సపుతరా సరస్సు భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో గల డాంగ్స్ జిల్లాలోని సపుతరా పట్టణం దగ్గర ఉన్న ఒక మానవ నిర్మిత సరస్సు. ఇది ప్రధాన నగరం సపుతరా హిల్ స్టేషన్ నుండి 1 కిలోమీటర్ దూరంలో ఉంది.[1][2]

సపుతరా సరస్సు
సపుతరా సరస్సు
సపుతరా సరస్సు is located in Gujarat
సపుతరా సరస్సు
సపుతరా సరస్సు
Location in Gujarat
ప్రదేశండాంగ్స్, గుజరాత్
అక్షాంశ,రేఖాంశాలు20°34′32″N 73°44′43″E / 20.5755°N 73.7452°E / 20.5755; 73.7452
సరస్సు రకంకృత్రిమ సరస్సు
ప్రవహించే దేశాలుభారతదేశం
ప్రాంతాలుడాంగ్స్

చరిత్ర

మార్చు

రాముడు తన అరణ్యవాసంలోని 11 సంవత్సరాలు ఇక్కడ గడిపాడని నమ్ముతున్నందున సపుతరా ప్రాంతానికి పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. సపుతరా అనే పేరుకు ‘సర్పాల నివాసం’ అని అర్ధం.[3]

వినోదం

మార్చు
 
సపుతరా సరస్సు దగ్గర సూర్యోదయం

సరస్సు మానవ నిర్మితమైనది. బోటింగ్ వంటి కార్యకలాపాలకు బాగా ప్రాచుర్యం పొందింది. పర్యాటకుల వినోదం కోసం అనేక చిల్డ్రన్స్ పార్కులు, అనేక ఇతర ఆట స్థలాలు ఉన్నాయి. సరస్సు దగ్గర అనేక బోటింగ్ క్లబ్‌లు ఉన్నాయి.[4]

భౌగోళికం

మార్చు

సపుతరా సరస్సు కొండలు, పచ్చదనంతో నిండి ఉండి, విశ్రాంతి, ఆనందం కలిగించే సుందరమైన ప్రదేశం. ఇక్కడి నుండి సహ్యాద్రి కొండల సుదూర దృశ్యాలు కూడా కనిపిస్తాయి.[2]

జనాభా

మార్చు

భారతదేశ 2011 జనాభా లెక్కల ప్రకారం, సపుతరా నోటిఫైడ్ ప్రాంతంలో 2,968 జనాభా ఉంది. ఆ జనాభాలో 1,031 మంది పురుషులు, 1,937 మంది మహిళలు ఉన్నారు. డాంగ్స్ జిల్లాలోని అక్షరాస్యత (75.2%) తో పోలిస్తే సపుతరా ప్రాంతం అక్షరాస్యత ఎక్కువ. సపుతరా అక్షరాస్యత రేటు 87.4% గా ఉంది. అందులో పురుషుల అక్షరాస్యత రేటు 89.73%, స్త్రీ అక్షరాస్యత రేటు 86.29% గా ఉంది.[2]

మూలాలు

మార్చు
  1. "Saputara Hill station". Dangs district administration website. Retrieved 13 Jun 2018.
  2. 2.0 2.1 2.2 "Saputara Gujarat, Saputara Tourist Guide, route map Saputara, Directory of hotels & resorts in Saputara, Hill station saputara". www.indianmirror.com. Retrieved 2021-05-31.
  3. "Saputara- A Beautiful Hill Station in Gujarat". Tour My India (in ఇంగ్లీష్). 2015-06-15. Retrieved 2021-05-31.
  4. "Incredible India | Saputara". www.incredibleindia.org. Retrieved 2021-05-31.