సర్వేశ్వర్ సహారియా
సర్వేశ్వర్ సహారియా భారతీయ నెఫ్రాలజిస్టు, అవయవ మార్పిడి నిపుణుడు.[1] మూత్రపిండాల, ప్యాంక్రియాటిక్ మార్పిడిలో నిపుణునిగా గుర్తింపబడ్డాడు.[2] వైద్య రంగంలో అతని సేవలకు గుర్తింపుగా 2014 లో భారత ప్రభుత్వం నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన "పద్మశ్రీ" ని ప్రదానం చేసి సత్కరించింది.[3] అతనికి 3000 కి పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసిన ఘనత ఉంది.[4] చాలామంది అతనిని దేశంలోని మూత్రపిండ మార్పిడి సర్జన్ గా గుర్తిస్తారు.[2][4]
సర్వేశ్వర్ సహారియా | |
---|---|
జననం | మంగళదాయ్, దర్రాంగ్, అస్సాం, భారతదేశం | 1945 ఏప్రిల్ 1
వృత్తి | భారతీయ నెఫ్రాలజిస్టు |
పురస్కారాలు | పద్మశ్రీ బ్రహ్మయ్య శాస్త్రి మెమోరియల్ ఓరాషన్ అవార్డు డా.ఆర్.వి.ఎస్.యాదవ్ మెమోరియల్ ఓరేషన్ అవార్డు నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో సభ్యుడు ఇంటర్నేషనల్ కాలేజి ఆఫ్ సర్జన్స్ లో ఫెలోషిప్ అమెరికన్ కాలేజి ఆఫ్ ఫెలోషిప్ - ఫెలోషిప్ |
జీవిత విశేషాలు
మార్చుసర్వేశ్వర్ సహారియా అస్సాంలోని హిమాలయ రాష్ట్రానికి చెందిన దర్రాంగ్ జిల్లాలో గల కొండ గ్రామమైన మంగల్‌డై[5] లోని స్వల్ప ఆర్థిక వనరులతో కూడిన కుటుంబంలో 1945 ఏప్రిల్ 1న జన్మించాడు. అతను తన ప్రారంభ విద్యను స్థానిక పాఠశాలలో చేశాడు[6] [5][7] 1962 లో మంగల్‌డై లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఉన్నత మాధ్యమిక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాడు. జీవశాస్త్రంలో రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించాడు. వైద్య వృత్తిని ఎంచుకున్న అతను గౌహతిలోని మెడికల్ కాలేజీలో చేరాడు.[5] రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సహాయంతో[5] గౌహతి విశ్వవిద్యాలయం నుండి 1967 లో ఎం,బి.బి.ఎస్ ఉత్తీర్ణత సాధించి పరీక్షలలో మొత్తం నాలుగో స్థానంలో నిలిచాడు. తదనంతరం, అతను 1970 లో న్యూ ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో తప్పనిసరి కోర్సు అయిన హౌస్ సర్జెన్సీ చేశాడు. తరువాత అతను చండీగర్ వెళ్లి చండీగర్ లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పిజిఐఎంఆర్) లో వైద్యునిగా పనిచేశాడు. మాస్టర్స్ డిగ్రీ చదివేటప్పుడు 1973 లో MS చేసి కాంస్య పతకంపొందాడు.[5] 1976 లో సీనియర్ రెసిడెన్సీని పూర్తి చేయడానికి అక్కడ కొనసాగాడు. PGIMER లో ఉన్నప్పుడు 1973 లో మొదటి విజయవంతమైన మూత్రపిండ మార్పిడిలో పాల్గొనే అవకాశం అతనికి లభించింది.
సహారాయ 1976 లో PGIMER మూత్రపిండ మార్పిడి విభాగంలో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ప్రోగ్రాం కింద పూల్ ఆఫీసర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. తరువాత, 1978 లో అతను PGIMER అధ్యాపక బృందంలో చేరాడు. 1981 వరకు అక్కడ పనిచేశాడు. తదుపరి 1981లో అతను హైదరాబాదులోని అవయవ మర్పిడి కేంద్రమైన ఇనిస్టిట్యూట్ ఆఫ్ జెనెటిక్స్ అండ్ హాస్పిటల్ ఫర్ జెనెటిక్ డిసీజెస్ లో చేరాడు.[8] అక్కడ సెంటర్ హెడ్‌గా రీడర్, చీఫ్ మూత్రపిండ మార్పిడి సర్జన్‌గా కొనసాగాడు.[9] అక్కడ 1985 వరకు పనిచేసాడు.[10] అతను 1981లో మొదటి మూత్రపిండ మార్పిడిని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్‌లో చేశాడు.[10] సహారియా 1985 లో ప్రభుత్వ సేవకు రాజీనామా చేశాడు. అప్పటి నుండి దేశంలోని వివిధ ఆసుపత్రులలో ప్రాక్టీస్ చేస్తున్నారు.[11]
ప్రస్తుత భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని పశ్చిమ హైదరాబాద్‌లోని ఖరీదైన నివాస ప్రాంతమైన జూబ్లీ హిల్స్‌లో సహరియా నివసిస్తున్నాడు. అపోలో హాస్పిటల్, క్రిస్నాయ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, నగరంలోని గ్లోబల్ హాస్పిటల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ ఇనిస్టిట్యూట్‌లో తన విధులకు హాజరవుతున్నారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.[12] [13]
పరిశోధన
మార్చుఅవయవ మార్పిడిపై సహరియా పరిశోధనలు చేశాడు. ప్రొఫెసర్ కె. తనూజీ[14][15] ఆధ్వర్యంలో జపాన్‌లోని టోకై విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రయోగాత్మక మార్పిడి, ట్రాన్స్‌ప్లాంటేషన్ ఇమ్యునాలజీలో శిక్షణ పొందిన తరువాత, ఈ అంశంపై తన పరిశోధనలను కొనసాగించాడు. అతను 2009 లో అమెరికాలోని బోస్టన్‌లోని మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్‌లో జరిగిన అంతర్జాతీయ మార్పిడి పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఐలెట్ , సెగ్మెంటల్ ప్యాంక్రియాటిక్ మార్పిడిలో కొత్త పద్ధతులను అభివృద్ధి చేసిన ఘనత కూడా సహరియాకు దక్కింది. అతను తన ఫలితాలను అనేక పీర్ సమీక్షించిన పత్రికలలో ప్రచురించాడు.
పురస్కారాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-847333[permanent dead link]
- ↑ 2.0 2.1 "Assam Times". Assam Times. 4 March 2014. Retrieved October 3, 2014.
- ↑ "Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. January 25, 2014. Archived from the original on 2014-03-02. Retrieved 2020-05-21.
- ↑ 4.0 4.1 "Assam Tribune". Assam Tribune. 22 March 2014. Archived from the original on 3 మార్చి 2016. Retrieved October 3, 2014.
- ↑ 5.0 5.1 5.2 5.3 5.4 "Assam Tribune". Assam Tribune. 22 March 2014. Archived from the original on 3 మార్చి 2016. Retrieved October 3, 2014.
- ↑ "Assam Times". Assam Times. 4 March 2014. Retrieved October 3, 2014.
- ↑ "The New Indian Express". The New Indian Express. 26 January 2014. Archived from the original on 28 జనవరి 2014. Retrieved October 4, 2014.
- ↑ "IOG". IOG. 2012. Archived from the original on 2014-10-06. Retrieved 2020-05-21.
- ↑ "The New Indian Express". The New Indian Express. 26 January 2014. Archived from the original on 28 జనవరి 2014. Retrieved October 4, 2014.
- ↑ 10.0 10.1 "Assam Tribune". Assam Tribune. 22 March 2014. Archived from the original on 3 మార్చి 2016. Retrieved October 3, 2014.
- ↑ "Assam Times". Assam Times. 4 March 2014. Retrieved October 3, 2014.
- ↑ "Assam Tribune". Assam Tribune. 22 March 2014. Archived from the original on 3 మార్చి 2016. Retrieved October 3, 2014.
- ↑ "Health Aid India". Health Aid India. 2008–2009. Retrieved October 3, 2014.
- ↑ "Assam Tribune". Assam Tribune. 22 March 2014. Archived from the original on 3 మార్చి 2016. Retrieved October 3, 2014.
- ↑ "Health Aid India". Health Aid India. 2008–2009. Retrieved October 3, 2014.
- ↑ "Padma Awards Announced". Circular. Press Information Bureau, Government of India. January 25, 2014. Archived from the original on 2014-03-02. Retrieved 2020-05-21.
- ↑ "ISOT". ISOT. 2014. Retrieved October 3, 2014.
- ↑ "NAMS". NAMS. 2014. Archived from the original on 2020-05-21. Retrieved October 3, 2014.