.
  2. http://timesofindia.indiatimes.com/entertainment/tamil/movies/photo-features/Most-talked-about-link-ups-in-Kollywood/Most-talked-about-link-ups-in-Kollywood/photostory/48093579.cms
  3. "హీరా వ్యక్తిగత వెబ్ సైటులో సినిమాల గు రించి". heerarajagopal.com. Archived from the original on 21 అక్టోబరు 2016. Retrieved 6 September 2016.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=హీరా&oldid=4237684" నుండి వెలికితీశారు