భోలేకర్ శ్రీహరి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి, ప్రింట్‌మేకర్.

శ్రీహరి భోలేకర్ (1941, జనవరి 1 - 2018 ఆగస్టు 23) తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు, శిల్పి, ప్రింట్‌మేకర్. గ్రామీణ జీవితాన్ని ఆధునిక శైలిలో తన చిత్రాలను గీశాడు. అతని చిత్రాలలో తెలంగాణ జీవితం, సంస్కృతి, ఆచారాలు, సంప్రదాయాలు మొదలైనవి ప్రతిబింబిస్తాయి.[1] [2]

భోలేకర్ శ్రీహరి
భోలేకర్ శ్రీహరి (2014)
బాల్య నామంశ్రీహరి బొల్లాక్‌పల్లె
జననం(1941-01-01)1941 జనవరి 1
బొల్లాక్‌పల్లె, పిట్లం మండలం, కామారెడ్డి జిల్లా, తెలంగాణ
మరణం2018 ఆగస్టు 23(2018-08-23) (వయసు 77)
హైదరాబాదు, తెలంగాణ
భార్య / భర్తలక్ష్మీ భోలేకర్
జాతీయతభారతీయుడు
రంగంచిత్రలేఖనం, శిల్పం, ప్రింట్‌మేకింగ్
ఉద్యమం1969
అవార్డులుజాతీయ అకాడమీ (లలిత కళా అకాడమీ)

జననం, విద్యాభ్యాసం

మార్చు

శ్రీహరి 1941, జనవరి 1న తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా, పిట్లం మండలంలోని బొల్లాక్‌పల్లె గ్రామంలో జన్మించాడు. 1961లో ముంబైలోని సర్ జెజె స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డ్రాయింగ్, పెయింటింగ్‌లో డిప్లొమా పొందాడు. 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బిఏ పట్టభద్రుడయ్యాడు. రాష్ట్ర- జాతీయస్థాయిలో ఎగ్జిబిషన్స్ నిర్వహించిన శ్రీహరి, అనేక అవార్డులను గెలుచుకున్నాడు.

కళారంగం

మార్చు

పోర్చుగల్, ఇటలీ, మాసిడోనియా, పోలాండ్, జర్మనీ, న్యూఢిల్లీ, చండీగఢ్, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, చెన్నై, భోపాల్, అహ్మదాబాద్, లక్నో, అమృత్‌సర్, రాయ్‌పూర్, బరోడా మొదలైన ప్రాంతాలలో అనేక ప్రదర్శనల్లో తన చిత్రాలను, శిల్పాలను ప్రదర్శించాడు.[3]

అవార్డులు

మార్చు
  • 2004 జాతీయ అవార్డు - భారత ప్రభుత్వం - లలిత కళా అకాడమీ[4]
  • 2005-07 సీనియర్ ఫెలోషిప్ విజువల్ ఆర్ట్ గ్రాఫిక్స్, భారత ప్రభుత్వం, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, న్యూఢిల్లీ
  • 2003 భారతదేశపు వెటరన్ ఆర్టిస్ట్‌ గౌరవం, న్యూఢిల్లీ
  • 1996 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ద్వారా ప్రశంస
  • 1988 గోల్డ్ మెడల్ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్, మహా కోశల్ కళా పరిషత్, రాయ్‌పూర్[5]
  • 1988 మహారాష్ట్ర మండల్ చే హైదరాబాదు కళాకారుడిగా సత్కారం
  • 1977 ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ హైదరాబాదు ఆర్ట్ సొసైటీ నుండి గోల్డ్ మెడల్.

ప్రదర్శనలు

మార్చు

సోలో ప్రదర్శనలు

  1. 2000: ముంబైలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ఒక ప్రదర్శన.
  2. 1977: అలయన్స్ ఫ్రాంచైజ్, బెంగుళూరు ద్వారా నిర్వహించబడిన గ్రాఫిక్స్ ప్రింట్స్ ఎగ్జిబిషన్
  3. 1973: హైదరాబాదు కళా భవన్‌లో కుడ్య చిత్రాలు
  4. 1968: హైదరాబాదు కళా భవన్‌లో పెయింటింగ్స్ ప్రదర్శన
  5. 1966: హైదరాబాదు ఆర్ట్ సొసైటీ
  6. 1965: రవీంద్ర భారతి
  7. 1964: అజంతా పెవిలియన్ పబ్లిక్ గార్డెన్స్, హైదరాబాదు

సమూహ ప్రదర్శనలు

  1. 1966, 1969, 1978, 1985, 1986, 2004 నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఆర్ట్, లలిత అకాడమీ (పెయింటింగ్, స్కల్ప్చర్ & గ్రాఫిక్స్), న్యూఢిల్లీ
  2. 1974, 1976, 1985, 2004 అకాడమీ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, కోల్‌కతా
  3. 1985 ఆర్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, ముంబై
  4. కర్ణాటక చిత్రకళా పరిషత్, బెంగళూరు
  5. బాంబే ఆర్ట్ సొసైటీ, ముంబై

శ్రీహరి 2018 ఆగస్టు 23న మరణించాడు.[6][7]

మూలాలు

మార్చు
  1. "SubContinentArt – Artist Profile". Subcontinentart.com. Archived from the original on 18 ఫిబ్రవరి 2020. Retrieved 25 January 2022.
  2. Peter Klingebiel. "Bholekar Srihari – Kunststation Kleinsassen". Kleinsassen.de. Retrieved 25 January 2022.
  3. "Profile of an artist". Archived from the original on 2018-09-20. Retrieved 2022-01-25.
  4. "తెలిసీ తెలియని, చూసీ చూడని రూపాలు". Telangana Monthly.
  5. "welcome to ART GALLERY". www.subcontinentart.com. Retrieved 25 January 2022.[permanent dead link]
  6. "A great loss to art world". Deccan Chronicle.
  7. "శ్రీహరి ఇకలేరు కానీ..." Navatelangana a Telugu Daily. Archived from the original on 2022-01-25. Retrieved 2022-01-25.

బయటి లింకులు

మార్చు