సల్మాన్ రష్దీ (Salman Rushdie) భారతీయ సంతతికి చెందిన బ్రిటీషు నవలా రచయిత, వ్యాసకర్త. 1981లో తన రెండవ నవల మిడ్‌నైట్ చిల్డ్రన్ (Midnight Children) (1981) బుకర్ ప్రైజు గెలవడంతో తొలిసారిగా వార్తల్లోకెక్కాడు. ఈయన ప్రారంభంలో వ్రాసిన కాల్పనిక సాహిత్యమంతా భారత ఉపఖండము నేపథ్యముగా రచించబడినది. ఈయన శైలిని చారిత్రక కాల్పనికతతో మిళితమైన మాజిక్ రియలిజంగా వర్గీకరిస్తూ ఉంటారు. ఈయన నాలుగవ నవల "శటానిక్ వర్సెస్" (సైతాను వచనాలు) సంచలనాత్మక, వివాదాస్పద నవల. ఇది అనేక దేశాలలో నిషేధించబడింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ముస్లింలు దీనికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. అందుకు అతను చావు బెదిరింపులు కూడా ఎదుర్కొన్నాడు. ముంబైలో జన్మించిన ఇతడు, ప్రస్తుతం ఇంగ్లాండు పౌరసత్వం తీసుకున్నాడు. ఖురాన్ లో చేర్చడానికి నిరాకరించిన కొన్ని వచనాలలో ముగ్గురు ఆడ దేవతలని పూజించడానికి అనుమతిస్తున్నట్టు వ్రాసి ఉంది. ఈ దేవతల పేర్లు అల్లాత్, ఉజ్జా, మనాత్. ముస్లింలు నిరాకరించిన ప్రవచనాలని బయట పెట్టినందుకు అతన్ని హత్య చెయ్యాలని ఫత్వా జారీ చెయ్యడం జరిగింది. ముస్లింలు ఏకేశ్వరోపాసకులు. వారు అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నమ్ముతారు. అష్ హదు అన్ లా ఇలహ ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం. బైబిల్ లో తొక్కి పెట్టబడిన గ్రంథములు (Apocryphal books) ఉన్నట్టే ఖురాన్ లో కూడా నిరాకరించిన ప్రవచనాలున్నాయని పూర్వపు ముస్లిం చరిత్ర కారులు వ్రాసిన నిజాల్ని నేటి ముస్లిం పండితులు నమ్మడం లేదు. అందుకే సల్మాన్ రష్దీ వ్రాసిన "ధి శటానిక్ వర్సెస్" నవల చాలా ఇస్లామిక్ దేశాలలో నిషేదించబడినది.

సల్మాన్ రష్దీ

2008 సెప్టెంబరులో అమోస్ ఓజ్ స్మృత్యర్ధం ఏర్పాటు చేసిన ఫలహారవిందు సందర్భంగా
జననం: 19 జూన్ 1947
వృత్తి: నవలా రచయిత, వ్యాసకర్త
జాతీయత:యునైటెడ్ కింగ్‌డమ్
Subjects:విమర్శ, యాత్రా సాహిత్యం
ప్రభావాలు:గ్యుంటర్ గ్రాస్, గాబ్రియేల్ గార్సియా మార్కీజ్, ఇటాలో కాల్వినో, వ్లాడిమిర్ నబకోవ్, జేమ్స్ జాయిస్, హోర్జె లూయిస్ బోర్హెస్, థామస్ పించోన్, మిఖాయిల్ బుల్గకోవ్, ఫ్రాంజ్ కాఫ్కా

వ్యక్తిగతం మార్చు

74 ఏళ్లవయసు.నాలుగు పెళ్లిళ్లు చేసుకొని భార్యలకు విడాకులు ఇచ్చిన రష్దీ తాజాగా పియా గ్లెన్ అనే కొత్త ప్రియురాలితో ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు.

న్యూయార్క్‌ లో దాడి మార్చు

న్యూయార్క్‌లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇన్‌స్టిట్యూట్‌లో సమావేశానికి సల్మాన్‌ రష్దీ 2022 ఆగస్టు 12న హాజరయ్యాడు. ఆయన ప్రసంగానికి సిద్ధమవుతున్న సమయంలో స్టేజిపైకి దూసుకొచ్చిన ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆయనను ఆసుపత్రికి తరలించారు.[1]

మూలాలు మార్చు

  1. "Salman Rushdie: ఎవరీ హాది మతార్‌.. సల్మాన్‌ రష్దీపై ఎందుకు దాడికి పాల్పడ్డాడు..?". web.archive.org. 2022-08-13. Archived from the original on 2022-08-13. Retrieved 2022-08-13.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)