బావ 2010 అక్టోబరు 29 న విడుదలైన తెలుగు చిత్రం. సిద్దార్థ్, ప్రణీత, గద్దె రాజేంద్ర ప్రసాద్ ప్రధాన తారాగణం. రాంబాబు దర్శకత్వంలో శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంఎల్ పద్మ కుమార్ చౌదరి నిర్మించాడు. చక్రి సంగీతం సమకూర్చాడు.[1] ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అపజయం పొందింది. ఈ మూవీని బంగ్లాదేశ్ బెంగాలీలో భలోబాసర్ రోంగ్గా 2012 లో రీమేక్ చేశారు.

బావ
దర్శకత్వంరాంబాబు
రచనరాంబాబు
నిర్మాతఎం. ఎల్. కుమార్ చౌదరి
తారాగణంసిద్దార్థ్,
ప్రణీత,
తనికెళ్ళ భరణి
గద్దె రాజేంద్ర ప్రసాద్,
ఆలీ (నటుడు)
బ్రహ్మానందం
ఆహుతి ప్రసాద్
ఛాయాగ్రహణంఅరవింద్ కృష్ణ
సంగీతంచక్రి
పంపిణీదార్లుశ్రీ కీర్తి కంబైన్స్
దేశంభారతదేశం భారతదేశం
భాషతెలుగు

వీరబాబు ( సిద్ధార్థ్ ) తల్లిదండ్రులతో కలిసి ఒక గ్రామంలో నివసించే యువకుడు. అతని తండ్రి సీతారాముడు ( రాజేంద్ర ప్రసాద్ ) ఒక పెద్ద కుటుంబానికి చెందిన ఒక అమ్మాయి ( పవిత్ర లోకేష్ ) ను ఆమె కుటుంబ అభీష్టాలకు విరుద్ధంగా పెళ్ళి చేసుకుంటాడు. ఆమె పెద్దలు వారిని తమ కుటుంబంలో భాగంగా అంగీకరించరు. తన భార్యను ఆమె కుటుంబం నుండి వేరు చేసానే అని తన జీవితమంతా సీతారామ్ బాధపడుతూంటాడు. ఒక పెద్ద కుటుంబంలో తానూ భాగం కావాలని ఆరాటపడుతూంటాడు. తన కుమారుడు వీరబాబు పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని కోరుకుంటాడు. ఇంతలో, వీరబాబు సమీప గ్రామానికి చెందిన వరలక్ష్మి ( ప్రణిత ) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. తరువాత ఆమె వీరబాబు తల్లి తరపున బంధువు అని తెలుస్తుంది. ఆమె బంధువులు వారి వివాహానికి అంగీకరించరు. తన కుమారుడి విధి తనలాగే జరుగుతుందని బాధపడుతున్న సీతారామ్, కొడుకు వరలక్ష్మిని పెళ్ళి చేసుకోకుండా నిరోధించడానికి ప్రయత్నిస్తాడు. అయితే, తరువాత అతను తన కొడుక్కు సహాయం చేస్తాడు. వీరబాబు తన ప్రియురాలి కుటుంబ సభ్యుల హృదయాలను ఎలా గెలుచుకుంటాడు వారి కుటుంబం ఈ జంటను ఎలా అంగీకరిస్తుందనేది మిగతా కథ

తారాగణం

మార్చు

సాంకేతిక సిబ్బంది

మార్చు

పాటలు

మార్చు
సం.పాటపాట రచయితగాయనీ గాయకులుపాట నిడివి
1."పన్నెండేళ్ళ ప్రాయం"అనంత శ్రీరామ్కీరవాణి6:14
2."నా రామచిలక"భాస్కరభట్ల రవికుమార్వాసు4:56
3."మిలమిలమని సూర్య"కందికొండరంజిత్, హరిణి5:00
4."నగర నగారా"కందికొండచక్రి, గీతామాధురి4:50
5."రుద్రుడు రాముడు"వనమాలిమనో4:31
6."బావా బావా"రామజోగయ్య శాస్త్రిసిద్దార్థ5:40
మొత్తం నిడివి:31:25

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. "Siddharth's Baava releasing on Oct 29". Archived from the original on 8 December 2010.