హొమాయ్ వ్యరవాలా
హొమాయ్ వ్యరవాలా (9 డిసెంబరు 1913 – 15 జనవరి 2012), భారతదేశ మొట్టమొదటి ఫోటో విలేఖరి. ఆమె డాల్డా 13 అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. 1930లలో ఆమె క్రియాశీలకంగా పనిచేసేది. 1970వ దశకంలో ఉద్యోగవిరమణ చేసింది ఆమె. 2011లో హొమాయ్ ను భారత ప్రభుత్వం, దేశంలోని రెండో అతి పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారంతో గౌరవించింది.[1]
తొలినాళ్ళ జీవితం, విద్యాభ్యాసం
మార్చుడిసెంబరు 9, 1913న[2][3][4] గుజరాత్ లోని వ్యరవాలా, నవసరీలో పార్సీ కుటుంబంలో జన్మించింది హొమాయ్. సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్ లోనూ, ముంబయి విశ్వవిద్యాలయం లలో చదువుకుంది.[5]
వ్యక్తిగత జీవితం
మార్చుగాంధేయవాది అయిన హొమాయ్, తన జీవితంలో గాంధీ మార్గాన్ని అనుసరించింది. ఆమె జీవితాంతం అతి సాధారణంగా బ్రతికింది.[6]
వృత్తి
మార్చు1930లో వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఈమె, 1942లో ముంబైకు మారిన తరువాత జాతీయ స్థాయి గుర్తింపు లభించడంతో వృత్తిలో మార్పు వచ్చింది. ఆ తర్వాత ఈమె తన మకామును ఢిల్లీకి మార్చింది. అక్కడ 30యేళ్లకు పైగా నివసించింది. ఈమె ప్రెస్ ఫోటోగ్రాఫర్‌గా గాంధీ,నెహ్రూ, జిన్నా, ఇందిరాగాంధీ, నెహ్రూ - గాంధీ కుటుంబాల ఫోటోలను తీసింది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈమె ముంబాయి నుండి వెలువడే ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో 1970 వరకు పనిచేసింది. ఆ సమయంలో ఈమె తీసిన పలు నలుపు తెలుపు ఛాయాచిత్రాలు తరువాతి కాలంలో ప్రతిరూపాలుగా నిలిచిపోయాయి. ఈమె 1973లో తన భర్త మరణానంతరం వడోదరలో స్థిరపడింది. తరువాత తన ఛాయాచిత్రాల సేకరణను ఈమె ఢిల్లీలోని అల్కాజీ ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ అనే సంస్థకు ఇచ్చివేసింది. ఈమె 104 జయంతి సందర్భంగా గూగుల్ ఒక డూడుల్ ద్వారా నివాళిని అర్పించింది. " First Lady of the Lens" అనే శీర్షికతో ఉన్న ఈ డూడుల్ మధ్యభాగంలో "హొమాయ్" చిత్రం ఉంది[7].
మరణం
మార్చుఈమె ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ తన 98వ యేట 2012, జనవరి 15న వడోదరలో మరణించింది[8].
మూలాలు
మార్చు- ↑ "An iconic observer – The curious life and times of Homai Vyarawalla". The Telegraph. 23 January 2011.
- ↑ "Magazine / Personality : India through her eyes". The Hindu. 12 March 2006. Archived from the original on 18 జనవరి 2012. Retrieved 16 January 2012.
- ↑ "The Times of India on Mobile". M.timesofindia.com. 9 December 1913. Retrieved 16 January 2012.
- ↑ "Photojournalism: Arthur Fellig (Weegee) and Homai Vyarawalla". Mendeley. 9 December 1913. Retrieved 16 January 2012.[permanent dead link]
- ↑ "Homai gets Padma Vibhushan". The Times of India. 25 January 2011. Archived from the original on 2011-08-11. Retrieved 2017-03-14.
- ↑ "Meet India's first lady photographer Homai Vyarawalla". Rediff.com. 3 March 2011.
- ↑ Who is Homai Vyarawalla featured in today's Google Doodle?
- ↑ India's first woman photojournalist dead