సాధనా శూరులు
పద్మ శాలీలను మాత్రమే అర్చించే వారిని సాధనా శూరులు అని పిలుస్తూ వుంటారు. వీరి ప్రదర్శనాలను అందరికీ ప్రదర్శిస్తారు. ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి సంచారం చేస్తూ ప్రతి గ్రామం లోని పద్మశాలీల అనుమతితో వీరు ప్రదర్శనలు ప్రారంభిస్తారు. వీరి ప్రదర్శన ఇంద్ర జాలానికి సంబంధించింది. వీరి ప్రదర్శనం పగటి వేళే జరుగుతుంది. దీనిని పగటి వేషంగా భావించ వచ్చు. వీరి ప్రదర్శన కాలం మూడు గంటల వరకూ వుంటుంది. వీరి ప్రదర్శన రంగస్థలం గ్రామ కూడలిలో వున్న విశాల స్థలంలో జరుగుతుంది. వీరి కళారూపాల సాధనకు నిష్ట అవసరమంటారు. వీరి పనులు కనికట్టు గారడీగా వుంటాయి. ఉదాహరణకు వీరి ప్రదర్శనలో ఇరువురు వ్యక్తులు రెండు రేకు పళ్ళెములు తీసుకుని చేతులకు ఎదో ఆకు పసరు పూసుకుని దూరంగా నిలబడతారు. వారు చేతులకు పూసుకున్న పసరు ప్రభావం వల్ల వారి హస్తాల్లో వున్న పళ్ళెములు ఒక్కసారి పైకి ఎగిరి రెండు పళ్ళెములూ కొట్టుకుని మరల యథాస్థానాన్ని చేరుకుంటాయి.
రొమ్ముమీద ఆకు
మార్చుఅలాగే మరొక వ్వక్తి రొమ్ము మీద ఒక ప్రత్యేక మైన ఆకును అతికించి ఆ ఆకును గురి చూసి కొట్ట వలసిందిగా ఒక తుపాకిని ప్రేక్షకులలో ఎవరు ముందుకు వస్తే వారికిచ్చి రొమ్ము మీద ఆకును గురు పెట్టి కొట్ట మంటారు. అలా గురిచూచి ఎవరైనా కొట్టి నట్లైతే ఆ గుండు రొమ్ములోపలి భాగానికి పోక ఆ ఆకును కొట్టుకుని అక్కడే పడి పోతుంది. ఆ ప్రదేశంలో ఏ విధమైన గాయమూ మనకు కనిపించదు. ఇది కని కట్టో లేక ఆకు పసరు ప్రభావమో లేక ఇంద్ర జాలమో మనకు తెలియదు గానీ వారు ఇలాంటి ప్రదర్శనలో నిజంగా సాధనాశూరులే. ఈ సాధనా శూరులు ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోని హుజూరా బాద్ తాలూకా వల్లభా పురంలో వున్నారు. ఈ ప్రదర్శన ద్వారా వీరు జానపదులను దిగ్భ్రాంతులను చేస్తారు.
ప్రదర్శన చిత్రమాలిక
మార్చు-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
-
సాధనా శూరులు
సూచికలు
మార్చు- తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు వారు 1992 సంవత్సరంలో ముద్రించిన డా. మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారు రచించిన తెలుగువారి జానపద కళారూపాలు.