సరళా సాగర్ ప్రాజెక్టు
సరళా సాగర్ ప్రాజెక్టు, వనపర్తి జిల్లా లోని మదనాపూర్ మండలంలోని శంకరమ్మ పేట గ్రామంలో ఉంది.
చరిత్ర
మార్చుదీనిని పూర్వం వనపర్తి సంస్థానాన్ని పరిపాలించిన రాజులలో ఒకడైన రెండవ రామేశ్వరరావు కాలంలో సరళాదేవి పేరు మీదుగా ఒక చెరువులా నిర్మించారు దీని నిర్మాణం కోసం రామేశ్వరరావు-II గారు ఇంజనీర్ లను అమెరికా లోని కాలిఫోర్నియాకు పంపించి అధ్యయనం చేసిన తర్వాత శంకరమ్మపేటలో 35 లక్షలతో వ్యయంతో నిర్మాణం చేపట్టారు. సరళసాగర్ ప్రాజెక్ట్ ను 1949 సెప్టెంబరు 15 న ఆనాటి హైదరాబాద్ మిలిటరీ గవర్నర్ జనరల్ జయంతో నాథ్ చౌదరీ చేతుల మీదుగా ఊకచెట్టు వాగు మీద పునాదులు వేశారు. దీని సామర్థ్యం 0.42 టీఎంసీ ఈ ప్రాజెక్టు కింద 9 గ్రామాలకు సాగు నీరు అందుతుంది అనేక మందికి వ్యవసాయ, మత్స్య కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది [1]. దీనినే ఆధునీకరించి 1959 జూలై 26 వ తేదిన సరళా సాగర్ ప్రాజెక్టుగా తీర్చిదిద్దారు. అప్పటి పి. డబ్ల్యూ . డి. శాఖామంత్రి జె.వి. నర్సింగరావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. 1964 సెప్టెంబరులో కుడివైపు గండి పడితే కొంత భాగాన్ని రాతితో ఆనకట్ట పునర్నిర్మించారు తదనంతర కాలంలో బుర్ర వాగు ఇతర వాగుల నుంచి వచ్చే ప్రవాహాలు అనావృష్టి కారణంచేత ఆగి పోవడం జరిగింది కాలక్రమేణా సరళ సాగర్ ప్రాజెక్ట్ మరుగున పడిపోయింది.ఇది వర్షాధార ప్రాజెక్టు కావడం మూలాన ఆ సమస్యను అధిగమించడానికి, నిరంతరం నీటితో ఉండటానికి ప్రాజెక్టుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న రామన్ పాడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా 12 కోట్ల రూపాయల వ్యయంతో ఎత్తిపోతల పథకాన్ని 2008 లో గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి డా. జిల్లెల చిన్నారెడ్డి ప్రారంభించారు. దాదాపు పదకొండు సంవత్సరాల పాటు అనేక మంది రైతుల పంటలకు నీరు అందించింది.కానీ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కొరవడడంతో 2019 డిసెంబరు 31 ఉదయం 6:15 ని సమయంలో సరళ సాగర్ కు ఎడమవైపు భారీ గండి పడింది దీనితో రైతాంగం తీవ్రంగా నష్టపోయారు 2020 ఆగస్టు నాటికి గండిని పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది.
సరళసాగర్ 16-08-2020 ఆదివారం తెల్లవారుజామున 4:20గంటలకు ప్రాజెక్టులో మూడు హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ఆటోమెటిక్‌గా తెరుచుకున్నది. 11 ఏండ్ల తర్వాత సైఫన్లు తెరుచుకోవడంతో పర్యాటకులు పెద్దఎత్తున తిలకించారు. ప్రాజెక్టు సామర్థ్యం 0.42 టీఎంసీలు నీరు సైఫన్ల ద్వారా 1089 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతుంది. ఈ ప్రాజెక్టు ద్వారా వనపర్తి జిల్లాలో 10 గ్రామాల్లో 4,200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరందుతుంది. గతేడాది తెగిపోయిన కట్టకు మరమ్మతులు చేయడంతో ఈ ఏడాది నీటి నిల్వ పెరిగి సైఫన్లు తెరుచుకోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోసారి సైఫన్ల్ 4-09-2020 న తెరుచుకున్నాయి.ఈ సీజన్లో మూడవసారి15-09-2020 తేదినా సైఫన్స్ తెరచుకోని చూపరులకు కనువిందు చేశాయి.2021 వర్షాకాలం సీజన్ లో సెప్టెంబరు 7 వ తేదీన సైఫన్స్ తెరుచుకున్నాయి అధిక వర్షాలతో మూడు రోజుల తర్వాత 10 తేదీన కూడా 1 సైఫన్ 4 హుడ్ సైఫన్ తెరుచుకున్నాయి. ఇదే సీజన్లో భారీ వర్షాల వల్ల 1 ప్రధాన సైఫన్, 4 హుడ్ సైఫన్స్ స్వయం నియంత్రణతో తెరచుకొని చూపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.2022 సీజన్ సెప్టెంబరు నేలలో సైఫన్స్ తెరుచుకోవడంతో మదనాపురం వాగులో ఆత్మకూరుకు చెందిన కురుమూర్తి అనే లెక్చరర్ వరద ఉధృతి లో మరణించాడు సెప్టెంబరు నెలలో వర్షాల దాటికి చాలా రోజుల పాటు సైఫన్స్ నీటిని విడుదల చేశాయి.2022 అక్టోబరు 1 వ తేదీన వర్షాల కారణంగా సైఫన్స్ తెరుచుకున్నాయి అక్టోబరు 6 న మళ్ళీ సాయంత్రం హుడ్ సైఫన్స్ తెరుచుకోవడంతో మదనాపురం వాగులో కౌకుంట్లకు చెందిన ఒక మహిళ ఇద్దరు పురుషులు బైక్ పై వెళ్ళుతు వరద ఉధృతి లో కోట్టుకపోయారు . మరుసటి రోజు గోపన్ పేట దగ్గర మృతదేహాలు లభ్యం అయ్యాయి.
1960లో మొదటిసారిగా సైఫన్లు తెరుచుకున్నాయి. ఆ తర్వాత వరుసగా మూడేండ్లు భారీ వర్షాలు కురువడంతో 1963 వరకు తెరుచుకున్నాయి. 1964 సెప్టెంబరు చివరి వారంలో అతి భారీ వర్షాలు రావడంతో శంకరసముద్రం ఆనకట్ట తెగిపోయి సరళాసాగర్‌కు నీరు చేరుకోవడంతో సరళాసాగర్ కట్ట తెగిపోయింది. దీంతో నీటి ఉధృతి తట్టుకునేందుకు అలుగు ఏర్పాటు చేశారు. అనంతరం 1967 నుంచి 1970 వరకు సరళాసాగర్ సైఫన్లు తెరుచుకున్నాయి. తిరిగి 1974 నుంచి 1981 వరకు 1988,90,91,93, 98లో సైఫన్లు తెరుచుకున్నాయి. చివరగా 2009 అక్టోబరు 01న తెరుచుకున్నాయి. 2019లో సైఫన్లు తెరుచుకునే సమయంలోనే కట్ట తెగిపోవడంతో నీరంతా కృష్ణనదిలోకి వెళ్ళింది.2023 సంవత్సరం లో వర్షాలు కురవకపోవడంతో సైఫన్స్ తెరుచుకోలేదు.2024 సెప్టెంబర్ 1 న భారీ వర్షాలకు వివిధ వాగులు, కాలువల ద్వారా నీరు ప్రాజెక్ట్ లోకి చేరడంతో సైఫన్స్ తెరుచుకున్నాయి.[2]
ప్రాజెక్టు సామర్థ్యం
మార్చుఈ ప్రాజెక్టు సామర్థ్యం 0.42టీఎంసీల కెపాసిటీ ఉండగా 771 ఎకరాల్లో 1,372 మెట్రిక్ క్యూబిక్ ఫీట్లలో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులు ఉండగా 1089.25 అడుగులకు నీరు వస్తే సైఫన్లు ఆటోమెటిక్‌గా ఓపెన్ అవుతాయి. 1095 అడుగులకు నీరు చేరితే ప్రాజెక్టులో అన్ని సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రాజెక్టు బెడ్ లెవల్ 1054 అడుగులు ఉండగా 1067 అడుగులకు నీరు చేరితే ఎడమకాల్వ ద్వారా, 1072 అడుగులు కుడి కాల్వకు నీరు చేరుతుంది. ఎడమ కాల్వ ద్వారా 82 క్యూసెక్కుల నీరు విడుదలై 16 కి.మీ. దూరం ప్రవహించి 8 గ్రామాల్లోని 3,769.20ఎకరాలకు సాగునీరు అందుతుంది. కుడి కాల్వ ద్వారా 6.89 క్యూసెక్కుల నీరు విడుదలై 4.50కి.మీ పాటు ప్రవహించి రెండు గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది. ప్రాజెక్టులో 17 హుడ్ సైఫన్లు, నాలుగు ప్రైమ్ సైఫన్లు ఏర్పాటు చేశారు.
సైఫన్ సిస్టం గేట్లు
మార్చుఏనుగుతొండం ఆకారంలో ఉండే ఒక్కో హుడ్‌సైఫన్ ద్వారా 3,444 క్యూసెక్కుల నీటి చొప్పున అన్ని సైఫన్లు 17 తెరుచుకుంటే 58,500 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతాయి. ఒక్కో ప్రైమ్ సైఫన్ ద్వారా 500 క్యూసెక్కుల నీటి చొప్పున 4 ప్రైమ్ సైఫన్లు తెరుచుకుంటే 2000 క్యూసెక్కులు విడుదలవుతాయి. పూర్తిస్థాయి నీటిమట్టం 1089 అడుగులుండగా 1089.25 అడుగులకు నీరు చేరుకుంటే ఆటోమెటిక్‌గా సైఫన్లు తెరుచుకుంటాయి. ప్రతి 0.25 అడుగులు పెరిగే కొద్ది ప్రాజెక్టులో 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ తెరుచుకుంటుంది. ప్రస్తుతం 1089.25 అడుగులకు చేరుకోవడంతో ప్రాజెక్టులో 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ద్వారా 1089 క్యూసెక్కులు విడుదలవుతుంది.
ఆయకట్టు పరిధి
మార్చు10 గ్రామాల్లో 4200 ఎకరాలకు దీని ద్వారా సాగునీరు అందుతుంది. కొత్తకోట, మదనాపురం మండలంలోని 10 గ్రామాలకు సాగునీరు చేరుతుంది. ఎడమ కాల్వ ద్వారా మదనాపురం మండలంలోని శంకరమ్మపేట, దంతనూరు, మదనాపురం, తిర్మలాయపల్లి, రామన్‌పాడు, అజ్జకోలు, కొన్నూరు, నర్సింగాపురంలోని 3,769.20 ఎకరాలకు, కొత్తకోట మండలం రామానంతపురం, చర్లపల్లి గ్రామాల్లోని 388.22 ఎకరాలకు సాగునీరు చేరుతుంది.
రైతులు సంతోషం
మార్చుప్రాజెక్టులోని 3 హుడ్ సైఫన్లు, ఒక ప్రైమ్ సైఫన్ ద్వారా 1089 క్యూసెక్కులు విడుదలవుతున్నది. 11 ఏండ్ల తర్వాత సైఫన్లు తెరుచుకోవడం చాలా సంతోషకరం. నీటి ప్రవాహం పెరిగే ప్రతి 0.25 అడుగుల పెరుగుదలకు సైఫన్లు ఆటోమెటిక్‌గా తెరుచుకుంటాయి.
ప్రత్యేకత
మార్చుసైఫన్ పద్ధతిలో నిర్మించిన ప్రాజెక్టులలో ఈ ప్రాజెక్టు ప్రపంచంలో రెండవదైతే. ఆసియాలో మొదటిది[2].
ప్రాజెక్టు ఖర్చు
మార్చుఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో (1959) 35 లక్షల రూపాయలు ఖర్చుచేశారు.
నిర్మాణం
మార్చుఈ ప్రాజెక్టు నిర్మాణంలో 17 హుడ్ సైఫన్ లను, 4 ప్రైమింగ్ సైఫన్ లను ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ప్రైమింగ్ సైఫన్ ద్వారా సెకన్ కు 2000 (రెండు వేల) క్యూసెక్ ల నీటిని బయటికి పంపితే, ఒక్కో హుడ్ సైఫన్ ద్వారా 3440 క్యూసెక్ ల నీటిని బయటికి పంపుతారు. ప్రాజెక్టులోకి పూర్తి స్థాయి నీటి మట్టం చేరినప్పుడు గాలి పైపుల ద్వారా ఏర్పాటు చేసిన సైఫన్ లు ఆటోమేటిక్ గా పనిచేస్తాయి. 520 ఫీట్ల రాతి కట్టడం, 3537 ఫీట్ల మట్టి కట్టడం ఈ ప్రాజెక్టులో అంతర్భాగం.
కాలువలు
మార్చు- కుడి కాలువ 8 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా 388 ఎకరాలకు సాగునీరును అందిస్తున్నారు.
- ఎడమ కాలువ 17 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ కాలువ ద్వారా 3796 ఎకరాలకు సాగునీరును అందిస్తున్నారు.
రవాణా సౌకర్యాలు
మార్చుసరళ సాగర్ ప్రాజెక్ట్ హైదరాబాద్ కు 135 కిలోమీటర్ల దూరంలో కలదు జాతీయ రహదారి 44 ద్వారా ఇక్కడికిి చేరుకోవచ్చు. అదేేవిధంగా దక్షిణ మధ్య రైల్వే సర్వీసు ద్వారా వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ కు ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు కలదు దీనిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ఈ ప్రాజెక్టుకుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
మార్చుఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరునే కాకుండా సమీపంలోని పది గ్రామాలకు తాగునీటి సౌకర్యాన్ని కూడా ఏర్పాటుచేశారు. ఇక్కడ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సైఫన్ లు పనిచేసే సందర్భంలో నీటి విరజిమ్మే దృశ్యాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆవిధంగా ఇది పర్యాటక ప్రాంతంగానూ ప్రజలకు అందుబాటులో ఉంది.
మూలాలు
మార్చువెలుపలి లంకెలు
మార్చు1.యాదగిరి వ్యక్తిగత ఆసక్తి తో రచన yadagiri055@gmail.com