సత్తారు లోకనాథం నాయుడు

సత్తారు లోకనాథం నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1972లో టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

సత్తారు లోకనాథం నాయుడు

ఎమ్మెల్యే
పదవీ కాలం
1972 - 1978
నియోజకవర్గం టెక్కలి

వ్యక్తిగత వివరాలు

జననం 1930
గోపీనాథపురం, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ పార్టీ
జీవిత భాగస్వామి అన్న పూర్ణమ్మ
సంతానం ముగ్గురు కుమార్తెలు, కుమారుడు

రాజకీయ జీవితం

మార్చు

సత్తారు లోకనాథంనాయుడు కాంగ్రెస్‌ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి గోపీనాథపురం సమితి అధ్యక్షునిగా ఎన్నికయ్యాడు. ఆయన 1972లో తొలిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా టెక్కలి శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వాటర్న్త్ర అభ్యర్థి సుగ్గు భీమేశ్వరరావు పై 14504 ఓట్ల మెజారితో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సత్తారు లోకనాథంనాయుడు ఆ తరువాత 1978, 1983, 1989 అసీంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత డిసిసిబి డైరెక్టర్‌గా పని చేశారు. లోకనాథంనాయుడు వైసిపి ఆవిర్భావం తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

సత్తారు లోకనాథంనాయుడు వయోభారా సమస్యలతో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో 2020 డిసెంబర్ 13న మరణించాడు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][2]

మూలాలు

మార్చు
  1. Prajasakti (13 December 2020). "మాజీ ఎమ్మెల్యే లోకనాథం ఇకలేరు" (in ఇంగ్లీష్). Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.
  2. Andhrajyothy (14 December 2020). "మాజీ ఎమ్మెల్యే సత్తారు లోకనాథంనాయుడు మృతి". Archived from the original on 16 November 2023. Retrieved 16 November 2023.