బాలు మహేంద్ర

(బాలూ మహేంద్ర నుండి దారిమార్పు చెందింది)

బాలు మహేంద్ర (Balu Mahendra) (మే 20, 1939 - ఫిబ్రవరి 13, 2014) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు.

బాలు మహేంద్ర
Balu Mahendra
బాలు మహేంద్ర
జననం
బాలనాథన్ బెంజమిన్ మహేంద్ర

(1939-05-20) 1939 మే 20 (వయసు 84)
ఇతర పేర్లుమహేంద్ర,బాలు
వృత్తిచలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్
క్రియాశీల సంవత్సరాలు1971 – 2014
జీవిత భాగస్వామిఅఖిలేశ్వరి మహేంద్ర
శోభ

జననం, విద్యాభ్యాసం సవరించు

1939లో శ్రీలంక లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. విద్యాభ్యాసంకూడా అక్కడే పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్' చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణె లోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు.

మరణం సవరించు

2014 ఫిబ్రవరి 13 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11.00 గంటలకు మరణించారు.

సినీ నేపథ్యం సవరించు

సొమ్మొకడిది సోకుకడది, తరం మారింది, లంబాడోళ్ల రాందాసు, మనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయగ్రాహాకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్ - శ్రీదేవి జంటగా నటించిన వసంత కోకిల చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. ఆయన రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తోపాటు, కేంద్ర ప్రభుత్వ, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

చిత్ర సమాహారం సవరించు

దర్శకుడిగా సవరించు

ఛాయాగ్రహకుడిగా సవరించు

అవార్డులు, గౌరవాలు సవరించు

జాతీయ చలనచిత్ర అవార్డులు సవరించు

ఫిల్మ్ ఫేర్ అవార్డులు సవరించు

నామినేట్ అయినవి
గెలుపొందినవి

కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు సవరించు

  • కోకిల – ఉత్తమ నేపథ్యం - 1977

కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు సవరించు

  • నీల్లు - ఉత్తమ ఛాయాగ్రహణం - 1974
  • చువన్న సంధ్యకల్, ప్రయాణం- ఉత్తమ ఛాయాగ్రహణం - 1975 (బ్లాక్ అండ్ వైట్)

నంది పురస్కారాలు సవరించు

బయటి లింకులు సవరించు

 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.