ఫత్వా (ఆంగ్లం : fatwā (అరబ్బీ భాష :فتوى) ; (బహువచనం fatāwā అరబ్బీ భాష : فتاوى), ఇస్లామీయ విశ్వాసాల ప్రకారం, ధార్మిక పరంగా, షరియా ఉద్దేశం, దీనిని ఉలేమాలు నిర్ణయించి ప్రకటిస్తారు.ఫత్వాలు జారీ చేసే వారిని ముఫ్తీలు అని అంటారు.

మంచికోసం మనుషులు కదులుతారు కానీ అభివృధ్ధిని అడ్డుకునే పనులను అమాయకంగా ఎంతోకాలం మోయలేరు.నారుపోసినవాడే నీరు పోస్తాడనే ముల్లాల మాట పెడచెవిన పెట్టి మా బిడ్డల బరువు మేమే మోసుకోకతప్పదనే సత్యాన్ని గ్రహించి ముస్లిములు ఈనాడు కుటుంబనియంత్రణ ఆపరేషన్లు భారీగా చేయించుకుంటున్నారు.భవిష్యత్తులో అభివృధ్ధివాదం, మానవతావాదం మతాల్లో ఇంకా ఇంకా పెరిగితీరుతుంది.ఇస్లాంలోదర్గాలు, ఉరుసులు, సంగీతం, కవిత్వం, నాట్యం, నటన, చిత్రలేఖనం, సారాయి, వ్యభిచారం, వడ్డీ, మాఫియా, రాచరికం, నియంతృత్వం, ఫోన్ లో పెళ్ళిళ్ళు, ఫోన్ లో విడాకులు ...లాంటివన్నీ నిషిద్ధమని మతపెద్దలు ఎంతగా చెప్పినా ఫత్వాలు ఇచ్చినా వినకుండా ఆయా నిషిద్ధ రంగాలలో లక్షలాది ముస్లింలు పాతుకుపోయారు.భారతరత్నలు కూడా అయ్యారు.అన్నిరకాల జనాన్ని మతం కలుపుకుపోక తప్పదు.ప్రజల సుఖ శాంతుల కోసం మతంలో నిరంతరం సంస్కరణలు జరుగుతూనే ఉండాలి.ఫత్వాలు నన్ను ప్రభావితం చేయలేవు, నాకు కూడా బీమా పాలసీలున్నాయి అన్నారు కేంద్ర మైనార్టీ వ్యవహారాలశాఖ మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌.

నిరసనలు ఎదుర్కొన్నఫత్వాలు మార్చు

  • బ్యాంకుల్లో పనిచేయడం ఇస్లాంకు వ్యతిరేకం.
  • వడ్డీ, జూదం ఆధారంగా రూపొందినందువల్ల బీమా పాలసీలు ఇస్లాంకు వ్యతిరేకం.
  • ముస్లిం మహిళలు న్యాయమూర్తి పదవి చేపట్టడం నిషిద్ధం.
  • పెళ్ళికి ముందే వీధుల్లో షికార్లు చేసిన ఒక ప్రేమ జంట పెళ్ళికి వెళ్ళొద్దు.
  • వందేమాతరం గీతంలోని కొన్ని పంక్తులు ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఆ పాటను ముస్లింలు పాడకూడదు. (జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్)

మంచి ఫత్వాలు మార్చు

  • ఇస్లాం దృష్టిలోఉగ్రవాదం (హరామ్ ) నిషిద్ధం.ఇస్లాం మానవత్వానికి కట్టుబడి ఉంది. (జమీయతుల్ ఉలమాయె హింద్ దేవబంద్)
  • కర్ఫ్యూ సమయంలో ముస్లింలు ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలి.

ఇవీ చూడండి మార్చు

బయటి లింకులు మార్చు

ఫత్వా వెబ్-సైట్లు మార్చు

మూలాలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఫత్వా&oldid=3879606" నుండి వెలికితీశారు