సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్
సర్ జంషెడ్జీ జీజీభాయ్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ (సర్ జె. జె. స్కూల్ ఆఫ్ ఆర్ట్) ముంబై లోని కళలు నేర్పించే భారతదేశపు పురాతన విద్యాసంస్థ. ఇది ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ పాఠశాల పెయింటింగ్, సిరామిక్, మెటల్ వర్క్, ఇంటీరియర్ డెకరేషన్, టెక్స్టైల్ డిజైన్ , శిల్పాల విభాగాలలో బ్యాచులర్ డిగ్రీ (B.F.A)లను, అలాగే పోర్ట్రైచర్, క్రియేటివ్ పెయింటింగ్ లలో మాస్టర్స్ డిగ్రీ (M. F. A.) లను ప్రదానం చేస్తుంది.
రకం | Public art school |
---|---|
స్థాపితం | మార్చి 1857 |
అనుబంధ సంస్థ | University of Mumbai |
డీన్ | Vishwanath D. Sabale |
చిరునామ | 78, Dr. D. N. Road, Fort, Mumbai - 400 001 18°56′42″N 72°50′01″E / 18.94505°N 72.83352°E |
చరిత్ర
మార్చు1857 మార్చిలో స్థాపించబడిన ఈ పాఠశాలకు, దాని నిర్వహణ కోసం రూ. 100,000 విరాళం ఇచ్చిన వ్యాపారవేత్త, పరోపకారి అయిన సర్ జంషెడ్జీ జీజేభాయ్ పేరు పెట్టారు. ఈ సంస్థ కార్యకలాపాలను బొంబాయి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ఒక కమిటీ నిర్వహించింది. ఈ పాఠశాల 1857 మార్చి 2న ప్రారంభమైంది. మొదట ఎల్ఫిన్స్టోన్ ఇన్స్టిట్యూషన్లో తరగతులు జరిగాయి. జాన్ గ్రిఫిత్స్ 1865లో పాఠశాలకు ప్రిన్సిపాల్ అయ్యాడు. తరువాత అతను అజంతా గుహల ఆలయ సముదాయంలో కుడ్యచిత్రాలను కాపీ చేయడంలో ప్రసిద్ధి చెందాడు. ఈ ప్రాజెక్ట్ 1872 నుండి 1891 వరకు కొనసాగింది. దీనికి పాఠశాల విద్యార్థులు తోడ్పడ్డారు.[1]
1866లో, పాఠశాల నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వం స్వీకరించింది. 1866లో స్కూల్ ప్రొఫెసర్ అయిన లాక్వుడ్ కిప్లింగ్, (1) డెకరేటివ్ పెయింటింగ్స్, (2 మోడలింగ్ (3) అలంకార చేత ఇనుప పని కోసం మూడు చిత్రశాలలను స్థాపించి, దాని మొదటి డీన్ అయ్యాడు. అతను పాఠశాల ప్రాంగణంలో జన్మించిన రచయిత రుడ్యార్డ్ కిప్లింగ్ తండ్రి. 1878లో, పాఠశాల దాని స్వంత భవనానికి మారింది, ప్రస్తుతం ఇది ఇక్కడే ఉంది. ఈ భవనాన్ని నియో గోతిక్ నిర్మాణశైలిలో వాస్తుశిల్పి జార్జ్ ట్విగ్జ్ మోలేసీ రూపొందించాడు . డీన్ బంగ్లా అని పిలువబడే కిప్లింగ్ ఇంటితో సహా పాఠశాల ప్రాంగణాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ద్వితీయశ్రేణి వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది. 2008లో వీటి పునరుద్ధరణ చేయబడింది. డ్రాయింగ్ బోధనను ఒక అంశంగా 1879లో ప్రవేశపెట్టారు . డ్రాయింగ్ ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని 1893లో ప్రారంభించారు. 1891లో, లార్డ్ రే ఆర్ట్ వర్క్‌షాపులు(ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్ట్-క్రాఫ్ట్స్ అని పిలుస్తారు) స్థాపించబడ్డాయి. ఈ పాఠశాల వాస్తువిద్యలో ముఖ్యమైన సంప్రదాయాన్ని కలిగి ఉంది. 1900లో, ఈ పాఠశాల వాస్తు శాస్త్రంలో మొదటి కోర్సును అందించింది, తరువాత బొంబాయి, భారత ప్రభుత్వాల కన్సల్టింగ్ ఆర్కిటెక్ట్ జాన్ బెగ్ చేత బోధించబడింది. 1908లో బెగ్ సహాయకుడు జార్జ్ విట్టెట్ ఆధ్వర్యంలో పూర్తి 4 సంవత్సరాల కోర్సు స్థాపించబడింది. 1917లో, ఆర్కిటెక్ట్ క్లాడ్ బాట్లీ విజిటింగ్ ప్రొఫెసర్ అయ్యాడు, అతను 1923 నుండి 1943 వరకు పాఠశాలకు ప్రిన్సిపాల్‌గా ఉన్నాడు. 1996లో ఇతని జ్ఞాపకార్థం క్లాడ్ బాటిలీ ఆర్కిటెక్చరల్ గ్యాలరీ ప్రారంభమయ్యింది. 1896లో, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కేంద్రకమైన డ్రాఫ్ట్స్మన్ తరగతులు చేర్చబడ్డాయి. ఈ విభాగం తరువాత 3 సంవత్సరాల డిప్లొమా కోర్సు నిర్వహిస్తున్నది, 1910లో చేతిపనుల యొక్క అధునాతన అధ్యయనం కోసం సర్ జార్జ్ క్లార్క్ స్టడీస్ అండ్ లాబొరేటరీస్‌ను నిర్మించారు. అధ్యయనం కోసం చేపట్టిన మొదటి హస్తకళ మట్టి కుండలు. 1929లో, పాఠశాల అధిపతికి "డైరెక్టర్" అని పేరు మార్చారు, 1935లో వాణిజ్య కళ విభాగం కూడా ప్రారంభించబడింది. 1937లో ఎం. ఆర్. ఆచరేకర్ డిప్యూటీ డైరెక్టర్గా నియమించబడ్డాడు. 1939 వరకు ఇతని పదవీకాలాన్ని కొనసాగించారు. 1943లో క్లాడ్ బాట్లీ తరువాత డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వి. ఎస్. అడుర్కర్ ఈ పాఠశాలకు మొదటి భారతీయ అధిపతి.
1958లో, సర్ జె. జె. కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సర్ జె. జే. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ ఆని ఈ పాఠశాల రెండుగా విభజించబడింది. 1981లో ఈ పాఠశాల ముంబై విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మారింది.
పూర్వ విద్యార్థుల జాబితా
మార్చు- అంబికా ధురంధర్(1912-2009)
- హొమాయ్ వ్యరవాలా (1913-2012)
- జ్యోత్స్నా భట్ (1940–2020)
- భోలేకర్ శ్రీహరి (1941–2018)
- పాకాల తిరుమల్ రెడ్డి (1915–1996)
- లలితా లాజ్మీ (1932-2023)
- ఎస్.హెచ్.రజా (1922-2016)
- శివ శక్తి దత్త (జ.1932)
- గౌతమ్ వాఘేలా (1936-2010)
- వినాయక్ పాండురంగ్ కర్మార్కర్ (1891-1967)
మూలాలు
మార్చు- ↑ Art heritage, saved by sunshine law
Indian Express, 2 March 2007. "...when the Public Works Department took up repainting of the building, the paintings had been shifted to the terrace and may have been washed out after the 26/7 deluge two years ago.(2005)"This article or section is not displaying correctly in one or more Web browsers. (February 2023)
బాహ్య లింకులు
మార్చు- అధికారిక వెబ్‌సైటు
- Nandagaonkar, Satish (9 February 1005). "Sir J.J. School of Art, Mumbai". The Telegraph (Calcutta). Archived from the original on 13 September 2006.