ప్రేమ కావాలి
ప్రేమ కావాలి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించిన 2011 నాటి సినిమా. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణంతో, కె. అచ్చి రెడ్డి నిర్మించాడు. ఈ చిత్రంలో ఆది, ఇషా చావ్లా ప్రధాన పాత్రల్లో నటించారు.
ప్రేమ కావాలి (2011 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయ భాస్కర్ |
---|---|
నిర్మాణం | ఆర్.ఆర్.వెంకట్ |
తారాగణం | ఆది దేవ్ గిల్ నాజర్ సింధు తులాని బ్రహ్మానందం |
నిర్మాణ సంస్థ | మేక్స్ ఇండియా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 25 జనవరి 2011 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కొత్తగా వచ్చిన నటులకు హైదరాబాద్ టైమ్స్ ఇచ్చే అవార్డును 2011 లో ఆదీ గెలుచుకున్నాడు.[1] 2012 యొక్క ఉత్తమ తొలి నటుడిగా సినీమా అవార్డులు (2012) 2011 లో ఉత్తమ పురుష అరంగేట్రం కొరకు ఫిలింఫేర్ అవార్డ్స్ సౌత్ పురస్కారం గెలుచుకున్నాడు [2] ఇది 100 రోజులు నడిచింది. దీనిని బ్లాక్ బస్టర్ గా ప్రకటించారు.
కథ
మార్చుప్రేమా ( ఇషా చావ్లా ) నిజాయితీగల, కఠినమైన పోలీసు అధికారి ( నాసర్ ) కుమార్తె. కానీ ప్రస్తుతం ఆమెను ఒక వ్యక్తి (షఫీ) బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు00. ప్రేమ యొక్క ఉద్రిక్తతను ఆమె వదిన ( సింధు తోలాని ) గమనిస్తుంది. ఇది ఫ్లాష్ బ్యాక్ ను వెల్లడిస్తుంది.
శ్రీమ ( ఆది ), ప్రేమకు క్లాస్మేట్. ఆమెను ప్రేమిస్తున్నాడు. అయితే, ప్రేమ అతడి ప్రేమ భావాలకు స్పందించదు, కానీ అతనితో స్నేహం చేస్తుంది. కానీ ఊహించని పరిస్థితిలో, శ్రీను ప్రేమను ముద్దు పెట్టుకుంటాడు. ఇది ఆమె శ్రీనును ద్వేషించేలా చేస్తుంది. అది ఆమె చింతలకు కారణం అవుతుంది. ఆ ఫోటోలను బ్లాక్ మెయిలర్ తన తండ్రికి మెయిల్ చేస్తానని చెప్తాడు. ప్రేమ వదిన ఖమ్మంలోని శ్రీను ఇంటికి వెళ్తుంది, అక్కడ శ్రీను ఎన్‌సిసి శిక్షణ నుండి తిరిగి వస్తాడు. అతను, మొత్తం కథ విన్న తరువాత, అన్ని సమస్యలను పరిష్కరిస్తానని ప్రతిజ్ఞ చేసి హైదరాబాద్ వెళ్తాడు.
మొదట్లో శ్రీను దర్యాప్తు చేయడం కష్టమే అయినప్పటికీ, తరువాత అతను చైన్ రాజా ( అలీ ) అనే చైన్ స్నాచర్‌ను నియమిస్తాడు. ఆమెను అనుసరించి వెళ్తూ తాను గమనించినది ఆదికి చెప్పడం అతడి పని. ఇంతలో, ఈ బ్లాక్ మెయిల్ వెనుక అసలు వ్యక్తి ఠాగూర్ (దేవ్ గిల్). అతను భయంకరమైన మాఫియా డాన్, ఉగ్రవాద గ్రూపుల ఆదేశాల మేరకు ఒక ఉగ్రవాదిని జైలు నుండి విడిపించడనికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఉగ్రవాది ప్రేమ తండ్రి అదుపులో ఉన్నాడు. అప్పుడు ప్రేమ ఒక పాత ఇంటికి డబ్బు తీసుకువెళ్తుంది. అక్కడ బ్లాక్ మెయిలర్ మారువేషంలో ఉంటాడు. అతను డబ్బు మొత్తాన్ని తీసుకుంటాడు, ఫోటోలు ఇస్తాడు. తెలివిగా ప్రేమ తండ్రి ఇ-మెయిల్ ఐడి పాస్వర్డ్ను తీసుకుంటాడు. ఇందులో ఉగ్రవాది జైలు శిక్ష వివరాలు ఉంటాయి. ఠాగూర్ అనుచరులు ప్రేమ నుండి ఫోటోలను లాక్కునే ముందే, శ్రీను ఆమెను కాపాడి, ఆ ఫోటోలను కాల్చేస్తారు.
ఇక శ్రీను ఉగ్రవాదుల కుట్రలను భగ్నం చెయ్యడం తన ప్రేమను దక్కించుకోవడం మిగతా సినిమా కథ.
తారాగణం
మార్చు- శ్రీనుగా ఆది
- ప్రేమాగా ఇషా చావ్లా
- ఠాగూర్‌గా దేవ్ గిల్
- ప్రేమా తండ్రిగా నాసర్
- శ్రీను తండ్రిగా నాగబాబు
- శ్రీను తల్లిగా జయసుధ
- ప్రేమా సోదరిగా సింధు తోలాని
- సెర్లింగం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బ్రహ్మానందం
- చైన్ రాజాగా అలీ
- అప్పా రావుగా షఫీ
- గుండు సుదర్శన్
- సుప్రీత్
- సామ్రాట్
పాటలు
మార్చుక్రమసంఖ్య | పేరు | గాయనీ గాయకులు | నిడివి | ||||||
---|---|---|---|---|---|---|---|---|---|
1. | "డం డం డోలు బాజే" | బెన్నీ దయాళ్ | 5:10 | ||||||
2. | "చిరునవ్వే విసిరావే" | విజయ్ ప్రకాష్ | 4:04 | ||||||
3. | "తొలకరి చినుకై" | రంజిత్, శ్రేయా ఘోషాల్ | 4:48 | ||||||
4. | "లిజన్ టు మై హార్ట్" | అనుజ్, అంజనా సౌమ్య | 4:12 | ||||||
5. | "మనసంతా ముక్కలు చేసి" | కెకె | 4:13 | ||||||
6. | "నువ్వే నువ్వే నా" | చిత్ర, విజయ్ ప్రకాష్ | 4:22 | ||||||
7. | "చిరునవ్వే విసిరావే" (Remix) | విజయ్ ప్రకాష్ | 3:55 | ||||||
8. | "ఓ బేబీ వై డిడ్ యు హవ్ టు గో" (మనసంత ముక్కలు చేసి (ఇంగ్లీషు)) | విజయ్ ప్రకాష్ | 4:13 | ||||||
33:57 |
పురస్కారాలు
మార్చుసైమా అవార్డులు
మార్చు2011 సైమా అవార్డులు
మూలాలు
మార్చు- ↑ "The Hyderabad Times Film Awards 2011". The Times of India. 26 June 2012. Archived from the original on 2013-07-18. Retrieved 2020-08-26.
- ↑ "The 59th Idea Filmfare Awards 2011(South)". The Times of Inia. 9 July 2012. Archived from the original on 2013-07-04. Retrieved 2020-08-26.