సవాయి గంధర్వ : రాంభావు కుందగోల్కర్ అతని అసలు పేరు; (సెప్టెంబరు 12 , 1886 - 1952) ; ప్రఖ్యాత హిందుస్తానీ గాయకుడు, అబ్దుల్ కరీంఖాన్ శిష్యుడు; కిరాణా ఘరానాకు ఎంతో పేరు ప్రతిష్టలు తెచ్చినవాడు.

సవాయి గంధర్వ

జీవితం మార్చు

సవాయి గంధర్వ కర్ణాటక రాష్ట్రంలోని, ధార్వాడ్ వద్ద కుందగోల్ లో సాధారణ దేశస్థ బ్రాహ్మణ జన్మించాడు. అబ్దుల్ కరీంఖాన్ వద్ద శాస్త్రీయ సంగీతం నేర్చుకొన్నాడు.

సంగీత ప్రస్థానం మార్చు

శిక్షణ తర్వాత సవాయి గంధర్వ, మరాఠీ డ్రామా కంపనీలో చేరి, గొప్ప గాయకుడుగా పేరు తెచ్చుకొన్నాడు. శివరాజ్ నాటక మండలిలో గోవిందరావు టెంబె తో కలిసి కొంతకాలం పనిచేసాడు. స్వతహా గొప్ప గాయకుడే కాక, కిరాణా ఘరానా సాంప్రదాయాల్నిముందుకు నడిపించిన గంగూబాయి హంగల్, భీమ్ సేన్ జోషి, ఫిరోజ్ దస్తూర్ వంటి వారలకు శిక్షణ నిచ్చాడు. భీంసేన్ జోషి, ప్రతి యేటా తన గురువు జ్ఞాపకార్థం, పుణె లో సవాయి గంధర్వ సంగీత మహోత్సవం జరిపిస్తాడు. ఈ సంగీత మహోత్సవాల్లో పాల్గొనడం అంటే, చాలా "గొప్ప" గా భావిస్తారు, అటు సంగీత కళాకారులు, ఇటు శ్రోతలు.

వనరులు మార్చు

  • [1]భీమ్‌సేన్ జోషి ,సవాయి గంధర్వల గురించి
  • [2]భీమ్‌సేన్ జోషి ,సవాయి గంధర్వల గురించి
  • [3] Archived 2009-03-23 at the Wayback Machine సవాయి గంధర్వ సంగీత మహోత్సవం-వీడియో సీడీలు

బయటి లింకులు మార్చు

1. [4] సవాయి గంధర్వ గురించి