పొన్నూరు

ఆంధ్ర ప్రదేశ్, గుంటూరు జిల్లా, పున్నూరు మండలం లోని పట్టణం

పొన్నూరు, గుంటూరుకు 31 కి.మీ. దక్షిణాన ఉన్న ఒక చారిత్రక పట్టణం. పురపాలకసంఘం, మండల కేంద్రం కూడా. పిన్ కోడ్ నం. 522 124., ఎస్.టి.డి.కోడ్ = 08643.

 • పూర్వము పొన్నూరు స్వర్ణపురి (బంగారు భూమి) అని పిలవబడేది. తరువాత స్వర్ణపురి తమిళరాజుల పరిపాలనలోకి వెళ్ళింది. అప్పుడు ఈ ఊరిని, "పొన్నూరు" (పొన్ను+ఊరు) అని పిలవడం ప్రారంభించారు. తమిళంలో "పొన్ను" అంటే బంగారం అని అర్థం. పొన్ను+ఊరు, అంటే స్వర్ణపురి అని అర్థం వస్తుంది. కాలక్రమేణా ఇదే పేరు వాడుకలో అలాగే నిలిచిపోయింది. [1]
 • ఈ పట్టణం గుంటూరు, చీరాల రాష్ట్ర రహదారి పై ఉంది. చెన్నై-కోల్‌కతా రైలు మార్గం ఈ పట్టణం గుండా పోతుంది.
బస్టాండ్ సెంటర్
 • పొన్నూరు ఒక శాసనసభ నియోజకవర్గ కేంద్రము. గుంటూరు జిల్లా లోని ముఖ్య పురపాలక సంఘాలలో ఒకటి. నిడుబ్రోలు పొన్నూరును ఆనుకుని ఉన్న ఒక ప్రముఖ గ్రామం. ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒకే పట్టణం వలె అనిపిస్తాయి. రైల్వే స్టేషను నిడుబ్రోలు పేరిటే ఉంటుంది. అలాగే చుట్టుపక్కల ఉన్న ఎన్నో వ్యవసాయ ఆధారిత గ్రామాలకు పొన్నూరు కేంద్రంగా ఉంది.
 • పొన్నూరు పురపాలకసంఘం (మున్సిపాలిటీ) ఏర్పడి, 2014, సెప్టెంబరు-20 నాటికి 50 సంవత్సరములు పూర్తి అయినవి. ఈ సందర్భంగా 2014, అక్టోబరు-6,7,8 తేదీలలో, పురపాలక సంఘ స్వర్ణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. [2] & [3]
 • బస్టాండ్

పట్టణంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

 
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి దేవాలయ గాలి గోపురం
 
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి ఆలయ ప్రాకారం
 
మండపం, గాలి గోపురం భావన్నారాయణ స్వామి వారి
 
శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి వారి గాలి గోపురం

శ్రీ వినాయకస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలులో ఉంది.

శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి ఆలయంసవరించు

స్థానిక రెండవ వార్డులోని సిద్ధి వినాయకనగర్‌లో వేంచేసియున్న ఈ ఆలయంలోని స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవం, 2017, మార్చి-1వతేదీ బుధవారంనాడు వైభవంగా నిర్వహించారు. ఈ సదర్భంగా ఆలయంలో హోమాలతోపాటు ప్రత్యేకపూజలు నిర్వహించారు. [9]

శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఈ స్వామివారిని సాక్షిభావనారాయణుడని అంటారు. మరెక్కడాలేని బ్రహ్మ ఆలయము ఇక్కడ ఉంది.దీని ప్రథమ ధర్మకర్త రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు ఈఆలయం నిర్మించాడు.ప్రస్తుతం ఇందులో విగ్రహం లేదు.

పొన్నూరు సమీపంలోని నండూరు గ్రామస్థుడు కేశవయ్య మేనల్లుడు గోవిందుని వెంటబెట్టుకొని కాశీలోని శ్రీభావనారాయణుని దేవాలయంలో సంతాన ప్రాప్తికి భగవంతుని ప్రార్థించాడు. కూతురు కలిగితే తనకిచ్చిట్లయితే కేశవయ్యకు మారుగా తాను ప్రార్ధిస్తానని గోవిందు చెప్పిందానికి అతను ఓడంబడి ఇంటికి తిరిగి వచ్చాడు.తర్వాత తనకు కలిగిన అక్కలక్ష్మికి గూని ఉందని గోవిందుకు ఇవ్వటానికి కేశవయ్య నిరాకరించగా గోవిందు ప్రార్థనపై స్వామి కాశీనుంచి సాక్ష్య మివ్వటానికి అతనివెంట బయలుదేరి వచ్చాడు. పొన్నురువద్దకు వచ్చిన తరువాత స్వామి తనవెంట వస్తున్నదీ లేనిదీ అనుమానం వచ్చి వెనుతిరిగి చూడగా గోప్పీవనమనబడే ప్రస్తుత పొన్నూరులో శ్రీభావనారాయణస్వామి అంతర్ధాన మయ్యాడు.కేశవయ్య ఆకాశవాణి తెలియజేసిన మీదట తర్వాత తన కూతురును గోవిందుకు ఇచ్చి పెళ్ళి చేసాడు. సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినందున ఇప్పటికి సాక్షి భావనారాయణస్వామి అని పిలుస్తారు.ఆయనతోపాటు వచ్చిన కాశీ విశ్వనాధుడు, పేరులేని పెద్దమాను అనే రెండు చెట్లు, తుంగభద్ర అనే ఒక ఏరు ఇక్కడ చూపిస్తారు.

10వ శతాబ్దంలో అవుకు సీమాధిపతి శ్రీ నంద్యాల నారపరాజు అనే ఆయన తన రాచపుండు నివారణకు తీర్ధయాత్రలు చేస్తూ ఇక్కడకి వచ్చినప్పుడు, భావనారాయణస్వామి కలలో కనిపించి పుట్టలోఉన్న తన వెలికి తీసి పూజకు ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించినట్లు అందుమీదట శ్రీ నారపరాజు గర్భాలయాన్ని నిర్మించినాడని ఆయన రాచపుండు నయమయిందనీ చెబుతారు.

శ్రీ భావనారాయణస్వామి దేవస్థానం కార్యనిర్వణాధికారి ఫోన్ నం.08643/242021. ఈ దేవాలయం ఆద్వర్యంలో 6 వేల ఆధ్యాత్మిక, మతగ్రంధాలతో ఒక గ్రంథాలయం నడుస్తున్నది. 1920 నుండి ఉన్న సంస్కృత పాఠశాల 1950లో కళాశాలగా మార్చబడింది. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

ఈ ఆలయప్రాంగణమున ఉన్న ఇతర ఆలయాలుసవరించు

 1. శ్రీ రాజ్యలక్షీ అమ్మవారి ఆలయం.
 2. శ్రీ కాశీవిశ్వేశ్వరాలయము.
 3. శ్రీ విశాలాక్షి అమ్మవారి ఆలయం.

శ్రీ సహస్ర లింగేశ్వరస్వామి దేవస్థానంసవరించు

ఈ ఆలయం, 1961లో నిర్మితమైనది. 1961 లో నిర్మితమైన శ్రీ ఆంజనేయస్వామి, శ్రీ గరుత్మంతస్వామి ల విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈ విగ్రహాలు 30 అడుగుల ఎత్తు 24 అడుగుల ఎత్తుతో నయనానందకరముగా కనిపిస్తూ బహుళ ప్రసిద్ధికెక్కినవి.

 • దేవస్థానం ఫోన్ నం. 08643/247099.

ఈ ఆలయ ప్రాంగణంలో, వేంచేసియున్న శ్రీ మహావీర గరుత్మంతస్వామివారి పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు, 2017, జులై-24వతేదీ సోమవారం నుండి 28వ తేదీ శుక్రవారం వరకు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో మహా సంప్రోక్షణ, అభినవ విమాన శిఖర, జీవధ్వజ దండ, ఉత్సవ బింబ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాలు నిర్వహించెదరు. [15]

శ్రీ పద్మావతీ సమేత గోదాదేవి స్వర్ణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయం శ్రీ సహస్రలింగేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వైభవంగా నిర్వహించెదరు. [7]

శ్రీ కనకదుర్గ్గమ్మ అమ్మవారి ఆలయంసవరించు

ఈ ఆలయం పొన్నూరు పట్టణ శివారులో ఉంది.

శ్రీ తోటమ్మ తల్లి ఆలయంసవరించు

ఈ ఆలయంలో పట్టణంలోని జి.బి.సి.రహదారిపై ఉంది. ఈ ఆలయంలోని అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం, 2017, ఏప్రిల్-23వతేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. కనకతప్పెలు, మంగళ వాయిద్యాల మధ్య అమ్మవారి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారికి చీరె, సారె సమర్పించారు. తోటమ్మ తల్లి జాతర సందర్భంగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దేవాలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. [12]

శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంసవరించు

పొన్నూరు పట్టణంలోని సాయినగరులో ఉన్న ఈ ఆలయంలో, 2015, మే నెల-22వ తేదీ శుక్రవారంనాడు, ఈ ఆలయ 19వ వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించారు. [5]

శ్రీ జగన్నాధస్వామివారి ఆలయంసవరించు

ఈ ఆలయంలో జగన్నాధస్వామివారి 33వ జయంతి వేడుకలను 2015, ఆగష్టూ-16వ తేదీ ఆదివారంనాడు వైభవంగా నిర్వహించారు. [6]

శ్రీదేవీ భూదేవీ సమేత శ్రీ చెన్నకేశవస్వామివారి ఆలయంసవరించు

నిడుబ్రోలులో వేంచేసియున్న ఈ స్వామివారి ఆలయంలో, స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు, 2017, జూన్-6వతేదీ మంగళవారంనాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. ఏడవతేదీ బుధవారం తెల్లవారుఝామున, ఆలయంలోని స్వామివారి మూలవిరాట్టుకు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక మోమం చేసారు. సాయంత్రం నవగ్రహోమాంతోపాటు, మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు. 8వతేదీ గురువారంనాడు స్వామివారి రథోసవం ఘనంగా నిర్వహించారు. 9వతేదీ శుక్రవారంనాడు స్వామివారి కళ్యాణం, వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య కన్నులపండువగా నిర్వహించారు. రాత్రికి స్వామివారిని గజవాహనంపై పురవీధులలో ఊరేగించారు. ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు, 10వతేదీ శనివారంతో ముగిసినవి. ముగింపురోజున ప్రతిష్ఠా మూర్తులకు సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించారు. [13]

శ్రీకృష్ణ ఆలయంసవరించు

నిడుబ్రోలులోని రైల్వే స్టేషన్ సమీపంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, 2017, ఏప్రిల్-12వతేదీ బుధవారంనాడు, విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. మద్యాహ్నం, విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. [10]

శ్రీ చౌడీశ్వరీదేవి అలయంసవరించు

నిడుబ్రోలు.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయంసవరించు

నిడుబ్రోలు

శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం:సవరించు

పొన్నూరులో అబ్దుల్ కలాం రహదారిలో, భారత్ గ్యాస్ గోడౌన్ సమీపంలోని ఈ ఆలయంలో, అమ్మవారి వార్షిక తిరునాళ్ళ సందర్భంగా, 2017, ఏప్రిల్-17వతేదీ సోమవారంనాడు, ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో, సామూహిక కుంకుమార్చనలో పాల్గొన్నారు. అర్చకులు అమ్మవారికి సహస్రానామార్చనతో పూజలు చేసారు. 18వతేదీ మంగళవారం ఉదయం 11 గంటల నుండి, ఆలయ ప్రాంగణంలో శ్రీ లక్ష్మీ గణపతి సమేత శ్రీ పోలేరమ్మ తల్లి మహామంత్ర హోమం నిర్వహించెదరు. [11]

పట్టణ ప్రముఖులుసవరించు

రవాణా వివరాలుసవరించు

 1. పొన్నూరు పట్టణం తోపాటు మండలం కూడా మంచి రవాణా వ్యవస్థ కలిగిఉంది. పట్టణం గుంటూరు-బాపట్ల-చీరాల రాష్ట్ర రహదారిపై ఉండటం చేత దూర, సమీప ప్రాంతాలతో చక్కని సంధానం కలిగిఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యొక్క డిపో పొన్నూరు పట్టణంలో ఉండటంచేత పొన్నూరు, చుట్టుపక్కల గ్రామాలకు మంచి రవాణా వ్యవస్థ ఏర్పడింది.
 2. పొన్నూరు నుండి బయటకు వెళ్ళు రహదారులు :- గుంటూరు (31 కి.మీ.), విజయవాడ (60 కి.మీ.) : పచ్చలతాడిపర్రు గుండా; పెదనందిపాడు (25 కి.మీ.) : కసుకర్రు గుండా; రేపల్లె (26 కి.మీ.), తెనాలి (28 కి.మీ.) : నిడుబ్రోలు గుండా; బాపట్ల (19 కి.మీ.), చీరాల (34 కి.మీ.) : చింతలపూడి గుండా;
 3. చెన్నై-కోలకతా ప్రధాన రైలుమార్గం పట్టణం గుండా పోతుండడం వలన రైలు సౌకర్యం కూడా బాగా ఉంది.

మండల వివరాలుసవరించు

అత్యధిక భాగం గ్రామీణప్రాంతమైన ఈ మండలంలో పొన్నూరు పట్టణంలోని 25 వార్డులు కూడా కలిసిఉన్నాయి. మండలం మొత్తం జనాభాలో పట్టణప్రాంత జనాభా 87%. ఆర్థికవ్యవస్థ వ్యవసాయ ఆధారితము. పట్టణంలోని ముఖ్య ప్రాంతములు : పాత పొన్నూరు, గాజులపాలెం, షరాఫ్ బజార్, బ్రాహ్మణ బజార్, తెలగపాలెం, భావనగర్ కాలనీ, విద్యానగర్, నేతాజీనగర్, శ్రీనగర్ కాలనీ, వెంకటేశ్వర నగర్, అంబేద్కర్ కాలనీ, ఐలాండ్ సెంటర్. పట్టణంలో4 సినిమా థియేటర్లు ఉన్నాయి. అవి : సుబ్బరాయ, శ్రీనివాస, శ్రీ లక్ష్మి, P.V.S. మూర్తిమహల్, అన్సార్, వెంకట సీతారామ హాల్ లు మూతపడిసవి.

విద్యా సదుపాయాలుసవరించు

సంస్కృత కళాశాలసవరించు

పొన్నూరులోని శ్రీ సుందరవల్లీ రాజ్యలక్ష్మీ సమేత శ్రీ సాక్షి భావనారాయణస్వామి దేవస్థానం ఆవరణలో 1937లో వేద పాఠశాలను స్థాపించారు. 1950 లో ఆ పాఠశాలను సంస్కృత కళాశాలగా మార్చారు. ఈ కళాశాల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది.

పాములపాటి బుచ్చినాయుడు డిగ్రీ కాలేజిసవరించు

నిడుబ్రోలులో డిగ్రీ కాలేజిని 50 సంవత్సరముల క్రిందట పాములపాటి బుచ్చినాయుడు అనే వితరణ శీలి ఏర్పాటు చేశాడు. ఒక పంచాయతి గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు గావడం ఒక విశేషం.

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, నిడుబ్రోలు.సవరించు

అలపాటి సుబ్బారాయుడు బాలికల ఉన్నత పాఠశాలసవరించు

ఈ పాఠశాల స్థానిక సాయినగర్ లో ఉంది.

కొలను లక్ష్మీకాంతారావు మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాలసవరించు

ఈ పాఠశాల పాతపొన్నూరులో 24వ వార్దులో ఉంది.

మౌలిక సదుపాయాలుసవరించు

బ్యాంకులుసవరించు

ఆంధ్రాబ్యాంకు నిడుబ్రోలు శాఖ ఫోన్ నం. 08643/242194.

 • లోక్‌సభ నియోజకవర్గం: గుంటూరు
 • శాసనసభ నియోజకవర్గం: పొన్నూరు
 • రెవిన్యూ డివిజను: తెనాలి
 • ఆసియా ఖండంలోనే అపరాల ఎగుమతిలో ప్రథమ స్థానం.
 • పొన్నూరు పట్టణంలో కీ.శే.ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి ఇండోర్ స్టేడియమ్ ఉంది.

విశేషాలుసవరించు

నిడుబ్రోలులో ప్రభుత్వ మత్స్య శాఖ ఆధ్వర్యంలో, చేపపిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. పొన్నూరు పట్టణంలోని విద్యానగర్ లో ఉంటున్న షేక్ మహబూబ్ సుబానీ, భారత వాయుసేనలో ఎయిర్ వైస్ మాస్టర్ గా విధులు నిర్వహించుచున్నారు. వీరు తను పనిచేయుచున్న రంగంలో విశిష్టసేవలందించినందుకు గాను, 2016, మే-7న ఢిల్లీలో భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారి చేతులమీదుగా అతివిశిష్ట సేవా పురస్కారాన్ని అందుకున్నారు.[1]

పొన్నూరుకు చెందిన ధూళిపాళ్ళ రమేష్‌బాబు, రత్నశ్రీ దంపతుల కుమారుడు బాలచంద్రప్రసాద్, ఇటీవల స్పెయిన్‌దేశంలోని బార్సెలోనాలో నిర్వహించిన చదరంగం పోటీలలో, అంతర్జాతీయ మాస్టర్స్ టైటిల్‌ను గెల్చుకున్నాడు.[2]

మూలాలుసవరించు

మూస:Ref list

బయటి లింకులుసవరించు

చిత్రమాలికసవరించు

 1. ఈనాడు గుంటూరు సిటీ; 2016,మే-9; 2వపేజీ.
 2. ఈనాడు గుంటూరు సిటీ/పొన్నూరు; 2017,జులై-17; 2వపేజీ.
"https://te.wikipedia.org/w/index.php?title=పొన్నూరు&oldid=3148742" నుండి వెలికితీశారు