సర్వదర్శన సంగ్రహం
సర్వదర్శన సంగ్రహం (సంస్కృతం: सर्वदर्शनसंग्रहः) మాధవ విద్యారణ్యుడిచే రచించబడిన అతి ప్రాచీన హైందవ నాస్తిక తత్వం. ఇందులో
- చార్వాక దర్శనం
- బౌద్ధ దర్శనం
- ఆర్హత దర్శనం
- రామానుజ దర్శనం
- పూర్ణప్రజ్ఞ దర్శనం
- నకులీశ పాశుపతదర్శనం
- శైవ దర్శనం
- ప్రత్యభిజ్ఞా దర్శనం
- రసేశ్వర దర్శనం
- ఔలూక్య దర్శనం
- అక్షపాద దర్శనం
- జైమినీయ దర్శనం
- పాణిని దర్శనం
- సాంఖ్య దర్శనం
- పాతంజల దర్శనం
కలవు.
రచయిత గురించి
మార్చుమాధవ విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్యంలో హరిహరునికి, బుక్క రాయకీ రాచగురువు, మహర్షి. శృంగేరీ శారదా పీఠానికి 12వ జగద్గురువుగా 1380-1386 వరకూ వ్యవహరించారు. హంపి లో గానీ, వరంగల్లులో గానీ వీరు జన్మించి ఉండవచ్చునని ఒక అభిప్రాయము కలదు.
గ్రంథం
మార్చుఅన్ని అధ్యాయములలోను విద్యారణ్యుడు దైవముపై నున్న నమ్మకాన్ని ప్రశ్నిస్తాడు. ఈ మతాలను కనుగొన్నవారి వాక్కులను నేరుగా ప్రస్తావిస్తూనే వీటన్నింటికీ భిన్నంగా నాస్తికత్వాన్ని ప్రబోధిస్తాడు.
కాలగర్భంలో కలిసిపోయిన చార్వాకుని బోధనలకు ఇందులోని మొదటి అధ్యాయమైన చార్వాకదర్శనం ఒక చక్కని మూలం.
కొన్ని ముఖ్యమైన బోధనలు
మార్చుచార్వాక దర్శనము
మార్చు- ఏ జీవికైనను మరణము తప్పదు. చనిపోయిన తర్వాత మరల ప్రాణం రాదు. కనుక జీవించినంత కాలము (అప్పు తీసుకొనైనా సరే, నేతిని సేవించి) సుఖముగ జీవించవలెను.
- ఐహిక భోగాలు, భౌతికవాద సుఖములలో దు:ఖము పొంచి ఉన్నది కావున వీటిని పరిత్యజించాలి అనేది మూర్ఖమైన భావన. పొట్టు/మురికి ఉన్నంతమాత్రాన, ధాన్యాన్ని సేవించట మానేయం కదా?
- వేదాలు, యజ్ఞోపవీతాలు, భస్మలేపనాలు బుద్ధిహీనుల/అమానుషుల పొట్ట నింపటానికి సృష్టించబడినవి
- అగ్నిలో వేడిమి, నీటిలో చలువ, ప్రొద్దుటే వీచే పిల్లగాలిలో తాజాదనం; వాటి వాటి స్వభావరీత్యా ప్రాప్తించినవే. దీనికి ఎవ్వరూ (భగవంతుడు) కారకులు కారు.
- స్వర్గం, నరకం, మోక్షం, ఆత్మ, పరలోకఫలాలు; ఇవేవీ లేవు. వర్ణాశ్రమ భేధాలతో చేసే క్రియల వలన తర్వాతి కాలంలో వాటి వల్ల ఫలితాలు కలుగుతాయన్నది కూడా ఒట్టి మాటే!
- జ్యోతిష్టోమాది యజ్ఞంలో ఏ పశువునైతే వధిస్తారో అది స్వర్గానికేగుతుందని తెలిపెదరు. ఇదే సత్యమైతే ఏదో ఒక యజ్ఞం చేసి మీ తల్లిదండ్రులను కూడా కాళికి బలివ్వచ్చు కదా? అలా చేస్తే వారికి కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది కదా?
- చనిపోయిన వ్యక్తి పేరుపై శ్రాద్ధం నిర్వహించటం వలనే అతని ఆత్మ శాంతించేటట్లయితే మనం దూరప్రదేశాల ప్రయాణానికి వెళ్ళినపుడు కూడా భోజనం ఎందుకు తీసుకువెళ్ళటం?
వంటలన్నీ ఇంట్లోనే వండేసి నివేదించేస్తే ఆ భోజనం దానంతకై అదే మనకు ఆకలి వేసినపుడు మన ఆకలిని తీరుస్తుంది.
- స్వర్గంలో ఉన్న వారి ఆత్మలకు శాంతి, భూమిపై వారి శ్రాద్ధాలతోనే జరిగేటట్లైతే ఇంటి పై కప్పుపై ఉన్న వారి ఆకలిని క్రింది అంతస్థు నుండే తీర్చవచ్చు కదా?
- ఈ దేహాన్ని విడిచి పరలోకము వెళ్ళగలిగినవారు వారు ప్రేమించే బంధువుల, స్నేహితుల దేహాలలోకి ఎందుకు తిరిగిరారు?
- వేదాల కర్తలు ముగ్గురు. వారే విదూషకులు, దొంగలు, రాక్షసులు. పండితులుగా చెప్పుకొనే వీరు, వీరి నానా రకాల జర్ఫరి, తుర్ఫరి వంటి వాక్యాలతోనే వేదాలను నింపేశారు.
- అశ్వమేథ యాగం చేసేవాడు ధర్మపత్నిని త్యజించి తలను నరికివేయాలి. ఇవన్నీ విదూషకులు రచించారు. స్వర్గ నరకాది విషయాలు ధూర్తులు రచించారు. ఏయే శాస్త్రాల్లోనైతే మద్యమాంసాలు నైవేద్యంగా సమర్పించాలని రాయబడ్డాయో, వాటిని రాక్షసులు రచించారు. తమను తాము పండితులుగా చెప్పుకొనే వీరందరూ ఈ రచనలను తమ పొట్ట నింపుకోవటానికి చేశారు. చార్వాకుడు ఇటువంటి వారిని, వీరి రచనలనే ఖండించాడు. సర్వప్రాణులకు జ్ఞానుగ్రహాన్ని ప్ర్రాప్తింపజేసేందుకు కృషి చేసి ఈ మతాన్ని విస్తరింపజేశాడు. ఈ చార్వాక మతాన్నే అందరూ అనుసరించాలి. ఇదే అన్ని మతాలలోకెల్లా శ్రేష్ఠమైన మతము.
బౌద్ధ దర్శనం
మార్చు- వర్షం, ఎండలతో ఆత్మకు ఏమి పని ఉన్నది? వాటి ప్రభావం మనిషి యొక్క చర్మము పైన మాత్రమే ఉంటుంది. ఆత్మయే చర్మము వలె ఉన్నపుడు, వాటి ప్రభావం ఆశాశ్వతం. చర్మమే ఆత్మ వలె ఉన్నపుడు, దానిపై వాటి ప్రభావమనేదే ఉండదు.
ఆర్హత దర్శనం
మార్చు- మతపరమైన యాచకుడు, ప్రేమికుడు, శునకములచే ఒకే స్త్రీ శవంగా, కామాన్ని తీర్చెడిదిగా, మాంసపు ముద్దగా మూడు విధములుగా అర్థం చేసుకొనబడుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చుఇతర లింకులు
మార్చు
- సర్వదర్శన సంగ్రహం (దేవనాగరిలో)
- Sarva-darsana-sangraha of Madhavacharya
- The Project Gutenberg EBook of The Sarva-Darsana-Samgraha, by Madhava Acharya
- Vivarana Prameya Sangrah by Vidyaranya Swami (Sanskrit Text with Hindi Translation) at archive.org
- Sarva-Darsana-Samgraha by Madhavacharya (Vidyaranya Swami) - tr by E.B.Cowell (1882) at archive.org