సిండికేట్ బ్యాంకు

(సిండికేట్ బ్యాంక్ నుండి దారిమార్పు చెందింది)

1925లో కర్ణాటక రాష్ట్రములోని ఉడిపి లో సిండికేట్ బ్యాంకు (Syndicate Bank) స్థాపించబడింది. ఈ బ్యాంకు సంస్థాపకులు ఉపేంద్ర అమర్‌నాథ్ పాయ్, వామన్ కుడ్వా, టి.ఎం.ఏ.పాయ్ లు. ఇది భారతదేశం లోని ప్రాచీన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. ప్రారంభ సమయంలో దీని పేరు కెనరా ఇండస్ట్రియల్ అండ్ బ్యాంకింగ్ సిడికేట్ లిమిటెడ్. 1969, జూలై 19ఇందిరా గాంధీ ప్రభుత్వం జాతీయం చేయబడిన 14 బ్యాంకులలో ఇది కూడా ఒకటి.

జహీరాబాద్ లోని సిండికేట్ బ్యాంకు శాఖ

ఈ బ్యాంకు ప్రారంభ మూలధనం రూ.8000 కోట్లు. 1928లో ఈ బ్యాంకు తొలి శాఖ కర్ణాటక లోని దక్షిణ కన్నడ జిల్లాలోని బ్రహ్మవర్లో ప్రారంభించబడింది. ఈ బ్యాంకు ప్రధాన లక్ష్యం క్రిందివర్గాల వారికి ఆర్థిక సహాయం అందజేయడం. ప్రారంభంలో ఏజెంట్ల ద్వారా ఇంటింటికీ త్రిప్పించి రెండు అణాల పొదుపులను కూడా స్వీకరించింది. ఈ విధానము మనదేశంలో ఈప్పటికీ అనేకబ్యాంకులు ముఖ్యంగా పోస్టల్ శాఖ చిన్న తరహా పొదుపు పథకాల ద్వారా స్వీకరిస్తున్నాయి. ఈ విధానమే పిగ్మీ డిపాజిట్ స్కీము (Pigmy Deposit Scheme.) గా ప్రసిద్ధి చెందింది.

కాలక్రమంలో ఈ బ్యాంకులో 20 వరకు ఇతర చిన్న బ్యాంకులు విలీనమయ్యాయి. ఈ బ్యాంకు నామం కూడా 1964లో సిండెకేట్ బ్యాంకు లిమిటెడ్ గా మార్పు చెందింది. బ్యాంకు ప్రధాన స్థావరం కూడా మణిపాల్కు మార్పు చేశారు. దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా దీని శాఖలు ఏర్పాటు చేశారు. లండన్లో తొలి విదేశీ శాఖ ప్రారంభించబడింది. దోహ, మస్కట్ లలో కూడా మారకపు బ్యాంకుగా సేవలందిస్తోంది.

1978లో ఢిల్లీ లోని హౌజ్ ఖాస్ లో ఈ బ్యాంకు 1000 వ శాఖను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు 3250 కి పైగా శాఖలున్నాయి. అందులో 3250 పైగా శాఖలు కోర్-బ్యాంకుంగ్, ఈ-బ్యాంకుంగ్ సేవలందిస్తున్నాయి.

భారతదేశంలో మొదటిసారిగా సిండికేట్ బ్యాంకు ప్రథమ గ్రామీణ బ్యాంకు (Prathama Grameena Bank) పేరుతో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను స్పాన్సర్ చేసింది. Tసిండికేత్ బ్యాంకు స్టాక్స్ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, మంగళూరు స్టాక్ ఎక్స్ఛేంజ్, బెంగుళూరు స్టాక్ ఎక్స్ఛేంజ్ లలో లిస్టింగ్ అవుతున్నాయి.

సిండికేట్ బ్యాంకు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాంతో కల్సి సంయుక్తంగా సోలార్ లోన్ పథకాన్ని (solar loan programme) విజయవంతంగా నిర్వహిస్తోంది.

ఇవి కూడా చూడండి

మార్చు

బయటి లింకులు

మార్చు