బాలు మహేంద్ర
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
బాలు మహేంద్ర (Balu Mahendra) (మే 20, 1939 - ఫిబ్రవరి 13, 2014) దక్షిణ భారతీయ సుప్రసిద్ధ ఛాయాగ్రహకుడు, దర్శకుడు. కళాత్మక చిత్రాలను తీయడంలో పేరుగాంచిన ఈయన ఇప్పటివరకు ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు. మొదట ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్ర సీమలో ప్రవేశించారు. అనంతరం ఆయన స్క్రీన్ ప్లే, దర్శకత్వ, నిర్మాణరంగంలోకి అడుగుపెట్టి తనదైన శైలిలో చిత్రాలను రూపొందించారు. దక్షిణాదిలోని అన్ని భాషలలో రూపొందిన చిత్రాలకు ఆయన పనిచేశారు.
బాలు మహేంద్ర Balu Mahendra | |
---|---|
జననం | బాలనాథన్ బెంజమిన్ మహేంద్ర 1939 మే 20 |
ఇతర పేర్లు | మహేంద్ర,బాలు |
వృత్తి | చలనచిత్ర దర్శకుడు, రచయిత, నిర్మాత, ఛాయాగ్రాహకుడు, ఎడిటర్ |
క్రియాశీల సంవత్సరాలు | 1971 – 2014 |
జీవిత భాగస్వామి | అఖిలేశ్వరి మహేంద్ర శోభ |
జననం, విద్యాభ్యాసం
మార్చు1939లో శ్రీలంక లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు. విద్యాభ్యాసంకూడా అక్కడే పూర్తి చేసారు. 13 ఏళ్ల వయసులో డేవిడ్ లీన్ దర్శకత్వంలో వచ్చిన ‘ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ క్వాయ్' చిత్రం చూసే అవకాశం దక్కించుకున్న బాలు మహేంద్ర తర్వాత సినిమాలపై ఆసక్తి పెంచుకున్నారు. లండన్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ హానర్స్ డిగ్రీ పట్టా పొందిన అనంతరం పూణె లోని ఎఫ్‌టిఐఐలో జాయినై సినిమాటోగ్రఫీలో కోర్సు పూర్తి చేయడంతో పాటు గోల్డ్ మెడల్ సాధించారు.
మరణం
మార్చు2014 ఫిబ్రవరి 13 తెల్లవారుజామున గుండెపోటు రావడంతో చెన్నైలోని విజయ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11.00 గంటలకు మరణించారు.
సినీ నేపథ్యం
మార్చుసొమ్మొకడిది సోకుకడది, తరం మారింది, లంబాడోళ్ల రాందాసు, మనవూరి పాండవులు, శంకరాభరణం తదితర చిత్రాలకు ఆయన ఛాయగ్రాహాకుడిగా పనిచేశారు. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో ఆయన పలు అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. భానుచందర్, అర్చన జంటగా నటించిన నిరీక్షణ చిత్రానికి, కమల్ హాసన్ - శ్రీదేవి జంటగా నటించిన వసంత కోకిల చిత్రానికి దర్శకత్వం వహించారు. వసంత కోకిల చిత్రం హిందీలో సద్మా పేరుతో వచ్చింది. ఆయన రెండు నంది అవార్డ్స్, ఎన్నో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తోపాటు, కేంద్ర ప్రభుత్వ, పలు రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నారు.
చిత్ర సమాహారం
మార్చుదర్శకుడిగా
మార్చు- Athu Oru Kanaa Kaalam (2005)
- Julie Ganapathy (2003)
- Aur Ek Prem Kahani (1996)
- సతీ లీలావతి (1995)
- Marupadiyam (1993)
- చక్రవ్యూహం (1992)
- Poonthenaruvi Chuvannu (1991)
- Vanna Vanna Pookkal (1991)
- సంధ్యారాగం (1989)
- వీడు (1988)
- Irattaival Kuruvi (1987)
- Rendu Thokala Titta (1987)
- Yaathra (1985)
- Unn Kannil Neer Vazhindal (1985)
- Neengal Kettavai (1984)
- Oomai Kuyil (1983)
- Sadma (1983)
- Moondram Pirai (1982)
- నిరీక్షణ (1982)
- Olangal (1982)
- Manju Moodal Manju (1980)
- Moodupani (1980)
- Azhiyatha Kolangal (1979)
- కోకిల (1977)
- Motor Sundaram Pillai (1966)
ఛాయాగ్రహకుడిగా
మార్చు- Yaathra (1985)
- పల్లవి అనుపల్లవి (1983)
- Sadma (1983)
- Moondram Pirai (1982)
- Olangal (1982)
- సీతాకోకచిలుక (1981)
- Moodupani (1980)
- శంకరాభరణం (1979)
- మనవూరి పాండవులు (1978)
- లంబాడోళ్ళ రామదాసు (1978)
- సొమ్మొకడిది సోకొకడిది (1978)
- Ulkatal (1978)
- తరం మారింది (1977)
- Nellu (1974)
అవార్డులు, గౌరవాలు
మార్చుజాతీయ చలనచిత్ర అవార్డులు
మార్చు- కోకిల - జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం (1978), (బ్లాక్ అండ్ వైట్)
- మూంద్రన్ పిరాయి (వసంత కోకిల) - [జాతాయ [ఉత్తమ ఛాయాగ్రహణం]], (1983), (కలర్)
- వీడు - జాతీయ ఉత్తమ చిత్రం, (1988) (తమిళం)
- సంధ్యారాగం - జాతీయ ఉత్తమ కుటుంబ చిత్రం, 1990
- వన్న వన్న పూక్కల్ - జాతీయ ఉత్తమ చిత్రం, (1992) (తమిళం)
ఫిల్మ్ ఫేర్ అవార్డులు
మార్చు- నామినేట్ అయినవి
- సద్మా - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ రచన (1983),
- గెలుపొందినవి
- మూంద్రన్ పిరాయి - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (తమిళం)
- ఒలంగల్ - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1983) (మలయాళం)
- వీడు - ఫిల్మ్ ఫేర్ ఉత్తమ దర్శకుడు , (1988) (తమిళం)
కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
మార్చు- కోకిల – ఉత్తమ నేపథ్యం - 1977
కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు
మార్చు- నీల్లు - ఉత్తమ ఛాయాగ్రహణం - 1974
- చువన్న సంధ్యకల్, ప్రయాణం- ఉత్తమ ఛాయాగ్రహణం - 1975 (బ్లాక్ అండ్ వైట్)
- మనవూరి పాండవులు - జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం- 1978.
- నిరీక్షణ - జాతీయ ఉత్తమ ఛాయాగ్రహణం - 1982.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బాలు మహేంద్ర పేజీ