సత్యనారాయణపురం (వర్ని)
సత్యనారాయణపురం, నిజామాబాదు జిల్లా, వర్ని మండలానికి చెందిన గ్రామం. గ్రామ పిన్‌కోడ్ 503201
గ్రామ విశేషాలు
మార్చుసత్యనారాయణపురం గ్రామంలో, 1955లో ఇక్కడి కళాకారులంతా కలిసి, ప్రత్యేకంగా ఒక బృందంగా ఏర్పడి "సత్యనారాయణ కళామండలి"ని ఏర్పాటు చేసుకున్నారు. వీరంతా సంక్రాంతి సంబురాలలో సందడి చేసేవారు. పండుగకు 15 రోజుల ముందునుంచే హరికథలూ, బుర్రకథలూ చెప్పేవారు. పాలేరు, పల్లెపడుచు, చింతామణి తదితర నాటకాలను స్వయంగా తయారుచేసుకొని గ్రామ ప్రధాన వేదికపై ప్రదర్శించేవారు.
వెంకటేశ్వరా టూరింగ్ టాకీస్
మార్చుగ్రామానికి చెందిన ఏలేటి సుబ్బారావు, చింతామణి నాటికకు దర్శకత్వం వహించగా, ముత్యాలరాయుడు సుబ్బిశెట్టి పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకునేవాడు. ఇప్పటికీ ఆ పాత్ర ప్రజలలో నిలిచిపోయింది. ఆయా నాటికలలో పాత్రధారుల పేర్లు, వారి పేర్లుగా మారిపోయినవి. దొంగ పాత్ర వేసిన వ్యక్తిని ఇప్పటికీ "దొంగరాముడు" గానే పిలవటం విశేషం. 1960 నుండి 1980 వరకూ సాగిన ఈ కార్యక్రమాలు, తరువాత కొనసాగలేదు. ఇందులో కొంతమంది కళాకారులు, 1972లో వెంకటేశ్వరా టూరింగ్ టాకీస్ ఏర్పాటుచేశారు. 1996 వరకూ బాగా నడచిన ఈ టాకీస్, 2000 సంవత్సరంలో మూతబడి హోటలుగా మారింది. [1]
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు[1] ఈనాడు నిజామాబాదు; జనవరి-13,2014; 8వ పేజీ.