అబ్దుల్ కరీంఖాన్

అబ్దుల్ కరీంఖాన్ లేదా ఉస్తాద్ అబ్దుల్ కరీంఖాన్ (నవంబరు 11, 1872 - 1937), 20 వ శతాబ్దపు హిందుస్తానీ సంగీతంలోని కిరాణా ఘరానాకు చెందిన వారిలో ప్రముఖుడు.

Abdul Karim Khan
Abdul Karim Khan.jpg
వ్యక్తిగత సమాచారం
జననంNovember 11, 1872
మూలంKairana, Uttar Pradesh
మరణంOctober 27, 1937
సంగీత శైలిIndian classical music
వృత్తిsinger
క్రియాశీల కాలం??

జీవితంసవరించు

అబ్దుల్ కరీంఖాన్ ఉత్తరభారతంలోని కిరాణా అనే ప్రాంతంలో జన్మించాడు. కిరాణా ఘరానాకు మూలపురుషులు, గులాం అలీ, గులాం మౌలా లు. కరీంఖాన్ తండ్రి, కాలే ఖాన్ గులాం అలీ మనవడు. కరీంఖాన్ తండ్రి వద్ద, మామ అబ్దుల్లా ఖాన్ వద్ద శిక్షణను పొందాడు. గాత్రం, సారంగి, వీణ, సితార్, తబలా - వీటన్నిటినీ నేర్చుకున్నాడు కరీంఖాన్.

సంగీత ప్రస్థానంసవరించు

మొదట్లో సారంగి వాయించినా, క్రమంగా గాత్రానికి మళ్ళాడు ; సోదరుడు అబ్దుల్ హక్తో కలిసి పాడేవాడు. బరోడా రాజు వారి గాత్ర సంగీతానికి ముగ్ధుడై, వారిని తన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించాడు. ఇక్కడే కరీంఖాన్ రాజవంశానికి చెందిన తారాబాయ్ మానెను పెళ్ళాడాలనుకున్నాడు. కాని బరోడా నుండి బహిష్కృతులై, ఆ దంపతులు ముంబై చేరుకున్నారు. 1922లో తారాబాయ్ మానే అబ్దుల్ కరీంఖాన్‌ను వదలి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన జీవితంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

మైసూరు దర్బారులో, గొప్ప కర్ణాటక సంగీత గాయకులను కలుసుకోవడం మూలాన, ఆ ప్రభావం ఆయన పాటల్లో కనిపించేది. 1900 లో ఆయన ప్రఖ్యాత గాయకుడు, సవాయి గంధర్వకు ఎనిమిది నెలలు సంగీతాన్ని నేర్పాడు. అక్కడే మరో ప్రసిద్ధి చెందిన సంగీత విద్వాంసురాలు, కేసర్‌బాయ్ కేర్కర్కు శిక్షణ నిచ్చాడు. 1913లో పుణెలో అబ్దుల్ కరీంఖాన్ ఆర్య సంగీత విద్యాలయాన్ని స్థాపించాడు. తరువాత మీరజ్లో స్థిరపడి, మరణించేంత వరకూ (1937) అక్కడే ఉన్నాడు.

కిరాణా ఘరానా శైలి రాగం, మంద్రస్థాయిలో మొదలయ్యి, విలంబిత్ లయలో మృదుమధురంగా సాగుతుంది. అబ్దుల్ కరీంఖాన్‌ ఠుమ్రీలు కూడా ప్రత్యేక శైలిని కలిగి వుంటాయి. ఆయన ఒక త్యాగరాజ కృతిని కూడా ఆలపించాడు.

అబ్దుల్ కరీంఖాన్‌ శిష్యుల్లో అగ్రగణ్యులుసవరించు

వనరులుసవరించు

బయటి లింకులుసవరించు