సాక్షి వైద్య (ఆంగ్లం: Sakshi Vaidya; 2000 జూన్ 19) ఒక భారతీయ నటి. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో అక్కినేని అఖిల్‌ హీరోగా రూపొందిన ఏజెంట్‌ (2023) చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది.[1] ఈ సినిమా 2023 ఏప్రిల్‌ 28న థియేటర్‌లో విడుదలై, సోనీ లివ్ ఓటీటీలో మే 19న విడుదలైంది.[2]

సాక్షి వైద్య
జననం (2000-06-19) 2000 జూన్ 19 (వయసు 23)
ఠాణె, మహారాష్ట్ర
జాతీయతఇండియన్
వృత్తినటి, మోడల్

2023 ఆగస్టు 25న విడుదలకు సిద్దమవుతున్న గాండీవధారి అర్జున సినిమాలో ఆమె వరుణ్ తేజ్ సరసన నటించింది.[3]

కెరీర్

మార్చు

మహారాష్ట్రలోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి వైద్య జన్మించింది. ఆమె చదువు పూర్తికాగానే ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ దిశగా పలు టీవీ ప్రచార చిత్రాల్లో నటించింది. మోడల్ గా మంచి పాపులారిటి సంపాందించింది. ఈ క్రమంలో బాలీవుడ్ సినిమా అవకాశాలకై ఎదురుచూస్తున్న ఆమెకు తెలుగులో ఏజెంట్ చిత్రబృందం హీరోయిన్ గా ఎంపిక చేసింది. ఆమె గ్లామర్ తో ఆకట్టుకోవడంతో ఈ చిత్రం చేస్తుండగానే మరిన్ని అవకాశాలు వస్తున్నాయి.

మూలాలు

మార్చు
  1. "Sakshi Vaidya | అఖిల్ 'ఏజెంట్' హీరోయిన్ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ రిలీజ్‌!". web.archive.org. 2022-06-20. Archived from the original on 2022-06-20. Retrieved 2022-06-20.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. telugu (18 May 2023). "ఈ వారం సినీ లవర్స్‌కు పండగే.. మే మూడో వారం ఓటీటీ/ థియేటర్‌లలో విడుదలయ్యే సినిమాలు ఇవే..!". Archived from the original on 19 May 2023. Retrieved 19 May 2023.
  3. Hindustantimes Telugu (10 June 2023). "వరుణ్ తేజ్ 'గాండీవధారి అర్జున' రిలీజ్ డేట్ ఫిక్స్.. స్టైలిష్ యాక్షన్ మూవీగా." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.