సహర్సా
బీహార్ రాష్ట్రం లోని పట్టణం
సహర్సా బీహార్ రాష్ట్ర తూర్పు భాగంలోని సహర్సా జిల్లా లోని పట్టణం. ఇది కోసి నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది సహర్సా జిల్లా ముఖ్యపట్టణం. కోసి డివిజన్ ప్రధాన కార్యాలయం. ఈ డివిజనులో సహర్సా, మాధేపురా, సుపాల్ జిల్లాలు భాగంగా ఉన్నాయి.
సహర్సా
సహర్సా | |
---|---|
పట్టణం | |
Saharsa | |
Coordinates: 25°53′N 86°36′E / 25.88°N 86.6°E | |
దేశం | India |
రాష్ట్రం | బీహార్ |
ప్రాంతం | మిథిల |
జిల్లా | సహర్సా |
విస్తీర్ణం | |
• Total | 21 కి.మీ2 (8 చ. మై) |
Elevation | 41 మీ (135 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,56,540 |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 852201-852154-852221-852127 |
టెలిఫోన్ కోడ్ | 916478 |
ISO 3166 code | IN-BR |
Vehicle registration | BR-19 |
భౌగోళికం
మార్చుసహర్సా 25°53′N 86°36′E / 25.88°N 86.6°E నిర్దేశాంకాల వద్ద, [1] సముద్ర మట్టం నుండి 41 మీటర్ల ఎత్తున ఉంది.ఈ పట్టణం కోసి పరీవాహక ప్రాంతంలో ఉంది. భూమి చాలా సారవంతమైనది. కాని గంగానది యొక్క అతిపెద్ద ఉపనదులలో ఒకటైన కోసి ప్రవాహ మార్గంలో తరచూ మార్పులు జరగడం వలన, [2] [3] నేల కోతకు గురైంది. ఈ ప్రాంతానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడానికి వరదలు ఒక ప్రధాన కారణం. వంతెనలు తరచూ కొట్టుకుపోతాయి. వరదలు దాదాపు ఏటా సంభవిస్తాయి. దీనివల్ల గణనీయమైన ప్రాణ, ఆస్తి నష్టాలు జరుగుతూంటాయి. [4]
పట్టణ ప్రముఖులు
మార్చు- మండన మిశ్రుడు మైథిల్ తత్వవేత్త, తత్వ వాదనలో ఆది శంకరాచార్యుల చేతిలో ఓడిపోయాడు.
- బిందేశ్వరి ప్రసాద్ మండల్, బీహార్ ముఖ్యమంత్రి
మూలాలు
మార్చు- ↑ Falling Rain Genomics, Inc – Saharsa
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-10-09. Retrieved 2021-01-21.
- ↑ "Archived copy". Archived from the original on 25 June 2007. Retrieved 2006-10-30.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Bihar Flood". Archived from the original on 2019-04-05. Retrieved 2021-01-21.