సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ (ఆంగ్లం: Satyajit Ray Film and Television Institute) భారతదేశం పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో ఉన్న ఒక చలనచిత్ర, టెలివిజన్ సంస్థ. ప్రఖ్యాత భారతీయ చిత్రనిర్మాత సత్యజిత్ రే పేరు మీద ఈ సంస్థ వృత్తిపరమైన ఉన్నత విద్యను, చలనచిత్ర, టెలివిజన్ నిర్మాణాలలో సాంకేతిక నైపుణ్యాన్ని అందిస్తుంది. 1995లో స్థాపించబడిన ఈ సంస్థ భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్
రకంఫిల్మ్ స్కూల్
స్థాపితం1995; 30 సంవత్సరాల క్రితం (1995)
చైర్మన్కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్, భారత ప్రభుత్వం
అధ్యక్షుడుసురేష్ గోపీ
డైరక్టరుహిమాన్సు శేఖర్ ఖతువా
స్థానంకోల్‌కతా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
22°29′05″N 88°23′43″E / 22.4848°N 88.3953°E / 22.4848; 88.3953
కాంపస్పట్టణ ప్రాంతంలో 40 ఎకరాలు
అనుబంధాలుఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ స్కూల్స్ (CILECT)
జాలగూడుsrfti.ac.in

2019లో ఇంటర్నేషనల్ లైజన్ సెంటర్ ఆఫ్ స్కూల్స్ ఆఫ్ సినిమా అండ్ టెలివిజన్ (CILECT)లో సభ్యత్వం పొందిన ఇది ప్రపంచంలోని ఉత్తమ చలనచిత్ర పాఠశాలలు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII), న్యూ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి వాటితో సమానంగా ఒకటిగా నిలిచింది.[1][2]

చరిత్ర

మార్చు

సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ 1995లో స్థాపించబడింది. పశ్చిమ బెంగాల్ సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం, 1961 కింద 1995 ఆగస్టు 18న సొసైటీగా నమోదు చేయబడింది. ఇది భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిధులు సమకూర్చే స్వయంప్రతిపత్తి కలిగిన సొసైటీ.[3] దీనికి ప్రశంసలు పొందిన భారతీయ చిత్ర దర్శకుడు సత్యజిత్ రే పేరు పెట్టారు.[4] మొదటి సెషన్ 1996 సెప్టెంబరు 1న ప్రారంభమైంది, డాక్టర్ దేబాశిష్ మజుందార్ 1997లో ఇన్‌స్టిట్యూట్ మొదటి డైరెక్టర్ గా చేసాడు.[5] 2024 సెప్టెంబరు 2న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సిఫారసుపై, డీమ్డ్ విశ్వవిద్యాలయ హోదా కోసం అవసరాలను తీర్చడానికి విద్యా మంత్రిత్వ శాఖ నుండి ఇన్‌స్టిట్యూట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను అందుకుంది.[6]

ప్రముఖ అధ్యాపకులు

మార్చు

ప్రముఖ పూర్వ విద్యార్థులు [7]

మార్చు

దర్శకత్వం - స్క్రీన్ ప్లే

మార్చు
  • విపిన్ విజయ్ (చిత్రసూత్రం)
  • అమల్ నీరద్ (బిగ్ బి, ఇయోబింటే పుస్తకమ్, భీష్మ పర్వం)
  • సాగర్ బళ్లారి (భేజా ఫ్రై, హమ్ తుమ్ షబానా)
  • హౌబం పబన్ కుమార్ (ఎఎఫ్ఎస్పిఎ 1958-56వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నాన్-ఫీచర్ ఫిల్మ్, మిస్టర్ ఇండియా-57వ జాతీయ చలనచిత్ర అవార్డులలో సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం)
  • కను బెహ్ల్ (ఓయ్ లక్కి! లక్కి ఓయ్!, లవ్ సెక్స్ ఔర్ ధోఖా, టైట్లి)
  • క్రిస్టో టోమీ (ఉల్లోజుక్కు)

సినిమాటోగ్రఫీ

మార్చు
  • శివకుమార్ విజయన్ (విద్యుమ్ మున్, సాలా ఖడూస్)
  • సిద్ధార్థ్ దివాన్ (తిత్లీ, బుల్బుల్, జాయేష్భాయ్ జోర్దార్)
  • షెహ్నాద్ జలాల్ (చిత్ర సూత్రం, బ్రహ్మయుగం)

ఎడిటింగ్

మార్చు
  • నమ్రతా రావు (ఇష్కియా, బ్యాండ్ బాజా బారాత్, కహానీ, 2 స్టేట్స్, ఫ్యాన్)

మూలాలు

మార్చు
  1. Dimitropoulou, Alexandra (23 July 2019). "Best Film Schools In The World For 2019". CEOWorld Magazine. Retrieved 25 March 2020.
  2. Suresh, Pradeep (24 July 2019). "These three Indian institutes are among the world's best film schools". CNBC TV18. Retrieved 25 March 2020.
  3. "Satyajit Ray Film and Television Institute, Kolkata". Ministry of Information and Broadcasting. Retrieved 25 March 2020.
  4. "About Satyajit Ray Film & Television Institute". Satyajit Ray Film & Television Institute. Retrieved 25 March 2020.
  5. "Our Institute". Satyajit Ray Film and Television Institute. Retrieved 25 March 2020.
  6. Dasgupta, Priyanka (2 September 2024). "Satyajit Ray Film and Television Institute gets LoI on deemed varsity status". The Times of India Sep 2, 2024, 02.48 PM IST. pp. 1–2. Archived from the original on 8 September 2024. Retrieved 2 September 2024.
  7. "Alumni". Satyajit Ray Film and Television Institute. Retrieved 25 March 2020.