సాఫ్ట్‌వేర్ సుధీర్

సాఫ్ట్‌వేర్ సుధీర్ 2019, డిసెంబరు 28న విడుదలైన తెలుగు హాస్య చలనచిత్రం. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ నటించిన ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు.[1][2][3]

సాఫ్ట్‌వేర్ సుధీర్
Software Sudheer poster.jpg
దర్శకత్వంరాజశేఖర్ రెడ్డి
నిర్మాతశేఖర్ రాజు
నటులుసుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ, నాజర్, షాయాజీ, ఇంద్రజ, సంజయ్ స్వరూప్
సంగీతంభీమ్స్‌ సిసిరోలియో
ఛాయాగ్రహణంసి. రాం ప్రసాద్
నిర్మాణ సంస్థ
సురేఖ ఆర్ట్ క్రియేషన్స్
విడుదల
28 డిసెంబరు 2019
నిడివి
152 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథా నేపథ్యంసవరించు

అమాయ‌కుడైన చందు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తుంటాడు. అమ్మాయిలను చూసి ప్రేమించాలనుకుంటాడు. చందు అమాయ‌క‌త్వాన్ని గ‌మ‌నించిన‌ స్వాతి (ధ‌న్య‌ బాల‌కృష్ణ‌) అతన్ని ప్రేమ‌లో ప‌డేస్తుంది. ఇరు కుటుంబాలు అంగీకారంతో నిశ్చితార్థం జ‌రుగుతుంది. ఆ త‌రువాత స్వాతి కుటుంబంలో అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రగడంతో స్వాతి కుటుంబం ఓ స్వామీజీని క‌లుస్తారు. చందుని అడ్డుపెట్టుకుని అత‌ని తండ్రి ప‌నిచేస్తున్న మంత్రి ద‌గ్గ‌ర స్వామీ వెయ్యి కోట్లు కొట్టేస్తాడు. దాంతో చందూ కూడా ఇబ్బందుల్లో పడతాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది మిగతా కథ.

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

  • దర్శకత్వం: రాజశేఖర్ రెడ్డి
  • నిర్మాత: శేఖర్ రాజు
  • సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో
  • ఛాయాగ్రహణం: సి. రాం ప్రసాద్
  • నిర్మాణ సంస్థ: సురేఖ ఆర్ట్ క్రియేషన్స్

పాటలుసవరించు

ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందించాడు. సురేష్ ఉపాధ్యాయ, భీమ్స్‌ సిసిరోలియో, గద్దర్ పాటలు రాసారు. 2019, డిసెంబరు 25న హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో చిత్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ప్రేక్షకుల సమక్షంలో పాటలు విడుదలయ్యాయి.

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఇంత అందమే"  భీమ్స్‌ సిసిరోలియో 5:06
2. "అయ్యయ్యో"  భీమ్స్‌ సిసిరోలియో, స్వాతిరెడ్డి 4:56
3. "మేలుకో రైతన్న"  గద్దర్ 2:55
4. "కోయంబత్తూరే"  రఘురాం, స్వాతిరెడ్డి 3:59
5. "యు ఆర్ మై ఐడెంటిటీ"  రఘురాం  

విడుదల - స్పందనసవరించు

2019, డిసెంబరు 28న విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుండి మిశ్రమ స్పందనలు అందుకుంది.

మూలాలుసవరించు

  1. "Software Sudheer". Times of India. 28 December 2019. Retrieved 4 January 2020.
  2. "Software Sudheer Cast and Crew". Book My Show. Retrieved 4 January 2020.
  3. "I imitated both Rajinikanth and Pawan Kalyan in 'Software Sudheer': Sudigali Sudheer". Times of India. 8 November 2019. Retrieved 4 January 2020.

ఇతర లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో సాఫ్ట్‌వేర్ సుధీర్