సర్వజిత్తు
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1827 - 1828, 1887 - 1888, 1947 - 1948, 2007-2008లో వచ్చిన తెలుగు సంవత్సరానికి సర్వజిత్తు అని పేరు. ఈ సంవత్సరం చాలా విశేషమైనది; ఈ సంవత్సరంలో మానవులు తలపెట్టిన శుభకార్యాలన్నీ విజయవంత మవుతాయని భావిస్తారు.
సంఘటనలు
మార్చు- క్రీ. శ. 1887: కొల్లూరి కామశాస్త్రి రచించిన శూద్రకమలాకరము ప్రచురణ.
- క్రీ. శ. 1947, ఆగష్టు 15: భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది.
జననాలు
మార్చు- సా.శ.1828 కార్తీక శుద్ధ విదియ : నరసింహదేవర వేంకటశాస్త్రి - తెలుగు కవి.
- సా.శ.1887 చైత్ర శుద్ధ నవమి : ఒద్దిరాజు సీతారామచంద్రరావు - ఒద్దిరాజు సోదరులలో పెద్దవాడు (మ.1956).
- సా.శ.1888 మాఘ బహుళ ఏకాదశి: వేటూరి ప్రభాకరశాస్త్రి - తెలుగు రచయిత, పరిశోధకుడు. (మ.1950)
- సా.శ.1948 పుష్య బహుళ తదియ :ప్యారక శేషాచార్యులు - అవధాని, కవి, గేయరచయిత.[1]
మరణాలు
మార్చు- 1828 ఫాల్గుణ శుద్ధ ఏకాదశి : రావు వేంకట నీలాద్రిరావు - పిఠాపురం సంస్థాన ప్రభువు. (జ.1775).[2]
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- చైత్ర శుద్ధ పాడ్యమి (మార్చి 20) - ఉగాది: సర్వజిత్తు నామ సంవత్సరం ప్రారంభం.
మూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 535.
- ↑ సి.కమలా అనార్కలి (1973). పిఠాపుర సంస్థానము కవిపండిత పోషణ. కాకినాడ: సి.కమలా అనార్కలి. p. 37. Retrieved 22 April 2020.