సింగినాదం జీలకర్ర
భాషా సింగారం |
---|
సామెతలు |
జాతీయములు |
పొడుపు కథలు |
ఆశ్చర్యార్థకాలు |
నీతివాక్యాలు |
శృంగం అంటే కొమ్ము అని అర్థం. పూర్వం కొమ్ములతో బాకాలు (mouth horns) తయారు చేసి ఊదే వారు. ఎవరైనా ఆ ఊదుడు లాగ వితండ వాదం చేస్తే "సింగినాదం చెయ్యకు" అని తిట్టే వారు. రేవు దగ్గరకి పడవలు వచ్చినప్పుడు కూడా అవి వచ్చాయని సూచించడానికి శృంగాలు ఊదేవారు. ఆ పడవలలో సాధారంగా జీలకర్ర,, బెల్లం లాంటివి ఉంటాయి తప్ప పెద్ద సరుకేమీ ఉండదు. ఎవడైనా చిన్న విషయాల కోసం సింగినాదం చేస్తే ఇది సింగినాదం జీలకర్ర గోల లాగ ఉంది అని అంటారు.
చరిత్ర
మార్చు16వ శతాబ్దములో రాయలు వారు అస్తమించారు. ఆంధ్రరాజ్యము దిక్కులేని దివాణ అయినది. రాయలు అనంతరం రాజ్యము అరాచకమై చాలా అల్లకల్లోలాలు జరిగినట్లు చరిత్ర. ఆసందర్భములో తురుష్క ప్రభువులొక ప్రక్కనుండి తెలుగుభూమిని కబళించారు. అపుడు బలిష్ఠులైన కొందరు తురుష్కులు నాధుడులేని తెలుగుగడ్డమీదపడి అర్ధరాత్రనక, అన్నప్రొదనక లూఠీచేసి వస్తువాహనాలు చేజెక్కించుకుపోయినారు. ఈతుంటరిమూక ఊరుబయట విడిసి తామువచ్చినట్లు గుర్తుకోసం వాళ్ళధర్మమా అంటూ సింగినాదం (శృంగనాదం) చేస్తూండేవారు. ఆసింగినాదం వినడమే ప్రజలకు పైప్రాణాలు పైననే పోయేవి. అపుడు జనులు మూటా, ముల్లే కట్టుకొని పారిపోయేవారు. కానీ ఈలోపనే మూకలు పైబడి ఊళ్ళు దోచుకొనేవారు.సరిగా ఆసమయంలోనే కాబూలు దేశం నుండి ఆఫ్ఘనుల మూకలు జీలకర్ర బస్తాలు వేసుకొని హిందూదేశానికి కొత్తగా దిగుమతి చేస్తూండేవారు. వాళ్ళుకూడా ఊరిబయట తమరాకకు గుర్తుగా వేరొక మాదిరిగా ధ్వనిగల సింగినాదం (A horn, a trumpet) చేస్తూండేవారు. ప్రజలు ఈ రెండువిధానాలయిన సింగినాదాలు వినడంలో కళవళపడేవారు. అపుడెవరో బుద్ధిమంతుడుండి ఓరినాయినలారా అదితురుక గుంపుల సింగినాదం కాదు. కాబూలువారి జీలకర్ర సింగినాదంమోయి. మనం భయపడనక్కర్లేదు. అని తెలియజెప్పినమీదట ప్రజలు భయపడడం ఆపి నిర్లక్ష్యంగా నిద్రించేవారట. అప్పట్నుంచి క్రమంగా నిర్లక్ష్యార్ధంలో జీలకర్ర సింగినాదం అలవాటయిపోయిందని పెద్దలు అంటారు.