సామ్రాట్ (నటుడు)
సామ్రాట్ రెడ్డి భారతదేశానికి చెందిన మోడల్ మరియు తెలుగు సినిమా నటుడు.ఆయన 2004లో విడుదలైన యువకులు సినిమా ద్వారా సినిమారంగంలోకి అడుగు పెట్టాడు.సామ్రాట్ బిగ్‌బాస్ సీజన్ 2లోొ కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.
సామ్రాట్ రెడ్డి | |
---|---|
జననం | గూడూరు వెంకట సత్య కృష్ణ రెడ్డి 6 ఏప్రిల్ 1983 హైదరాబాద్, తెలంగాణ |
వృత్తి | నటుడు |
జీవిత భాగస్వామి | అంజనా శ్రీ లిఖిత [1] |
తల్లిదండ్రులు | జి.జీవిత్ రెడ్డి, జయ రెడ్డి |
బంధువులు | శిల్పా రెడ్డి (సోదరి) |
జననం, విద్యాభాస్యం సవరించు
సామ్రాట్ 6 ఏప్రిల్ 1983లో హైదరాబాద్ లో జి.జీవిత్ రెడ్డి, జయ రెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు సికింద్రాబాద్ లోని సెయింట్ ప్యాట్రిక్స్ స్కూల్ లో చదివాడు. సామ్రాట్ ఉస్మానియా యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.
సినీ జీవితం సవరించు
సామ్రాట్ 2005లో విడుదలైన యువకులు సినిమా ద్వారా సినీరంగంలోకి వచ్చాడు. ఆయన పంచాక్షరీ, W/O రామ్, అహ నా పెళ్ళంట , కొంచెం ఇష్టం కొంచెం కష్టం , కిట్టు ఉన్నాడు జాగ్రత , బావ, మాలిని & కో లాంటి సినిమాల్లో నటించాడు.
వివాహం సవరించు
సామ్రాట్ 2015లో హర్షిత రెడ్డిని వివాహమాడాడు. ఆయన 2018లో ఆమెతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయాడు. సామ్రాట్ 2020లో కాకినాడలో నవంబర్ 5న అంజనా శ్రీ లిఖిత ను రెండో వివాహం చేసుకున్నాడు.[2]
నటించిన సినిమాలు సవరించు
సంవత్సరం | సినిమా పేరు | భాషా | పాత్ర పేరు | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2005 | యువకులు | తెలుగు | ||
2004 | రామ్ గోపాల్ వర్మ | తెలుగు | సామ్రాట్ | |
2004 | సొమెథింగ్ స్పెషల్ | తెలుగు | మదన్ | |
2008 | వినాయకుడు | తెలుగు | ||
2008 | ఏక్ పోలీస్ | తెలుగు | ||
2009 | కొంచెం ఇష్టం కొంచెం కష్టం | తెలుగు | సుభోద్ | |
2010 | పంచాక్షరీ | తెలుగు | శ్రీరామ్ | |
2010 | తకిట తకిట | తెలుగు | చందాన కాబోయే భర్తగా | |
2010 | బెట్టింగ్ బంగార్రాజు | తెలుగు | బంగారాజు మిత్రుడు | |
2010 | బావ | తెలుగు | రమణ | |
2011 | పాయిజన్ | తెలుగు | సామ్రాట్ | |
2011 | అహ నా పెళ్ళంట | తెలుగు | శ్రీహరి తమ్ముడిగా | |
2011 | ప్రేమ కావాలి | తెలుగు | బంగారాజు మిత్రుడు | |
2012 | మిస్టర్ నూకయ్య | తెలుగు | రమణ | |
2012 | దేనికైనా రేడీ | తెలుగు | కృష్ణ శాస్త్రి | |
2013 | దూసుకెళ్తా | తెలుగు | డా. విశ్రాంత్ | |
2013 | 1000 అబద్దాలు | తెలుగు | బంగారాజు మిత్రుడు | |
2014 | భీమవరం బుల్లోడు | తెలుగు | ||
2015 | మాలిని & కో | తెలుగు | ||
2017 | కిట్టు ఉన్నాడు జాగ్రత | తెలుగు | ||
2018 | W/O రామ్ | తెలుగు | బంగారాజు మిత్రుడు |
మూలాలు సవరించు
- ↑ Eenadu (15 November 2020). "ఘనంగా నటుడు సామ్రాట్ వివాహం - Samrat Reddy and Likhita all smiles after tying the knot". www.eenadu.net. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
- ↑ Sakshi (5 November 2020). "బిగ్‌బాస్ కంటెస్టెంట్ రెండో వివాహం". Sakshi. Archived from the original on 17 జూన్ 2021. Retrieved 17 June 2021.
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)