సయీద్ అహ్మద్ (క్రికెటర్)

పాకిస్తానీ బోధకుడు, మాజీ క్రికెటర్

సయీద్ అహ్మద్ (జననం 1937, అక్టోబరు 1) పాకిస్తానీ బోధకుడు, మాజీ క్రికెటర్. ఇతను పదవీ విరమణ తర్వాత తబ్లిఘి జమాత్ సభ్యుడిగా ఉన్నాడు. 1958 - 1972 మధ్యకాలంలో 41 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.

సయీద్ అహ్మద్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
సయీద్ అహ్మద్
పుట్టిన తేదీ (1937-10-01) 1937 అక్టోబరు 1 (వయసు 87)
జలంధర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడి చేయి ఆఫ్‌బ్రేక్
బంధువులుయూనిస్ అహ్మద్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 27)1958 జనవరి 17 - వెస్టిండీస్ తో
చివరి టెస్టు1972 డిసెంబరు 29 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 41 213
చేసిన పరుగులు 2,991 12,847
బ్యాటింగు సగటు 40.41 40.02
100లు/50లు 5/16 34/51
అత్యధిక స్కోరు 172 203*
వేసిన బంతులు 1,980 18,879
వికెట్లు 22 332
బౌలింగు సగటు 36.45 24.75
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 15
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 4/64 8/41
క్యాచ్‌లు/స్టంపింగులు 13/– 122/–
మూలం: Cricinfo, 2016 జూన్ 13

సయీద్ అహ్మద్ 1937, అక్టోబరు 1న బ్రిటీష్ ఇండియాలో భాగమైన అప్పటి బ్రిటిష్ పంజాబ్‌లోని జలంధర్‌లో జన్మించాడు. లాహోర్‌లోని ప్రభుత్వ ఇస్లామియా కళాశాలలో చదువుకున్నాడు. డ్రైవ్‌తో కుడిచేతి వాటం కలిగిన మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, ఆఫ్-బ్రేక్‌ బౌలర్ గా రాణించాడు. ఇతను మరో క్రికెటర్ యూనిస్ అహ్మద్ సోదరుడు.[1]

క్రికెట్ రంగం

మార్చు

ఇతను 1958, జనవరి 17న వెస్టిండీస్‌తో బ్రిడ్జ్‌టౌన్‌లో టెస్టు క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులు చేశాడు. 1968-69లో డ్రా అయిన మూడు టెస్టులకు కెప్టెన్‌గా కొనసాగాడు. 1972లో ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టుకు వెన్ను గాయం కారణంగా అతను అనర్హుడని ప్రకటించడంతో ఇతని కెరీర్ వివాదాస్పద పరిస్థితుల్లో ముగిసింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

పాకిస్తాన్ దౌత్యవేత్త షహర్యార్ ఖాన్ బంధువైన ప్రఖ్యాత వ్యాపారవేత్త బేగం సల్మాతో అహ్మద్‌ వివాహం జరిగింది. తరువాత వ్యాపారంలో నిమగ్నమయ్యాడు.[1]

1980లో క్రికెట్, వ్యాపార వృత్తిని విడిచిపెట్టి తబ్లిఘి జమాత్‌లో బోధకుడిగా చేరాడు.[1]

రికార్డులు

మార్చు
  • అత్యంత వేగంగా 1,000 టెస్టు పరుగులు (20 ఇన్నింగ్స్‌లు) సాధించిన పాకిస్థానీ క్రికెటర్.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 1.2 Salman Faridi (7 June 2020). "The Twenty Two Families of Pakistan Test Cricket – Part III". The News International (newspaper). Retrieved 18 October 2021.
  2. "Records / Test matches / Batting records / Fastest to 1000 runs". ESPN Cricinfo. Retrieved 18 October 2021.

బాహ్య లింకులు

మార్చు