సరస్వతి రంగస్వామి అయ్యంగారు

సరస్వతి రంగస్వామి అయ్యంగారు (1890 - ఫిబ్రవరి 24, 1960) ప్రముఖ రంగస్థల నటుడు.[1]

సరస్వతి రంగస్వామి అయ్యంగారు
సరస్వతి రంగస్వామి అయ్యంగార్
జననం1890
మరణంఫిబ్రవరి 24, 1960
జాతీయతభారతీయుడు
వృత్తిరంగస్థల నటుడు

సరస్వతి రంగస్వామి 1890లో జన్మించాడు.

రంగస్థల ప్రస్థానం

మార్చు

1901లో ఒకటవ ఫారం చదువుతూ వై. గోపాలకృష్ణయ్య వద్ద నాటక విషయాలు తెలుసుకున్న రంగస్వామి 1903లో మూడవ ఫారం చదువుతూ మొదటిసారిగా వేషంవేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆంధ్రభాషాభిమాన సమాజంలో వేదం వేంకటరాయశాస్త్రి శిక్షణలో వేషాలు వేశాడు. స్త్రీ, పురుష పాత్రలు సమర్ధవంతంగా పోషించడమేకాకుండా, ఒకే నాటకంలో రెండు విరుద్ధ పాత్రలను కూడా ధరించేవాడు.

నటించిన పాత్రలు

మార్చు
  1. ప్రతాపరుద్రుడు, పేరిగాడు, సూత్రధారుడు, యుగంధరుడు (ప్రతాపరుద్రీయం)
  2. రంగారాయుడు, పాపారాయుడు (బొబ్బిలి)
  3. గౌరి (నాగానందము)
  4. చంద్రగుప్తుడు
  5. ముర
  6. సాహెబ్ జనాబ్ (తప్పెవరిది)
  7. కావలి జనాన్ (కుంభరాణా)
  8. చిత్రలేఖ (ఉష)
  9. శకుంతల
  10. రాణీసంయుక్త

సరస్వతి రంగస్వామి 1960, ఫిబ్రవరి 24 న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. నాటక విజ్ఞాన సర్వస్వం, తెలుగు విశ్వవిద్యాలయం కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన సర్వస్వం కేంద్ర ప్రచురణ, హైదరాబాదు, 2008, పుట.479.