సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం (పొన్నూరు)

సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం గుంటూరు జిల్లా పొన్నూరు గ్రామంలో ఈ దేవాలయం ఉంది.

సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం is located in Andhra Pradesh
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం
ఆంధ్రప్రదేశ్ లో ఆలయ ఉనికి
భౌగోళికాంశాలు :16°17′20″N 80°15′46″E / 16.28889°N 80.26278°E / 16.28889; 80.26278
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:గుంటూరు
ప్రదేశం:పొన్నూరు
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:సహస్ర లింగేశ్వరస్వామి దేవాలయం

ఆలయ చరిత్ర మార్చు

ఈ ఆలయాన్ని జగద్గురు జగన్నాధస్వామి వారి ఆధ్వర్యంలో 1938లో ఈ ఆలయ శంకుస్థాపన జరిగింది.నిర్మాణాలు కొనసాగి 1955లో స్వామివారిని ప్రతిష్ఠించారు.అప్పటినుంచి ఈ ప్రాంతానికి భక్తులు విరివిగా రావడం ప్రారంభించారు.1958లో ఇక్కడ దశావతారాలను కూడా ప్రతిష్ఠించడం జరిగింది. దీనితో ఈ దేవాలయాలకు మరింత శోభ కలిగింది.[1]

ఆంజనేయస్వామి విగ్రహం మార్చు

ఈ ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహం ఉంది.1962నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ నిర్మాణం ఏడు సంవత్సరాల పాటు జరిగింది .1969 ఫిబ్రవరి నెలలో శ్రీఆంజనేయస్వామిని ప్రతిష్ఠించారు. ఈ ఆంజనేయస్వామి విగ్రహన్ని చిలకలూరి పేటకి దగ్గర్లోని యడ్లపాడులో చెక్కడం జరిగింది. ఈ విగ్రహం యొక్క ఎత్తు 20 అడుగులు.12 అడుగుల వెడల్పు ఉంటుంది.

శ్రీగరుత్మంతుని విగ్రహం మార్చు

ఈ ఆలయంలో శ్రీగరుత్మంతుని విగ్రహం ఉంది. ఈ విగ్రహాన్ని గుళ్లపాలెంలో చెక్కించారు ఈ విగ్రహం యొక్క ఎత్తు 30 అడుగులు, వెడల్పు 15 అడుగులు. ఈ రెండు విగ్రహలు ఈ క్షేత్రానికి ఒక విధమయిన ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

ఉత్సవాలు మార్చు

రవాణా సౌకర్యం మార్చు

ఈ ఆలయానికి రవాణా సౌకర్యం ఉంది.గుంటూరు నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మూలాలు మార్చు

  1. గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి దేవాలయాలు. ఎన్ ఎస్ నాగిరెడ్డి. 2004.