సహాయం:పరిచయం
వికీపీడియా పరిచయం
వికీపీడియాకు స్వాగతం! ఇక్కడ, ఎవరైనా దాదాపు ఏ పేజీనైనా సరిదిద్దవచ్చు. వేలాది మంది ఈసరికే చేసారు కూడా.
వికీపీడియాలో మార్పుచేర్పులు చెయ్యాలనే సదాశయంతో సరికొత్తగా చేరినవారికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో తయారు చేసిన వివిధ పాఠాలకు ఈ పేజీ ముఖద్వారం వంటిది. ఈ పాఠాలు, వికీలోని ప్రాథమిక అంశాలన్నిటినీ స్పృశిస్తాయి. ఈ పాఠాలు చదవడానికి ఒక్కోదానికీ కొద్ది నిముషాలకు మించి పట్టదు. కొద్ది సమయం లోనే మీరొక వికీపీడియనుగా ప్రావీణ్యత సాధించవచ్చు!

