కామారెడ్డి రెవెన్యూ డివిజను

కామారెడ్డి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. కామారెడ్డి జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 9 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం కామారెడ్డి పట్టణంలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవిన్యూ డివిజను జహీరాబాదు లోకసభ నియోజకవర్గం, కామారెడ్డి శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

కామారెడ్డి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాకామారెడ్డి

వివరాలుసవరించు

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

పరిపాలనసవరించు

కామారెడ్డి డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం కామారెడ్డి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 కామారెడ్డి మండలం 22 రెవెన్యూ గ్రామాలు
2 బిక్నూర్ మండలం 15 రెవెన్యూ గ్రామాలు
3 తాడ్వాయి మండలం 20 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
4 రాజంపేట్ మండలం 8 రెవెన్యూ గ్రామాలు
5 దోమకొండ మండలం 11 రెవెన్యూ గ్రామాలు (1 నిర్జన గ్రామం)
6 బీబీపేట మండలం 10 రెవెన్యూ గ్రామాలు
7 మాచారెడ్డి మండలం 19 రెవెన్యూ గ్రామాలు
8 సదాశివనగర్ మండలం 22 రెవెన్యూ గ్రామాలు (2 నిర్జన గ్రామాలు)
9 రామారెడ్డి మండలం 15 రెవెన్యూ గ్రామాలు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-28.
  3. "Revenue Divisions | District Kamareddy, Government of Telangana | India". www.kamareddy.telangana.gov.in. Archived from the original on 2022-02-15. Retrieved 2022-04-28.
  4. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-04-28.