సదాశివనగర్ మండలం (కామారెడ్డి జిల్లా)
సదాశివనగర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
సదాశివనగర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, సదాశివనగర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°26′54″N 78°16′04″E / 18.448347°N 78.267746°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | సదాశివనగర్ (కామారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 20 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 196 km² (75.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 56,005 |
- పురుషులు | 27,362 |
- స్త్రీలు | 28,643 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 45.37% |
- పురుషులు | 61.29% |
- స్త్రీలు | 29.75% |
పిన్‌కోడ్ | 503145 |
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 13 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 2 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం సదాశివనగర్.
గణాంకాలు
మార్చు2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం:56,005 - పురుషులు:27,362 - స్త్రీలు:28,643; అక్షరాస్యత - మొత్తం 45.37% - పురుషులు:61.29% - స్త్రీలు:29.75%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 196 చ.కి.మీ. కాగా, జనాభా 41,551. జనాభాలో పురుషులు 20,209 కాగా, స్త్రీల సంఖ్య 21,342. మండలంలో 10,162 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- భూంపల్లె
- పద్మాజీవాడి
- తుక్కోజీవాడి
- తిమ్మోజీవాడి
- దగ్గి
- కల్వరాల్
- సదాశివనగర్
- తిర్మన్‌పల్లె
- మర్కల్
- మోడెగాం
- లింగంపల్లె
- ముద్దోజీవాడి
- జనగావ్
- ధర్మారావుపేట
- అమర్లబండ
- కుప్రియాల్
- అడ్లూర్ యెల్లారెడ్డి
- వజ్జెపల్లె (ఖుర్దు)
- ఉట్నూర్
- యాచారం
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
మార్చు- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.