కన్యత్వం అనేది పురుషులు లేదా స్త్రీలు లైంగిక సంబంధాలను అనుభవించనప్పుడు ఉండే స్థితిని అంటారు

వివరణ

మార్చు

పరాశర ప్రకారం అష్ట వర్ష భవేత్ కన్యా. "అపూర్ణ దశవర్షా కన్యముద్వహేత్ " అని ఆపస్తంభం. సప్తవర్షా భవేద్గౌరీ, దశవర్షాతు నగ్నికా, ద్వాదశేతు భవేత్కన్యా, అత ఊర్ద్వం రజస్వలా"

భవిష్య పురాణం ప్రకారం 12 ఏళ్ళు దాటితే పుష్పవతి కాకున్నను సంభోగార్హత ఉంది. "వర్ష ద్వాదశకాదూర్ద్వం నస్యాత్పుష్పం బహిర్యది" అని కాశ్యప సంహిత.

హిందూ వివాహంలో కన్యా దానం ఒక ముఖ్యమైన భాగం. అనగా పెళ్ళి కూతురి తండ్రి తన కుమార్తెను పెండి కుమారునికి దానం ఇస్తాడు. కన్య అనే పదానికి పురుషలింగ పదం లేదు. పురుషునితో సంభోగించిన ఆడపిల్ల ఆ పురుషునికి కన్యత్వాన్ని ఇచ్చింది అని అంటారు. సంభోగం వల్ల స్త్రీకి గర్భం వస్తుంది కనుక హిందూమతంలో స్త్రీ కన్యాత్వానికి ప్రత్యేకత ఉంది. కనుక ఏ స్త్రీ అయినా వివాహం అయ్యే వరకూ తన కన్యత్వాన్ని కాపాడుకోవాలని అంటారు. సర్వసాధారణంగా వివాహమైన తర్వాత స్త్రీ తన భర్తకు కన్యాత్వాన్ని అర్పిస్తుంది. విధవరాలు లేదా విడాకులు పొందిన స్త్రీ కన్యాదానంగా ఇవ్వవడటానికి అర్హురాలు కాదు.

భాషా విశేషాలు

మార్చు

తెలుగు భాషలో కన్య పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[1] కన్య, కన్యక, కన్నియ or కన్నె అనగా పెళ్ళికాని పడుచు. కన్య ఒక రాశి : కన్యారాశి (Virgo). విశేషణముగా కన్నె అనగా కొత్త అని అర్ధం. ఉదా: కన్నెమెరుగు, కన్నెకయ్యము లేదా యుద్ధారంభము. కన్నెబావి, కన్నెబెబ్బులితోలు, కన్నెమావి. కన్నెరికము, కన్యతనము or కన్యాత్వము అనగా కన్యగా జీవించడం (Maidenhood).

కన్నెలపై పాటలు

మార్చు
  • కన్నెపిల్లవని కన్నులున్నవని ఎన్నెన్ని వగలు పోతున్నావే చిన్నారి చిన్న నవ్వు నవ్వి వన్నెలన్ని రువ్వి ఎన్ని కలలు రప్పించావే పొన్నారి -- ఆత్రేయ రచించిన ఆకలి రాజ్యం (1981) సినిమాలోని పాట.
  • శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారి "కన్నె పాటలు https://web.archive.org/web/20091122131254/http://www.maganti.org/kannepatalu/kannepatalu.html
  • చల్లని వెన్నెలలో చక్కని కన్నె సమీపములో అందమే నాలో లీనమాయెనే ఆనందమే నా గానమాయెనే ... కళకళలాడే కన్నె వదనమే కనిపించును ఆ తారలలో -- సంతానం (1955) సినిమాలోని పాట.
  • కళ్యాణం కానుంది కన్నె జానకికీ వైభోగం రానుంది రామచంద్రుడికీ
  • కన్నె వధువుగా మారేదీ జీవితంలో ఒకేసారి - ఆ వధువు వలపే విరిసేదీ ఈనాడే తొలిసారి - అందుకే తొలిరేయి అంత హాయి - సి.నారాయణ రెడ్డి రచించిన శారద (1973) సినిమాలోని పాట.

నేటి పరిస్థితి

మార్చు

నేడు టీనేజీ, వివాహ వయసొచ్చిన ఆడపిల్లలు ప్రపంచీకరణ, పాశ్చాత్య విష సంస్కృతిలో పబ్, డేటింగ్, వీకెండ్ రేవ్ పార్టీ పోకడల వలన, మితిమీరిన స్త్రీ ఆర్థిక స్వేచ్ఛ-చదువులు వలన బాయ్ ఫ్రెండ్స్ ఉండటమే స్టేటస్ సింబల్ గా భావించి వారితో తిరుగుచూ తమ భవిష్యత్తును, స్త్రీ పవిత్రతను పాడుచేసుకొంటున్నారు. ఇటీవల కొన్ని హిందూ సంస్థలు నిర్వహించే సామూహిక వివాహాల్లో వధువులకు కన్యత్వ పరీక్షలు నిర్వహించవలసిన దుస్థితి ఏర్పడినది.

మూలాలు

మార్చు
  1. బ్రౌన్[permanent dead link] నిఘంటువు ప్రకారం కన్య పదప్రయోగాలు.[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=కన్య&oldid=4347422" నుండి వెలికితీశారు