సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి

సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో నంద్యాల నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

శిల్పా రవిచంద్రారెడ్డి
సింగారెడ్డి గారి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2019 - ప్రస్తుతం
ముందు భూమా బ్రహ్మనంద రెడ్డి


వ్యక్తిగత వివరాలు

జననం 18 సెప్టెంబర్ 1983
నంద్యాల , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు శిల్పా మోహన్ రెడ్డి, రమాదేవి
జీవిత భాగస్వామి నాగిని రెడ్డి
సంతానం సశ్యరెడ్డి, ఈషిర్‌రెడ్డి
నివాసం నంద్యాల

జననం, విద్యాభాస్యం మార్చు

శిల్పా రవిచంద్రారెడ్డి 18 సెప్టెంబర్ 1983లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, నంద్యాల లో శిల్పా మోహన్‌రెడ్డి, రమాదేవి దంపతులకు జన్మించాడు. ఆయన బీఎస్సీ (అగ్రికల్చర్‌) పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం మార్చు

శిల్పా రవిచంద్రారెడ్డి తన తండ్రి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన నంద్యాల నియోజకవర్గంలో శిల్పా సహకార్‌ సంస్థ ద్వారా మహిళలకు పావలా వడ్డీ రుణం,చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు పేదలకు వివాహ కార్యక్రమాలు, పేద ప్రజల వైద్యం కోసం ఆర్థిక సాయం తన సొంత నిధులతో నిర్వహించి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

శిల్పా రవిచంద్రారెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నంద్యాల నియోజకవర్గం నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి పై 34,560 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[4]

మూలాలు మార్చు

  1. BBC News తెలుగు (24 May 2019). "ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన యువత వీళ్లే". BBC News తెలుగు. Archived from the original on 26 May 2021. Retrieved 26 May 2021.
  2. https://www.oneindia.com/elections/andhra-pradesh-mlas-list/
  3. Sakshi (18 March 2019). "కర్నూలు జిల్లా... అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.
  4. Sakshi (2019). "Nandyal Constituency Winner List in AP Elections 2019 | Nandyal Constituency MLA Election Results 2019". Archived from the original on 17 September 2021. Retrieved 17 September 2021.