విధానాలు వికీ మౌలిక సూత్రాలను నిర్వచిస్తాయి. మార్గదర్శకాలు వాటిని ఎలా అమలు జరపాలో, పాటించాలో సూచిస్తాయి.
కంటెంటు – వ్యాసాలు తటస్థంగా ఉండాలి. ఇతర విశ్వసనీయ మూలాల్లో ఈ సరికే ప్రచురితమైన సమాచారం మాత్రమే రాయాలి.
నడవడి – వెనకాడకండి, మర్యాదగా ఉండండి. విభేదించిన సందర్భాల్లో చర్చ పేజీల్లో సదుద్దేశంతో, మర్యాదగా చర్చించి ఒక ఏకాభిప్రాయాన్ని సాధించండి.
మరింత సమాచారం
వికీపీడియా విధానాలు మార్గదర్శకాలపై ఇప్పుడూ మీకు తగినంత అవగాహన ఏర్పడి ఉంటుంది. ఇక దిద్దుబాట్లు మొదలుపెట్టండి! మరింత సమాచారం కోసం వికీపీడియా:విధానాలు మార్గదర్శకాలు చూడండి.
తరువాతి పాఠం కోసం మీరు, విజువల్ ఎడిటరును గానీ, వికీ మార్కప్ను గానీ ఎంచుకోవచ్చు. విజువల్ ఎడిటరు, వర్డు ప్రాసెసరు వలే అరచేతిలో ఉసిరి లాగా ఇంద్రియ సహజంగా ఉంటుంది. వికీ మార్కప్, వికీ కోడ్ను నేరుగా వాడుతూ మరింత వైవిధ్యంగా ఉంటుంది. మీరు దేన్నైనా ఎంచుకోవచ్చు. కొత్తవారికి విజువల్ ఎడిటరే సులువుగా ఉంటుంది.