సయ్యద్ లతీఫుద్దీన్

సయ్యద్ లతీఫుద్దీన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు. ఫుట్‌బాల్ ఆటలో భారతదేశపు టాప్ లెఫ్ట్ వింగర్‌గా ప్రశంసించబడ్డాడు. 1973-1977 వరకు నాలుగు సంవత్సరాలపాటు భారత దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.[1]

సయ్యద్ లతీఫుద్దీన్
వ్యక్తిగత సమాచారం
జనన ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
మరణ తేదీ 18 సెప్టెంబరు 2018
మరణ ప్రదేశం హైదరాబాదు, తెలంగాణ
జాతీయ జట్టు
భారతదేశం
† Appearances (Goals).

జననం మార్చు

లతీఫుద్దీన్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. ఇతని తండ్రి సయ్యద్ మొయినుద్దీన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. 1952లో జరిగిన సమ్మర్ ఒలింపిక్స్‌లో పురుషుల టోర్నమెంట్‌ విభాగంలో పాల్గొన్నాడు.[2]

క్రీడారంగం మార్చు

1974 థాయ్‌లాండ్‌లో జరిగిన ఏఎఫ్ సి అండర్-19 ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం తరపున ఆడిన లతీఫ్ ఇరాన్‌పై రెండు గోల్స్‌లో ఒకటి సాధించాడు. ఇందులో 2-2 డ్రా అయిన తర్వాత రెండు జట్లు ఉమ్మడి విజేతలుగా ప్రకటించబడ్డాయి. 1974 మెర్డెకా కప్ మ్యాచ్‌లో ఇండోనేషియాపై స్కోర్ చేశాడు, ఆ మ్యాచ్‌లో టై-బ్రేకర్‌లో భారతదేశం ఓడిపోయింది.

లతీఫ్ 1970 నుండి ఎనిమిది సంవత్సరాలపాటు స్పోర్టింగ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1972-1974 మధ్యకాలంఓ రెండు సంవత్సరాలు తూర్పు బెంగాల్ జట్టుకు ఆడాడు. తరువాత స్పోర్టింగ్‌కు తిరిగి వచ్చి 1980 వరకు అక్కడే ఉన్నాడు. 1976లో కలకత్తా ఫుట్‌బాల్ లీగ్ లలో లతీఫ్ 22 గోల్స్‌తో టాప్ స్కోరర్‌గా నిలువడంతోపాటు నాలుగు అవార్డులు కూడా అందుకున్నాడు.

పురస్కారాలు మార్చు

  • కలకత్తాలోని సంస్థ నుండి షాన్ -ఇ -మహమ్మదన్ ' పేరిట లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును 2017, జూన్ 23 న కోల్‌కతాలో జరిగిన క్లబ్ ఇఫ్తార్ విందు సందర్భంగా అందుకున్నాడు.[3]

మరణం మార్చు

కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న లతీఫ్ తన 66 ఏళ్ళ వయసులో 2018, సెప్టెంబరు 18న హైదరాబాదులో మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. The Times of India, Telangana (22 June 2017). "Hyderabad footballer Syed Lateefuddin is 'Shan-e-Mohammedan' | Hyderabad News - Times of India" (in ఇంగ్లీష్). B. Krishna Prasad. Archived from the original on 29 June 2017. Retrieved 21 October 2021.
  2. "Sayed Moinuddin Bio, Stats, and Results | Olympics at Sports-Reference.com". web.archive.org. 2020-04-18. Archived from the original on 2012-12-18. Retrieved 2021-10-21.
  3. Sameer (2017-06-21). "Hyderabadi footballer Lateefuddin Najam nominated for "Shaan-e-Mohammedan" award". The Siasat Daily – Archive (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-10-21.
  4. Deccan Chronicle, Telangana (19 September 2018). "Former footballer Syed Lateefuddin Najam no more" (in ఇంగ్లీష్). Archived from the original on 6 October 2021. Retrieved 21 October 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 6 అక్టోబరు 2018 suggested (help)