జిల్లెల చిన్నారెడ్డి

జిల్లెల చిన్నారెడ్డి (Jillela Chinnareddy) మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఇతను వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 3 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. గోపాల్ పేట మండలానికి చెందిన చిన్నారెడ్డి ఉన్నత పాఠశాల వరకు వనపర్తిలో విద్యనభ్యసించాడు. 1970లోనే విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నాడు.[1]

జిల్లల చిన్నారెడ్డి
నియోజకవర్గము వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ

రాజకీయ నేపథ్యంసవరించు

తొలిసారిగా 1985లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నేతగా ఉంటూ వనపర్తి టికెట్ సాధించి తెలుగుదేశం అభ్యర్థి బాలకృష్ణయ్య చేతిలో ఓడిపోయాడు.[2] 1989లో బాలకృష్ణయ్యపై విజయం సాధించి తొలిసారి శాసనసభలో ప్రవేశించాడు. 1994లో మూడవసారి పోటీచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావుల చంద్రశేఖర్ చేతిలో పరాజయం పొందినాడు. 1999లో రావుల చంద్రశేఖర్‌పై 3500 మెజారిటీతో విజయం సాధించాడు. 2004లో ఐదవసారి పోటీలో దిగి వరుస విజయం సాధించి మూడో సారి శాసన సభ్యులు అయ్యాడు. వైఎస్సార్ మంత్రివర్గంలో గ్రామీణాభివౄద్ధి శాఖా మంత్రిగా పనిచేశాడు. 2009లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీచేసి రావుల చంద్రశేఖర్ చేతిలో ఓడిపోయాడు.[3]

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-3-2009
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 30-12-2003
  3. సూర్య దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-5-2009