అక్కినేని అఖిల్ (జననం. ఏప్రిల్ 8 1994) భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటునిగా ఉన్నాడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున, అమల అక్కినేని ల కుమారుడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీతో ప్రారంభించాడు. అప్పటికి అతని వయస్సు ఒక సంవత్సరం. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున, ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేని లకు జన్మించాడు. నాగార్జున యొక్క మొదటి భార్య కుమారుడైన అక్కినేని నాగచైతన్య కూడా తెలుగు సినిమా నటుడే. ఆయన ప్రముఖ నటుడు, దర్శకుడు అయిన అక్కినేని నాగేశ్వరరావు యొక్క మనుమడు. ఆయన తన తండ్రివైపునుండి తెలుగు వారివైపు, తల్లి నుండి బెంగాలీ, ఐరిష్ వారసుడు.[2][3]

అక్కినేని అఖిల్
జననం (1994-04-08) 1994 ఏప్రిల్ 8 (వయస్సు: 26  సంవత్సరాలు)[1]
శాన్ ఓసె, కాలిఫోర్నియా, అమెరికా
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారత దేశం
జాతీయతఅమెరికా దేశస్థుడు
వృత్తినటుడు
క్రియాశీలక సంవత్సరాలు1995; 2014– ప్రస్తుతం
తల్లిదండ్రులుఅక్కినేని నాగార్జున
అమల అక్కినేని

ఆయన చైతన్య విద్యాలయలో విద్యను ప్రారంభించాడు. తరువాత ఆస్ట్రేలియాలో చదువును రెండేళ్ళపాటు కొనసాగించి తిరిగివచ్చి హైదరాబాదులోని ఓయాక్రిడ్జ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో పూర్తిచేసాడు. ఆయన తన 16 వ యేట నుండి సినీ ప్రస్థానంలోనికి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతడి తండ్రి కోరిక ప్రకారం బిజినెస్ మేనేజిమెంటులో చేరడానికి బదులు న్యూయార్క్ లోని లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్ం ఇనిస్టిట్యూట్ లో నటనా కోర్సులో చేరాడు.[4]

జీవితంసవరించు

అఖిల్ మొట్టమొదట సినీరంగంలో శివనాగేశ్వర రావు యొక్క సినిమా సిసింద్రీ (1995) లో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో ఒక సంవత్సర బాలునిగా నటించాడు. ఈ చిత్రం ఆంగ్ల హాస్య చిత్రం అయిన "బేబీస్ డే అవుట్" ఆధారంగా తీయబడింది. ఈ చిత్రంలో ఒక బాలుడు ఇంటి నుండి తప్పించుకొని అనేక ఒడిదుడుకులతో, హాస్య సన్నివేశాలతో ఇంటికి చేరే వరకు ఉంటుంది. ఈ సినిమా మంచి సమీక్షలను పొందింది.[5] ఆ తరువాత అఖిల్ బాలునిగా ఏ చిత్రంలోనూ నటించకుండా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ తన చదువు కొనసాగించాడు. 2010లో ఆయన తన తండ్రి యొక్క "నాగ్ కింగ్స్ టీమ్" క్రికెట్ లో ఆడాడు. ఈ క్రికెట్ మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొరకు నిథులు సమకూర్చడానికొరకు టాలీవుడ్ ట్రోఫీ పేరుతో నిర్వహింపబడింది. ఆ ఆటలో వెంకీ వారియస్ టీం పై ఆయన అర్థ సెంచరీ చేసాడు. ఆ ఆటలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్,, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ టైటిల్స్ ను కైవశం చేసుకున్నాడు.[6] ఆయన చేసిన అత్యధ్బుత ప్రదర్శన వల్ల 2011 లో సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ తరపున ఆడుటకు ఆహ్వానించారు. ఈ టోర్నమెంటులో ఆడి 2015 ఎడిషన్ లో కెప్టెన్ గా ఆ జట్టుకు నాయకత్వం వహించాడు.[7]

2014లో ఆయన విక్రం కుమార్ దర్శకత్వంలోని మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించాడు. ఈ చిత్రం అక్కినేని కుటుంబ సభ్యులతో వివిధ తరాలవారితో కూడినది. ఈ చిత్రం 2014 లో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అధిక లాభదాయకమైనది. ఇది ఉత్తమ చిత్రంగా ఫిలిం ఫేర్ పురస్కారంతో పాటు అనేక పురస్కారాలను పొందింది.[8][9] ఆయన ప్రసిద్ధమైన వ్యాపార ప్రకటనల అడ్వర్‌టైజ్ మేంట్స్ లో కల్కి కొచ్చిన్తో కలసి కార్బన్ ఫోన్, మౌంటైన్ డ్యూ, టైటాన్ వాచ్ లలో నటించాడు.[10] ఆయన మొదటి సినిమా కోసం అనేక కథలను అనేక దర్శకుల నుండి విని వి. వి. వినాయక్ యొక్క చిత్రంలో నటించడానికి అంగీకరించాడు. ఆ చిత్రం అఖిల్ (2015). ఈ చిత్రంలో నటించడానికి తయారవ్వడానికి ఆయన తాన వ్యక్తిగత స్టంట్ శిక్షకునిగా కిచ్చాను ఎంపిక చేసుకొని థాయిలాండ్లో రెండు నెలకు శిక్షణ పొందాడు.[4]

సినిమాలుసవరించు

సూచన
  ఇప్పటికీ విడుదల కాని చిత్రాన్ని సూచిస్తుంది.
సంవత్సరం చిత్రం పాత్ర దర్శకుడు వివరణ మూలం
1995 సిసింద్రీ (సినిమా) సిసింద్రీ శివ నాగేశ్వరరావు ఉత్తమ బాలనటునిగా ఫిలింఫేర్ [11]
2014 మనం అఖిల్ విక్రం కుమార్ క్లైమాక్స్ లో ఒక్కసారి కనబడతారు [12]
2015 అఖిల్ అఖిల్ వి. వి. వినాయక్ Filmfare Award for Best Male Debut – South [13]
2016 ఆటాడుకుందాంరా అతిథి పాత్ర జి. నాగేశ్వర రెడ్డి అతిథి పాత్ర
2017 హలో అవినాష్/శీను విక్రం కుమార్
2019 మిస్టర్ మజ్ను విక్రమ్ కృష్ణ వెంకీ అట్లూరి

మూలాలుసవరించు

 1. "Akhil Akkineni, 22-years-old". www.dnaindia.com. Cite web requires |website= (help)
 2. "I was mobbed by girls a few times: Akhil". The Times of India.
 3. http://www.rediff.com/movies/report/akhil-akkineni-to-get-engaged/20160908.htm
 4. 4.0 4.1 Sangeetha Devi Dundoo. "Akhil Akkineni". The Hindu.
 5. "Mama's boy". The Hindu.
 6. Staff Reporter. "Nag Kings lift Tollywood trophy". The Hindu.
 7. "Akhil to play in CCL matches". indiaglitz.com.
 8. "Small was big for southern cinema (IANS Special: 2014 In Retrospect)". Sify. మూలం నుండి 10 February 2015 న ఆర్కైవు చేసారు.
 9. "Winners: 62nd Britannia Filmfare Awards (South)". The Times of India.
 10. "Nagarjuna's son Akhil Akkineni to make his debut". Rediff. 25 December 2014.
 11. http://Refer[permanent dead link] Youtube"Britannia film fare awards 2016 hero akhil" he tolds one year old won best child actor award from Filmfare
 12. "I was quite nervous and excited while shooting for Manam : Akhil". The Times of India.
 13. "Winners of the 63rd Britannia Filmfare Awards (South)". మూలం నుండి 2017-07-04 న ఆర్కైవు చేసారు. Retrieved 2016-10-07. Cite web requires |website= (help)

ఇతర లింకులుసవరించు